Naga Panchami January 13th: ఇది కదా అసలైన ట్విస్ట్.. నాగలోకం వెళ్లింది పంచమి కాదు.. ఏవరంటే?
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ మరింత అద్భుతంగా సాగుతుంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు అయితే ఏకంగా బాహుబలి రేంజ్ ట్విస్ట్ చేసుకుంది. నిన్నటి ఎపిసోడ్ లో పంచమి పాముగా మారి మోక్షను కాటేయడం.. ఫణీంద్రతో కలిసి నాగలోకం వెళ్లడం చూపించారు. అలాగే మేఘన పంచమి నాగమణి తీసుకు వచ్చి తనకు ఇచ్చిన్లు కళలు కంది. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ మరో అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చారు సీరియల్ నిర్వాహకులు. ఎవరూ కళలో కూడా ఊహించని విధంగా మార్చేశారు. పంచమి... మోక్షను కాటేయకముందు జరిగిన విషయాలను చూపించారు.
పంచమి మోక్షను కాటేయకముందు... అంటే మోక్ష, పంచమిలు నాగసాధువును కలిసిన దగ్గరి నుంచి చూపించుకుంటూ వచ్చారు. ఈక్రమంలోనే నాగ సాధువు ఫణీంద్రపై అనుమానం వ్యక్తం చేశారు. నాగమణిని తీసుకు రావడం అసంభవం అని.. అయినా అతడు మీకెలా సాయం చేస్తానన్నాడు.. నాకైతే నమ్మకం కల్గట్లేదంటూ నాగ సాధువు చెబుతాడు. దానికి మోక్ష.. నేను అన్నింటికి తెగించాను స్వామి నా ప్రాణం పోయినా ఫర్వాలేదని అంటాడు. మరోవైపు పంచమి మాత్రం మీరు అలా మాట్లాడుతుంటే నాకు కూడా ఫణీంద్రపై నమ్మకం తగ్గుతుందని అంటుంది. ఇక ఆ తర్వాత ఫణీంద్రను చూపిస్తారు.

పాముగా మారి వస్తున్న ఫణీంద్రకు ఎదురుగా ఐదు తలల పాము కనిపిస్తుంది. దాన్ని చూసి ఫణీంద్ర భయంతో గజగజా వణికిపోతాడు. ఆ పాము బుసలు కొడుతూ పైపైకి వస్తుండగా... ఏమీ చేయలేక ఫణీంద్రం ఆ పాముకు దండం పెడతాడు. దీంతో వెనక్కి వెళ్లిపోయిన పాము సుబ్బులా మారిపోతుంది. తన భక్తురాలిని నమ్మించి మోసం చేయడం చాలా తప్పు అని.. నమ్మక ద్రోహం కంటే పెద్ద తప్పు ఇంకేదీ ఉండదని అంటాడు. తాను అలా చేయాలనుకున్న మాట వాస్తవమే అయినా ఇకపై చేయనని అంటాడు. నువ్వు మనసులో తప్పు చేయాలని భావిస్తేనే నీకు ఈ భయంకరమైన పాము కనిపించింది.. ఇక తప్పు చేస్తే అదే పెనుభూతమై నీ ప్రాణాలు తీస్తుందని సుబ్బు వివరిస్తాడు.
కళలో, మనసులోకి కూడా తప్పుడు ఆలోచనలు రానివ్వనంటూ ఫణీంద్ర చెప్పగానే.. సుబ్బు మాయం అయిపోతాడు. ఇక ఆ తర్వాత ఫణీంద్ర నేరుగా పంచమి వాళ్లు ఉన్న చోటుకు వెళ్తాడు. అక్కడే నాగ సాధువును చూసి దండం పెడతాడు. తాను యజ్ఞాన్ని ఆపబోయినందుకు క్షమించమని అడుగుతాడు. ఆ తర్వాత పంచమి గురించి మాట్లాడుకుంటారు. తాను పంచమికి కచ్చితంగా సాయం చేస్తానని చెప్పానని... పంచమి మోక్షను కాటేసి నాగలోకం వస్తే నాగమణి తీసుకు వచ్చేందుకు తాను అండగా ఉంటానని అంటాడు. దీనికి వెంటనే నాగ సాధువు నాగమణిని తీసుకు రావడం కంటే కూడా చంద్రకాంత మొక్కను తీసుకు రావడం మంచిదని అంటాడు.

చంద్రకాంత మొక్కను అయినా సరే తీసుకు వస్తానని ఫణీంద్ర అంటాడు. కానీ పంచమి దానికోసం నేను రాకపోయినా సరే కదా అని అనగానే మీరు నాగలోకం రారా అని అడుగుతాడు. మీరు వస్తానంటేనే నేను మీకు సాయం చేస్తానని చెప్పాను కదా అని ఫణీంద్ర చెబుతాడు. మరోవైపు కరాళీ రూపంలో ఉన్న మేఘన వీరి కోసం వస్తుంటుంది. అయితే ముందుగా అంజనం వేసుకుని చూసుకున్న ఈమె వారు మాట్లాడుకునేదంతా వింటుంది. నాగమణికి బదులుగా చంద్రకాంత మొక్క తెస్తారేమోనని భయపెడుతుంది. ఈక్రమంలోనే మహాకాళిని ఆవాహనం చేసుకోగా.. అమ్మవారు దర్శనం ఇస్తారు.
మహాకాళి ప్రత్యక్షం కాగానే.. కరాళీ తనను పంచమి రూపంలోకి మారి నాగలోకం వెళ్లేలా చేయమని అంటుంది. అయితే అందుకు ఒప్పుకున్న అమ్మవారు కానీ నాగలోకం వెళ్లాకా నీ శక్తులు అన్నీ మాయం అయిపోతాయని అంటుంది. అయినా సరే తనకు ఆ రూపం కావాలనగానే అమ్మవారు దీవిస్తారు. ఇలా మేఘన పంచమిలా మారిపోతుంది. ఆ తర్వాత ఫణీంద్ర.. పంచమి రూపంలో ఉన్న కరాళీని చూసి పంచమియే అనుకుని నాగలోకం వెళ్లేందుకు చెప్పాల్సిన మంత్రాన్ని చెబుతాడు. ఇదంతా రేపటి ఎపిసోడ్ లో మనం చూడవచ్చు. చూడాలి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











