నా ఆపరేషన్ అటు ఇటు అయితే.. స్టుపిడ్ అంటూ దీపపై కార్తీక్ కొండంత ప్రేమ!
కార్తీక దీపంలో ఎన్నో ఎపిసోడ్స్‌లో కార్తీక్, దీప మధ్య గొడవలు, అపార్థాలు, అపోహలు కనిపించాయి. కానీ తాజా ఎపిసోడ్‌లో దీపపై కార్తీక్ కొండంత ప్రేమను కురిపించడం ఫీల్‌గుడ్‌గా మారింది. కార్తీక దీపంలోని 1049 ఎపిసోడ్‌లో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమిటంటే..

ఇబ్బంది పెడుతున్నానా కార్తీక్ బాబు..
డాక్టర్ బాబు.. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా అని దీప అంటే.. ఏం ఇబ్బంది అంటూ కార్తీక్ సమాధానం ఇచ్చాడు. మిమల్ని నేను హాస్పిటల్ చుట్టు తిప్పిస్తున్నాను. నా వల్ల కదా.. చాలా హైరానా పెడుతున్నరు అంటూ దీప ఆవేదనను వ్యక్తం చేసింది.

భార్యకు ట్రీట్‌మెంట్ ఇప్పించడం
అయితే దీప మాటలకు సమాధానం ఇస్తూ.. ఎక్కడైనా భార్యకు ట్రీట్‌మెంట్ ఇప్పించడాన్ని భర్త ఇబ్బందిగా ఫీలవుతాడా? భార్యకు ట్రీట్‌మెంట్ ఇప్పించడం భర్తకు కనీస బాధ్యత. నీవు ఆలోచించాల్సినవి ఇవి కావు అంటూ కార్తీక్ సరదాగా, సంతోషంగా మాట్లాడుతుంటే దీప ఆనందంలో మునిగిపోయింది.

దోసకాయ పచ్చడి అంటూ సరదాగా
రేపు పిల్లలతో సంతోషంగా గడపాలంటే ఏం చేయాలి? నీ డార్లింగ్ అత్తగారితో కలిసి గుళ్లు, గోపురాలు ఎలా తిరగాలి. పిల్లలకు ఏం వంట చేసిపెట్టాలి? దోసకాయ పచ్చడి పిల్లలకే కాదు కాలనీ వాళ్లందరికి ఎలా పంచాలి? అంటూ కార్తీక్ తనదైన శైలిలో దీపను సంతోషపెట్టేందుకు ప్రయత్నించారు.

దొంగచాటుగా మోనిత...
దీప, కార్తీక్ మధ్య జరుగుతున్న సంభాషణనను దొంగచాటుగా వింటున్న మోనిత ఉడికిపోయింది. ఎలాగైనా చనిపోతుందనే కారణంతో ఇలా ప్రేమతో మాట్లాడుతున్నాడా? అంటూ మోనిత అనుమాన పడింది. ఈ క్రమంలో కార్తీక్ మాటలకు చిరునవ్వు నవ్వగా.. దట్స్ గుడ్.. ఇలా హ్యాపీగా ఉండు.. నీకేమీ కాదు.. అంటూ దీపకు కార్తీక్ కాంప్లిమెంట్ ఇచ్చాడు.

అలా చూస్తే మోనిత మాదిరిగా ...
ఒకవేళ భయం వేసిందంటే.. నీ కనుబొమ్మలు ఎత్తి చూడు.. మోనిత మాదిరిగా పారిపోతుంది అంటూ డాక్టర్ కార్తీక్ భార్యపై ప్రేమను కురిపించాడు. దాంతో చాలూ డాక్టర్ బాబూ.. ఒకవేళ ఈ ఆపరేషన్ అటు ఇటు అయినా.. అంటూ ఏదో అనబోతుండగా.. స్టుపిడ్ అంటూ దీపను కార్తీక్ నోరు మూయించే ప్రయత్నం చేశాడు. నీకేం కాదన్నానా.. మాట వినాలంటూ ధైర్యం చెప్పారు.


Click it and Unblock the Notifications











