twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దీప అత్తింటిలో హైడ్రామా.. భార్యకు మనసుండదా ప్రశ్నించిన సోదరి.. అత్త సౌందర్య సంచలన నిర్ణయం

    |

    అత్తారింటిలోకి దీప చేరిన తర్వాత కూడా ఆమె జీవితంలో మార్పులు కనిపించలేదు. భర్త కార్తీక్ దూరంగా ఉండటంతో మనోవేధనకు గురవుతూ కనిపించారు. ఆ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న దీప పరిస్థితి మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలో తన సోదరి శ్రావ్య, అత్త సౌందర్య మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. వారిద్దరూ ఏం మాట్లాడుకొన్నారంటే..

    ప్రతీ భార్యకు ఓ మనసు ఉంటుందని

    ప్రతీ భార్యకు ఓ మనసు ఉంటుందని

    సౌందర్యకు తన చిన్న కోడలికి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణలో... తన అత్త సౌందర్యను ఉద్దేశించి శ్రావ్య.. భార్యకు మనసు ఉంటుంది. ఎమైనా అంటే అది బాధపడుతుందనే విషయం మీ చిన్నకొడుకు ఉంది అంటూ సమాధానం ఇస్తుంది. అయితే నా పెద్ద కొడుకు అలాంటి మనసు లేదా అంటే.. నేను చిన్న కొడుకు గురించే మాట్లాడాను అంటూ సౌందర్యకు చిన్నకోడలు శ్రావ్య ఘాటుగా సమాధానం ఇస్తుంది. అయితే నా కార్తీక్‌ను మార్చడానికి చాలా ప్రయత్నించాను. కానీ సమయం వచ్చినప్పుడు వాడే మాట్లాడుతాడు అంటూ సౌందర్య కామెంట్ చేసింది.

    సముద్ర తీరంలో శ్రద్దా కపూర్ హోయలు.. టోపిని అడ్డుపెట్టుకొని సోయగాలు

    అక్కను బావ సంతోషపెట్టారా?

    అక్కను బావ సంతోషపెట్టారా?

    నా అక్క దీప ఇంటికి వచ్చింది. మా అక్కను బావ సంతోషపెట్టారా? ఇంట్లో వాళ్లు సంతోషంగా ఉన్నారా. ఇంటికి కోడల్ని మాత్రమే తీసుకొచ్చారు. పైన గదిలో మా అక్కయ్య.. కింది గదిలో బావ ఉన్నాడు. వారి అంతస్థులు వేరు అంటూ శ్రావ్య తన ఆవేదన వ్యక్తం చేసింది. నీవు నీ భార్యను మాత్రమే తీసుకురావాలని కండిషన్ పెట్టాల్సింది అని సౌందర్యకు శ్రావ్య ఘాటుగా జవాబిచ్చింది.

    దీప ఒంటరి ఆడది..

    దీప ఒంటరి ఆడది..

    శ్రావ్య సూచనలకు సౌందర్య సమాధానమిస్తూ.. వాడు ముమ్మాటికి ఆ పని చేసేవాడు కాదు. వాడు ఎప్పటికి మారడు అని అన్నారు. మీ అక్క భవిష్యత్, పిల్లలకు కూడు, గుడ్డ ఉండాలని భావించాను. వాడికి భార్య అవసరం లేదు. కానీ కోడలు అవసరం. నా కోడలు, మనవరాళ్లు అవసరం. దీప ఒంటరి ఆడది. ఇద్దరు పిల్లలు. చేతిలో చిల్లిగవ్వ లేదు. వాడిని కట్టిపడేయానికి దూడ కాదు. మీ అక్కకు తోడు నీడ ఉండాలని నిర్ణయం తీసుకొన్నాను అత్తను అమ్మనయ్యాను. ఆశను ఇచ్చాను. ఆశ్రయం ఇచ్చాను. ప్రతీ క్షణం కంటికి రెప్పలా కాపాడుకొంటున్నాను అంటూ సౌందర్య చెప్పారు.

    నా కోడలు దీపకు సంగం ఆస్తి రాసిస్తా

    నా కోడలు దీపకు సంగం ఆస్తి రాసిస్తా

    నా కోడలు దీపకు సగం ఆస్తి రాసిస్తాను. నా భర్త ఆస్తి. నా పుట్టింటి వాళ్లు రాసిచ్చిన ఆస్తిని నా కోడలికి ఇస్తాను. నా ఆస్తిని ఆమె చేతిలో పెడుతాను. నీడలేని ఆడది, తోడు లేని ఆడది.. ఎదగడానికి ఎన్ని ఏళ్లు పడుతుందోనని భయపడ్డాను. ఏ ఆధారం లేని నా కోడలిని తీసుకురమ్మని చెప్పాను. నా నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు అంటూ సౌందర్య తన నిర్ణయాన్ని సమర్ధించుకొన్నారు.

    Recommended Video

    Vakeel Saab Day 1 Collections Report | ఈ వారం చాలా కీలకం !
    దీప ఆరోగ్యం క్షీణించడంపై కార్తీక్

    దీప ఆరోగ్యం క్షీణించడంపై కార్తీక్

    ఇదిలా ఉండగా, దీప ఆరోగ్యం క్షీణించడం తెలిసి కూడా జాగ్రత్తలు తీసుకోలేని తండ్రి మురళీ కృష్ణను డాక్టర్ కార్తీక్ బాబు క్లాస్ పీకారు. ఆరోగ్యం బాగాలేదని తెలిసినా ఎందుకు వైద్యం చేయించలేదు. ఆమెకు ఆరోగ్య బాగాలేదని కూడా తెలిసి కూడా దీప చావు తనే చస్తుందని అనుకొన్నారా? మా అమ్మ ఇచ్చిన డబ్బులతోనైనా వైద్యం చేయించలేకపోయారా? ఇక నుంచి కనీసం మెడిసిన్స్ అయినా వాడేలా చర్యలు తీసుకోండి అంటూ మురళీకృష్ణకు గట్టిగా కార్తీక్ వార్నింగ్ ఇచ్చారు.

    English summary
    Popular Television serial Karthika Deepam completed 1000 Episode. There are twist in 1010 episode: Dr Karthik shocked over Deepa health report. Deepa's serious health issues sent shock waves to Karthik.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X