కార్తీకదీపంలో అదిరిపోయే ట్విస్ట్.. వంటలక్క బతకడం కష్టం.. డాక్టర్ బాబుకు షాక్..
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న కార్తీక దీపం సీరియల్ రోజు రోజుకు అత్యంత ప్రేక్షకదారణ మూటగట్టుకొంటున్నది. 1010 ఎపిసోడ్‌లో ప్రేక్షకులకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. వంటలక్కగా ప్రేక్షకాదరణ పొందిన దీప ఆరోగ్య విషయం అటూ కార్తీక్ బాబునే కాకుండా ప్రేక్షకులను కూడా భావోద్వేగానికి గురిచేసింది. తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

భార్యగా కాకుండా కోడలిగానే ఇంటికి
విజయనగరంలో టిఫిన్ సెంటర్ నడుపుతున్న దీప ఆచూకి తెలుసుకొన్న తర్వాత కార్తీక్ బాబు ఎమోషనల్ అయ్యాడు. తన కూతుళ్లకు పట్టిన గతిని చూసి కోపంతో ఊగిపోయాడు. దీప తండ్రి మురళీకృష్ణను నిలదీస్తాడు. దీపతోసహా కూతుళ్లను తీసుకొని తన ఇంటికి చేరుకొంటాడు. ఇంటికి చేరుకొన్న తర్వాత తల్లి సౌందర్యకు జబర్దస్త్ ఝలక్ ఇస్తాడు. భార్యగా దీపికను ఇంటికి తీసుకురాలేదు. కేవలం కోడలిని మాత్రమే తెచ్చాను అంటూ కార్తీక్ షాకిస్తాడు.

కార్తీక్, దీప మధ్య ఎమోషనల్‌గా
అత్తారింటికి చేరిన దీపకు రకరకాల ట్విస్టులను కార్తీక్ బాబు ఇస్తాడు. నిన్ను నా బిడ్డలకు పెంపుడు తల్లిగానే చూస్తానని చెప్పిన కార్తీక్ బాబు తీరుకు దీప మనస్తాపం చెందుతుంది. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడ్డారనే విషయం తెలుసుకొన్న కార్తీక్.. ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్దామని చెబుతాడు. కానీ నన్ను ఏ హోదాలో తీసుకెళ్దామని అనుకొంటున్నావంటూ అందుకు నిరాకరిస్తుంది.

దీప బతకడం కష్టం
ఈ నేపథ్యంలో దీప రిపోర్టులను తీసుకెళ్లి డాక్టర్‌కు చూపిస్తాడు. పక్కనే మౌనిత కూడా పక్కనే ఉంటుంది. అయితే దీప బతకడం కష్టం అంటూ చెప్పగానే కార్తీక్ షాక్ గురవుతాడు. ఎలాగైనా బతికించాలని కార్తీక్ ప్రాధేయపడుతాడు. నీ కెరీర్‌లో ఒక్క కేసు కూడా ఫెయిలైన సందర్భాలు లేవు. అందుకే నీ వద్దకు వచ్చాను అని కార్తీక్ టెన్షన్‌తో చెప్పాడు. సడెన్‌గా అలా మాట్లాడితే తట్టుకోలేను. ఆమె మాట్లాడితే తట్టుకోలేను. ఇద్దరు పిల్లలు అనాథలు అవుతారు అంటూ కార్తీక్ భయంతో వణికి పోయారు.

మెడిసిన్స్ ఎప్పటికప్పుడు అంటూ
అందుకు డాక్టర్ సమాధానం ఇస్తూ.. కార్తీక్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. బతకడం కష్టం కానీ.. బతికించుకోవడం కష్టం కాదు. ఎల్లవేళలా మెడిసిన్స్ తీసుకొనేలా చూసుకోవాలి. ఆమెకు మానసిక ప్రశాంతత లభించేలా జాగ్రత్త వహించాలి అంటూ డాక్టర్ సూచిస్తుంది. అందుకు దీపను ఎలాగైనా నీవే బతికించాలి అంటూ కార్తీక్ బాధలో మునిగిపోయాడు.

దీపను ఓ గాజుబొమ్మలా చూసుకోవాలి..
దీపను ఓ గాజు బొమ్మలా చూసుకోవాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదమే అని డాక్టర్ చెప్పారు. దాంతో దీపను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ కార్తీక్ ఆవేదన వ్యక్తం చేశారు. నీవు దీపను తీసుకురా.. దీపం కొరవడకుండా మన ప్రయత్నాలు చేద్దాం. అర్జెంట్‌గా మెడిసన్ వాడాలి. తొందరగా దీపను హాస్పిటల్‌కు తీసుకురా అంటూ డాక్టర్ సూచించింది.
Recommended Video

ఆనందంలో మౌనిత..
అయితే డాక్టర్, కార్తీక్ బాబు మధ్య సంభాషణ వింటున్న మౌనితకు ఈ వార్త చాలా సంతోషాన్ని కలిగించింది. ఓ పక్క మనుసులో ఆనందం పడుతూనే మరోపక్క బాధలో ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ కనిపించింది. దీప బతకదు అనే విషయం మౌనితకు ఎనలేని సంతోషాన్ని కలిగించింది.


Click it and Unblock the Notifications











