Karate Kalyani: చందును త్రినయని సీరియల్‌లోంచి అందుకే తీసేశారు.. పవిత్ర కాళ్లు పట్టుకుని మరీ..!
సీరియల్ నటుడు చంద్రకాంత్ చల్లా అలియాస్ చందు గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన అనేక సీరియల్స్ లో నటించి మెప్పించాడు. అయితే ఇటీవలే ఈయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ముఖ్యంగా నటి పవిత్రా జయరామ్ పై ఉన్న ప్రేమ వల్ల ఆయన ఇలా చేశారు. అయితే తాజాగా ఈయన మృతిపై కరాటే కల్యాణీ స్పందించింది. చందను త్రినయని సీరియల్ లోంచి తీసేయడానికి గల కారణాల దగ్గర నుంచి ఆయన చనిపోయే వరకు ఆమెతో ఏం చెప్పారో అన్నీ వివరించింది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మే 12వ తేదీ రోజు రోడ్డు ప్రమాదంలో నటి పవిత్రా జయరామ్ చనిపోయింది. అయితే ఆమె రోడ్డు ప్రమాదంలో జరిగిన గాయాల వల్ల కాకుండా.. హార్ట్ స్ట్రోక్ వల్ల ప్రాణాలు కోల్పోయిందని నటుడు చంద్రకాంత్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తనకు ఏదో అయిపోయిందనే టెన్షన్, బాధతోనే ఆమెకు స్ట్రోక్ వచ్చిందని వివరించాడు. అదే ధ్యాసలో తనకోసం ఆమె చనిపోయిందని డిప్రెషన్ కు గురైన ఆయన కూడా ఉరి వేసుకుని మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈయన చనిపోయిన తర్వాత వీరి బంధం గురించి అసలు విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా నటుడు చంద్రకాంత్, పవిత్రా జయరామ్ ల అసలు బంధంపై క్లారిటీ వచ్చేసింది.

పవిత్రా జయరామ్ తన భర్తతో కలిసే ఉండేదని.. చనిపోయేవరకు వాళ్లిద్దరూ బాగానే ఉన్నారని పవిత్రా జయరామ్ పిల్లలు తెలిపారు. అలాగే నటుడు చంద్రకాంత్ భార్య శిల్ప కూడా తనకు చందు విడాకులు ఇవ్వలేదని.. ఇంట్లోంచి వెళ్లిపోయి పవిత్రతో ఉన్నాడని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఈ విషయాలన్నింటిపై కరాటే కల్యాణీ స్పందించింది. చందు ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు తనకు ఇన్విటేషన్ ఇఛ్చాడని.. కానీ వెళ్లడం కుదరలేదని చెప్పుకొచ్చింది. మొదటి నుంచి తమకు మంచి బాండింగ్ ఉండడం వల్ల ఆయన గురించి పలు విషయాలు తెలుసు అని వివరించింది.
ఆయన ప్రేమ వివాహం చేసుకున్నా ఆమెతో విడాకులు అయ్యాయని చెప్పాడని.. అలాగే పవిత్రను పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడని తెలిపింది. ఇదే విషయం పవిత్రను అడగ్గా.. ఆమె కూడా తాము రిలేషన్ లో ఉన్నట్లు వివరించిందట. తనకు భర్త దూరం అయ్యాడని, చందు కూడా అలాంటి పరిస్థితిలో ఉండగా.. తాము కలిసి ఉంటున్నట్లు వెల్లడించిందట. కానీ చందు చనిపోయాకే తనకు అసలు విషయం తెలిసిందని చెప్పింది. వాళ్లిద్దరూ విడాకులు ఇవ్వకుండానే.. రెండు ఫ్యామిలీలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా చిన్నపిల్లలను వదిలి చందు చాలా తప్పు చేశాడని చెప్పింది.

అయితే త్రినయని సీరియల్ షూటింగ్ లో పవిత్రతో చందు చాలా ఓవర్ చేసేవాడని... అందుకే అతడిని సీరియల్ లోంచి తీసేశారని కరాటే కల్యాణీ వెల్లడించింది. అలాగే చందు భార్య శిల్ప.. షూటింగ్ స్పాట్ కు వెళ్లి మరీ పవిత్రా జయరామ్ కాళ్లు పట్టుకుని బతిమాలినట్లు చెప్పుకొచ్చింది. కానీ ఆమె చాలా యాటిట్యూడ్ చూపించి తన భర్తను వదలనని చెప్పినట్లు తనకు తెలిసిందని.. కరాటే కల్యాణీ పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











