బిగ్ బాస్ వల్ల నా కెరీర్ నాశనం.. ఉన్న ఆఫర్స్ పోయాయి..
Bigg Boss Telugu: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ఏదైనా ఉందంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు బిగ్ బాస్. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ గేమ్ షో ఇప్పటికి వరకు ఎనిమిది సీజన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని, ప్రస్తుతం తొమ్మిదో సీజన్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. గతంలో ఎప్పుడూలేని విధంగా ఈ సీజన్ కు అత్యంత ఆదరణ లభిస్తుంది. అయితే ఈ షోపై ప్రతి ఒక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. ముఖ్యంగా ఈ షోలో పాల్గొన్న కొంత మంది కంటెస్టెంట్లు బయటికి వచ్చిన తర్వాత ఎదుర్కొన్న అనుభవాలను షేర్ చేస్తూ షో నిర్వహణపై విమర్శలు చేస్తుంటారు. తాజాగా ఓ మాజీ కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ పై షాకింగ్ చేసింది. ఆ కంటెస్టెంట్ ఎవరు? ఏమన్నారంటే?
బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కంటెస్టెంట్ ఎవరో కాదు టాలీవుడ్ నటి కరాటే కల్యాణి. సినిమాల్లో విలన్, క్యారెక్టర్ రోల్స్, కామెడీ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కరాటే కల్యాణి బిగ్ బాస్ తెలుగు 4లో పాల్గొన్న విషయం తెలిసిందే. తన డేరింగ్ అండ్ డ్యాషింగ్ మాట తీరుతో ఆ షోలో హైలైట్ గా నిలిచింది. కానీ, ఆమె దూకుడు స్వభావం వల్ల బిగ్ బాస్ షోలో ఎక్కువ రోజులు నిలవలేక మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ తరువాత ఎన్నో కార్యక్రమాల్లో నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్యాణి, బిగ్ బాస్ అనుభవం తన కెరీర్‌ను ఎలా ప్రభావితం చేసిందో షాకింగ్‌గా బయటపెట్టారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కరాటే కల్యాణి మాట్లాడుతూ 'బిగ్ బాస్ వల్ల నాకు లాభాల కంటే నష్టాలే ఎక్కువయ్యాయి. షోలో ఉన్నంతకాలం వచ్చిన గుర్తింపు బయటికి రాగానే నిలవలేదు. బిగ్ బాస్ అగ్రిమెంట్ కారణంగా ఎన్నో సినిమాల అవకాశాలు కోల్పోయాను. నేను వెళ్లకపోతే ఉండే అవకాశాలు కూడా పోయాయి. సినిమాలు లేవు, షోలు లేవు... బిగ్ బాస్‌లోకి రావడం వల్ల నా కెరీర్ నాశనం అయింది. పూర్తిగా దెబ్బతింది" అని షాకింగ్ కామెంట్స్ చేసింది.
కల్యాణి మాట్లాడుతూ 'ఫ్రీగా పాపులారిటీ వస్తుందని, తర్వాత సినీ అవకాశాలు పెరుగుతాయని అంటారు. కానీ, నిజానికి ఎవరూ పట్టించుకోరు. అది ఎంత బాధిస్తుందో.. నేను మాత్రమే చెప్పగలను. ఓవర్‌నైట్‌గా నా మీద డోర్లు మూసుకుపోయాయి. బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టడం వల్ల నేనే ఇండస్ట్రీకి దూరమయ్యాను'అని ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ వల్ల కెరీర్ హైపైంది, జీవితమే మారిపోయిందని పలువురు కంటెస్టెంట్లు చేసిన కామెంట్స్ పూర్తిగా విరుద్ధమని చెప్పింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
సోషల్ మీడియాలో కళ్యాణి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కొంతమంది ఆమెకు సపోర్టుగా నిలువగా, మరికొందరు ఆమె నిర్ణయాలను, ప్రవర్తనను తప్పుపడుతున్నారు. గతంలో బిగ్ బాస్‌పై ఇలాంటి విమర్శలు వచ్చాయి. పలువురు మాజీ కంటెస్టెంట్స్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ ఒకరికి బంగారు అవకాశమైతే... మరొకరి కెరీర్‌లో భారీ నష్టమేనని చెప్పాలి. ఆమె మాటలకు ఇండస్ట్రీ నుంచి, బిగ్ బాస్ టీమ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఏదిఏమైనా బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే వేళ కరాటే కళ్యాణి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











