For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అదో నరకం.. యాక్టింగ్ గురించి పట్టింపే లేదు.. డైరెక్టర్ చేతిలో అలా బుక్ అయ్యా!

  |

  సినీ తార కావాలనుకొనే ఎవరైనా ఆరంభంలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సిందే. వారసత్వం ఉంటే తప్ప ఇండస్ట్రీలో కేక్ వాక్ ఉండదు. అలా ప్రతీ ఒక్కరు ఏదో ఒక ఆడిషన్స్ వెళ్తూ తన ప్రతిభను చాటుకొనే ప్రయత్నం చేస్తారు. కెరీర్ ఆరంభంలో తాను పడిన ఆడిషన్ కష్టాలను టెలివిజన్ నటి కరిష్మ తన్నా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాలాజీ టెలిఫిల్మ్స్ సంస్థలో ఏక్తా కపూర్ ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డానో అనే విషయాన్ని వెల్లడించారు. ఆమె చెప్పిన విషయాలు మీకోసం..

  టెలివిజన్ రంగంలో

  టెలివిజన్ రంగంలో

  నిర్మాత ఏక్తా కపూర్ సంస్థ బాలాజీ టెలిఫిలింస్‌లో వచ్చిన ప్రతీ సీరియల్ బ్లాక్‌బస్టరే. క్యోంకి సాస్ భీ కభీ బహు థీ అనే సీరియల్‌లో సంచలన రీతిలో వందల వారాలు బుల్లితెరపై మ్యాజిక్ చేసింది. ఇండియన్ టెలివిజన్ హిస్టరీలో అత్యంత ప్రజాదరణ పొందిన సీరియల్స్‌లో ఒకటిగా నిలిచింది. అలాంటి సీరియల్ ద్వారా కరిష్మా తన్నా బుల్లితెర ప్రవేశం చేశారు. ఆ సమయంలో తాను పడిన కష్టాలను చెప్పుకొని ఊరట చెందారు.

  ఆఫర్ల కోసం అలా చేశాను

  ఆఫర్ల కోసం అలా చేశాను

  యాక్టర్‌గా రాణించేందుకు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో చాలా ప్రొడక్షన్ హౌస్‌ల చుట్టు తిరిగాను. అందరి లాగానే నేను ఆడిషన్స్ ఇచ్చాను. ప్రతీసారి రోల్.. కెమెరా.. యాక్షన్ చెప్పగానే ఓ రకమైన భయం నాలో ప్రవేశించేంది. ఎందుకంటే షూటింగ్‌కు సంబంధించి బేసిక్స్ కూడా తెలియవు. అందుకే నేను కంగారు పడేదానిని. అలాంటి పరిస్థితుల్లో ఆఢిషన్స్‌కు వెళ్లి నా ప్రతిభను చాటేందుకు ప్రయత్నించే దానిని అని చెప్పారు.

  కెరీర్ ఆరంభంలో కష్టాలు

  కెరీర్ ఆరంభంలో కష్టాలు

  కెరీర్ ఆరంభంలో ఎలా నటించాలి. కెమెరా ముందు ఎలా నిలుచోవాలి. డైలాగ్ డెలివరీ ఎలా ఉండాలి అనే విషయాలపై అసలే అవగాహన లేదు. పలుమార్లు దర్శకులను అడిగి తెలుసుకొనే దానిని. కొన్నిసార్లు వాళ్లు చాలా ఫ్రెండ్లీగా సహకరించేవారు. కొంత మంది డైరెక్టర్లు చాలా దారుణంగా వ్యవహరించే వాళ్లు. ఎలాగైనా ఆఫర్ సంపాదించాలనే ఒత్తిడితో కొన్నిసార్లు సరిగా చేయలేకపోయేదానిని అని కరిష్మ చెప్పారు.

  అలా అడ్డంగా బుక్ అయ్యా

  అలా అడ్డంగా బుక్ అయ్యా

  ఇలాంటి ఆడిషన్లలో బాలాజీ టెలి ఫిలింస్‌లో జరిగిన నా ఆడిషన్ చాలా నరకంగా మారింది. సాధారణంగా ఓ సారి చెబితే నేను పూర్తిగా పట్టేస్తాను. కానీ ఆ రోజు కెమెరా ముందు దారుణంగా బుక్ అయిపోయా. చాలాసార్లు తత్తరపాటుకు గురయ్యాను. అదోక దుర్భరమైన అనుభవం. అయినా ఏక్తా మేడమ్ నన్ను ఎంపిక చేసింది. ఆమె నా డైలాగ్స్ చూడలేదు. నాలో ప్రతిభ ఉందా, నటనకు పనికి వస్తానా? కెమెరాకు సూట్ అవుతానా అనే విషయాన్ని గ్రహించి నన్ను తీసుకొన్నారు అని చెప్పారు.

  Manasa Vaacha Movie Trailer
   స్వీయ గృహ నిర్బంధంలోనే

  స్వీయ గృహ నిర్బంధంలోనే

  క్యోంకి సాస్ భీ కభీ బహు థీ సీరియల్ తర్వాత కరిష్మ తన్నా జాతకమే మారిపోయింది. ఇటీవల రోహిత్ శెట్టి రూపొందించిన ఖత్రోంకి కిలాడి రియాలిటీ షోలో బాగా రాణించారు. ప్రస్తుతం కరోనావైరస్ సమయంలో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న కరిష్మా మీడియాతో మాట్లాడుతూ.. టెలివిజన్ నటుల బాధలను, కష్టాలను చెప్పుకొన్నారు.

  English summary
  Television star Karishma Tanna about her horrible audtion experiences. She said, My audition for Balaji was horrible.But still, I got chosen. Ekta ma’am does not see dialogues, she wants the actor to fit in the role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X