Karate Kalyani: చందు చనిపోతానని ముందే చెప్పాడు.. కానీ ఆపలకేపోయా.. వాట్సాప్ చాట్ లీక్ చేసిన నటి!
సీరియల్ నటుడు చంద్రకాంత్ చల్లా అలియాస్ చందు గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన అనేక సీరియల్స్ లో నటించి మెప్పించాడు. అయితే తాజాగా ఈయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ముఖ్యంగా నటి పవిత్రా జయరామ్ పై ఉన్న ప్రేమ వల్ల ఆయన ఇలా చేశారు. ఐదు రోజుల క్రితమే ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించగా.. అది జీర్ణించుకోలేకపోయిన చంద్రకాంత్ ఈ రోజు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అయితే తాజాగా దీనిపై టాలీవుడ్ సీనియర్ నటి కరాటే కళ్యాణి స్పందించింది. ముఖ్యంగా చందు చనిపోతాడని తనకు ముందే తెలుసని.. కానీ ఆపలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా.. ఆయనతో నిన్న చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేసింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మే 12వ తేదీ రోజు రోడ్డు ప్రమాదంలో నటి పవిత్రా జయరామ్ చనిపోయింది. అయితే ఆమె రోడ్డు ప్రమాదంలో జరిగిన గాయాల వల్ల కాకుండా.. హార్ట్ స్ట్రోక్ వల్ల ప్రాణాలు కోల్పోయిందని నటుడు చంద్రకాంత్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తనకు ఏదో అయిపోయిందనే టెన్షన్, బాధతోనే ఆమెకు స్ట్రోక్ వచ్చిందని వివరించాడు. అయితే మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి రెండు మూడు రోజులు కూడా గడవకముందే ఆయన ప్రాణాలు తీసుకున్నారు.
ముఖ్యంగా పవిత్రా జయరామ్ అంటే తనకు చాలా ఇష్టం అని.. తమ బంధాన్ని చాలా మంది అర్థం చేసుకోలేకోపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఐదేళ్లుగా తాము లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు చెప్పిన చంద్రకాంత్.. పవిత్రా జయరామ్ మృతిని అస్సలే తట్టుకోలేకపోయాడు. ఇంటర్వ్యూ ఇస్తున్నంత సేపు, ఎడుస్తూ.. బాధ పడుతూనే కనిపించాడు. ఒంటికైన గాయాలతో పాటు మనసుకు అయిన గాయాల గురించి అందరికీ వివరించే ప్రయత్నం చేశాడు. కానీ చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అయితే చంద్రకాంత్ చనిపోవడానికి ముందు తనతో వాట్సాప్ లో చాట్ చేశాడని నటి కరాటే కళ్యాణీ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేసింది. తాను చందు ఏం చేసుకోవద్దంటూ చెప్పిన వాటితో పాటు.. అతడు నేను బతకలేనంటూ వివరించిన వాటిని చూపించింది. అలాగే తాను ఈ లోకంలో ఉంటే తాగుబోతుగానే, పిచ్చి వాడిగానో మాత్రమే ఉండాలంటూ చెప్పుకొచ్చాడు. ఏం చేసుకోవద్దని పదే పదే అడుగుతూ.. చెప్పడం వంటివి మనం ఆ స్క్రీన్ షాట్లలో చూడొచ్చు. వీటినే షేర్ చేస్తూ కరాటే కల్యాణీ ఆవేదన వ్యక్తం చేసింది. చందు చనిపోతాడని ముందుగానే తెలిసినా కాపాడలేకపోయానంటూ ఆవేదన చెందింది.


Click it and Unblock the Notifications











