Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హిందూ యువతికి ముస్లిం కంటెస్టెంట్ ముద్దులా.. బిగ్‌బాస్ షోను నిషేధించండి.. నోటీసుతో వార్నింగ్
అశ్లీలత, అసభ్యతకు వేదిక నిలుస్తున్నదంటూ హిందీ వెర్షన్ బిగ్‌బాస్ షో 14 సీజన్‌పై కర్ణిసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్14 షో ఫార్మాట్ లవ్ జిహద్ను ప్రోత్సహించేలా ఉందంటూ అంటూ బిగ్‌బాస్ నిర్వాహకులు ఎండెమాల్ షైన్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే...
జాన్ కుమార్ సాను వివాదాస్పద వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా, ఇటీవల ఎలిమినేట్ అయిన జాన్ కుమార్ సాను చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచాయి. మరాఠీ భాష మాట్లాడవద్దు అంటూ నిక్కి తంబోలిని హెచ్చరించడం మరాఠీ భాషాభిమానులు కన్నెర్ర చేశారు. మరాఠీ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన షోను నిలిపివేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కర్ణిసేన కూడా ఈ షోపై మండిపడుతూ నోటీసులు పంపింది. ప్రముఖ గాయకుడు కుమార్ సాను కుమారుడు జాన్ కుమార్ సాన్ అనే విషయం గమనార్హం.
లవ్ జిహద్ ప్రమోషన్ అంటూ
బిగ్‌బాస్14లో షోలో కీలక కంటెస్టెంట్లు ఇజాజ్ ఖాన్, పవిత్ర పునియా మధ్య చోటుచేసుకొన్న రొమాంటిక్ సన్నివేశంపై కర్ణిసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇజాజ్ ముస్లిం మతానికి చెందిన వాడు. పవిత్ర పునియా హిందూ మతానికి సంబంధించి మహిళ. అత్యంత ప్రజాదరణ ఉన్న టెలివిజన్ షోలో ఓ హిందూ యువతిని ముస్లిం ముద్దుపెట్టుకోవడం లవ్ జిహద్ను ప్రమోట్ చేయడమే అని తమ నోటీసుల్లో కర్ణిసేన పేర్కొన్నది.
ముద్దులు, హాగ్స్‌తో హద్తులు మీరుతున్న షో
బిగ్‌బాస్ 14 రియాలిటీ షోలో అసభ్యత, అశ్లీలత విపరీతంగా ఉంది. సామాజిక బాధ్యత, నైతిక విలువలను తుంగలో తొక్కుతున్నారు. కౌగిలింతలు, ముద్దుల తీరు హద్దు మీరుతున్నాయి. ఇలాంటివి అత్యంత అభ్యంతరకరం. ఆమోదకరం అంటూ కర్ణిసేన ఫైర్ అయింది. ఇలాంటి షోను వెంటనే నిషేధించాలి అని దిలీప్ రాజ్‌పుత్ డిమాండ్ చేశారు.
Recommended Video
బిగ్‌బాస్‌ను ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు
బిగ్‌బాస్ షోను నిలిపివేయకపోతే ఆ షోను ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు అంటూ కర్ణిసేన వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే వీధుల్లోకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతాం. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాం. బిగ్‌బాస్ షోపై సెన్సార్ విధించాలి లేదా నిషేధించాలి అంటూ కర్ణిసేన డిమాండ్ చేసింది.