బిగ్ బాస్ ఓటింగ్ సిస్టమ్‌పై అనుమానాలు: ఆ కంటెస్టెంట్ వల్ల బయటపడిన నమ్మలేని నిజాలు.!
తెలుగు బుల్లితెరపై ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోన్న షో 'బిగ్ బాస్'. సరికొత్త ప్రయోగాలతో కూడిన ఈ షో.. చాలా తక్కువ సమయంలోనే ఆదరణను అందుకుంది. ఫలితంగా తెలుగులోనే టాప్ షోగా వెలుగొందుతోంది. ఇక్కడ ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో... ఇటీవలే నాలుగో దాన్ని కూడా మొదలెట్టింది. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనన్ని అనుమానాలు దీనిపై వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బిగ్ బాస్ ఓటింగ్ విషయంలో ఓ కంటెస్టెంట్ నమ్మలేని నిజాలు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే..

గ్రాండ్ స్టార్ట్.. రికార్డులే రికార్డులు
గత సీజన్లతో పోలిస్తే ఈ సారి ఏమాత్రం హడావిడి లేకపోయినా... అంగరంగ వైభవంగానే ప్రారంభమైంది బిగ్ బాస్ షో. గత నెలలో మొదలైన నాలుగో సీజన్‌లో పేరున్న కంటెస్టెంట్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ.. రికార్డు స్థాయిలో స్పందనను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తెలుగు బుల్లితెరపై ఎన్నో ఘనతలను అందుకుంటోందీ రియాలిటీ షో.

నెమ్మదించినా.. ఊపందుకుంది
ప్రీమియర్ ఎపిసోడ్ గ్రాండ్ సక్సెస్ అయినప్పటికీ.. ఆ తర్వాత చాలా రోజుల పాటు నాలుగో సీజన్‌కు అంతగా ఆదరణ లభించలేదు. పైగా చాలా చప్పగా సాగింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వహకుులు సరికొత్త టాస్కులు పరిచయం చేయడంతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, మసాలా సీన్లు యాడ్ చేశారు. దీంతో షో ఒక్కసారిగా ఊపందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

ఐదు వారాలు.. ఆరుగురు ఔట్
బిగ్ బాస్ సీజన్ -4 ప్రారంభమై ఐదు వారాలు పూర్తయిపోయింది. వారానికి ఒక్కరు చొప్పున మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లు (సూర్య కిరణ్, కరాటే కల్యాణీ, దేవీ నాగవల్లి, స్వాతీ దీక్షిత్, జోర్ధార్ సుజాత) ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే గంగవ్వ కూడా అనారోగ్య కారణాలతో షో నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు పదమూడు మంది ఇంట్లో కొనసాగుతున్నారు.

బాస్ వ్యవహారంపై ఆరోపణలు
బిగ్ బాస్ షో నుంచి బయటకు వెళ్లిపోయిన కంటెస్టెంట్లు ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. గతంలో మాదిరిగానే ఈ సీజన్‌లో నుంచి ఎలిమినేట్ అయిన వారందరూ తరచూ టీవీల్లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హౌస్‌లోని కంటెస్టెంట్లపై కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు, బిగ్ బాస్ షో నిర్వహకులపైనా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో షో హైలైట్ అవుతూనే ఉంది.

ఓటింగ్ సిస్టమ్‌పై అనుమానాలు
ప్రేక్షకులు వేసే ఓట్ల వల్ల బిగ్ బాస్ షో నడుస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సోమవారం జరిగే ప్రక్రియలో నామినేట్ అయిన కంటెస్టెంట్లలో తక్కువ ఓట్లు వచ్చిన వారు ఎలిమినేట్ అవుతుంటారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని నామినేషన్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఓటింగ్ సిస్టమ్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Recommended Video

బయటపడిన నమ్మలేని నిజాలు.!
తాజాగా కరాటే కల్యాణీ ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో నమ్మలేని నిజాలు వెల్లడించారు. ‘బిగ్ బాస్ ఓటింగ్‌పై అనుమానాలు ఉన్నాయి. లీస్ట్ ఉన్న కంటెస్టెంట్లు కాకుండా మిగిలిన వాళ్లు ఎలిమినేట్ అవుతున్నారు. నేను, దేవీ నాగవల్లి, సుజాత అలాగే బయటకు వచ్చాము. అన్ని ఓట్లు పోలయ్యాయని చెప్పి.. మాకెన్ని వచ్చాయో చెప్పకపోవడం దారుణం' అంటూ ఆమె చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











