Karthika Deepam అప్పుడు కూడా అమ్మ నీ పక్కన ఉండదా? డాక్టర్ బాబుకు శౌర్య షాక్
అత్యంత సుదీర్ఘంగా కొనసాగుతున్న కార్తీక దీపం సీరియల్‌లో 1011వ ఎపిసోడ్‌లో రకరకాల భావోద్వేగాలు కనిపించాయి. శౌర్య, కార్తీక్ బాబు మధ్య, అలాగే దీపతో తండ్రి మురళీకృష్ణ మధ్య, అత్త సౌందర్యతో దీప ఎమోషనల్ డైలాగ్స్‌తో సీరియల్ మరింత ఇంటెన్సివ్‌గా కనిపించింది. 1011 ఎపిసోడ్‌లో కీలక అంశాలు మీ కోసం..
Recommended Video

ఎక్కడికి వెళ్లారు డాక్టర్ బాబు..
బయటకు వెళ్లి వస్తున్న డాక్టర్ కార్తీక్ బాబును ఉద్దేశించి శౌర్య మాట్లాడుతూ.. ఉదయమే బయటకు వెళ్లి వసున్నారు.. ఎక్కడికి వెళ్లారు డాక్టర్ బాబు అంటూ నిలదీసింది. దాంతో కాస్త కోపగించుకొన్న డాక్టర్ బాబు... ఏంటే రౌడీ కొత్తగా మాట్లాడుతున్నావు. నీకు మీ అమ్మలాగే తిక్క ఉన్నట్టుందంటూ.., రా లోపలికి అనగానే.. నాన్న అంటూ శౌర్య పిలిచింది.

నాకే తిక్క.. థ్యాంక్స్ నాన్న
శౌర్య పిలుపుతో సంతోషం వ్యక్తం చేసిన కార్తీక్ బాబు.. నాన్న అంటూ ఇలాగే పిలువు అంటూ చిన్నారిని గుండెలకు హత్తుకొన్నారు. ఆ తర్వాత శౌర్యను ఉద్దేశించి.. ఎందుకు డాక్టర్ బాబు అని పిలుస్తున్నావు.. నిన్ను ఒకలాగా, హిమను మరోక లాగా చూస్తున్నానా అంటూ ప్రశ్నించాడు. అందుకు లేదు నాన్న.. నాకే తిక్క.. థ్యాంక్స్ నాన్న అంటూ శౌర్య సమాధానం ఇచ్చాను.

నాకు కలెక్టర్ కావాలని ఉంది..
శౌర్య థ్యాంక్స్ చెప్పడంతో ఎందుకు అలా చెబుతున్నావు అంటూ కార్తీక్ అడిగితే.. పెద్దయ్యాక నేను కలెక్టర్ అయితే.. అప్పుడు నాన్న అని ధైర్యంగా పిలుస్తానో లేదో అనే భయం ఏర్పడింది అంటూ శౌర్య జవాబు ఇచ్చింది. దాంతో నీకు కలెక్టర్ కావాలని ఉందా అని అడిగితే.. ఇప్పుడే కాదు.. చిన్నప్పటి నుంచి నాకు కలెక్టర్ కావాలని ఉంది. పెద్దయిన తర్వాత నాన్నమ్మ లాగే ఉంటాను కదా.. ఎవరైనా పనిచేయకపోతే అరేయ్ స్టుపిడ్ అంటూ తిడుతాను అని డాక్టర్ బాబుకు శౌర్య చెప్పింది.

హిమను డాక్టర్.. నిన్ను కలెక్టర్‌ను చేస్తా
శౌర్య మాటలకు హ్యాపీగా ఫీలయైన డాక్టర్ బాబు.. నీవు ఎంత వరకు చదువుతావో అంత వరకు చదివిస్తాను. హిమ డాక్టర్ అవుతానంటుంది. హిమ డాక్టర్ అయితే ఆమె పేరుతో పెద్ద హాస్పిటల్ కట్టించి.. కలెక్టర్‌గా నీ చేతుల మీదుగా దానిని ఓపెన్ చేయిస్తాను. వేదిక మీద నీతో కలిసి అని అంటుండగా కార్తీక్ మాటలను మధ్యలో శౌర్య ఆపేసింది.

అప్పుడు కూడా అమ్మ నీ పక్కన ఉండదా
అప్పుడు కూడా అమ్మ నీ పక్కన ఉండదా అంటూ ప్రశ్నించిన మాటలకు కార్తీక్ బాబు నోట మాటలు పెగల్లేదు. ఆ తర్వాత డాక్టర్ బాబు ఆలోచనల్లో పడ్డారు. ఈ జబ్బు ఉంటే పేషంట్ బతకదు అంటూ డాక్టర్ చెప్పిన మాటలు.. అలాగే నా కోడలు రాత్రి, పగలు లేకుండా వంటలు చేస్తూ బతికుతున్నది అంటూ తల్లి సౌందర్య చెప్పిన మాటలు గుర్తు చేసుకొని దీపపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఇంట్లోనే కాదు.. నేలపైనే ఉండే పరిస్థితి లేదు. ఆత్మగౌరవం అంటూ వైద్య పరీక్షలు కూడా చేయించుకోవడం లేదు అంటూ మండిపడ్డారు.

దీపపై ఆగ్రహం వ్యక్తం చేసిన డాక్టర్ బాబు
నా పక్కనే కాదు.. ఈ లోకంలోనే ఉండదు. పిల్లలకు తల్లిగా ఉండటం కూడా ఇష్టం లేదా? తిక్కల మొఖం దానా.. నా కాళ్ల మీద నిలబడుతానంటూ పెద్ద మాటలు చెబుతున్నది. కనీసం ఇప్పుడు నేల మీద కూడా నిలబడలేని పరిస్థితి. మీ నాన్నతో పంపించిన మందులు వేసుకోకపోతే నీకు ఉంటుంది ఇక అంటూ ఆవేశంతో మదన పడ్డారు. దీప ఆరోగ్యం క్షీణించడాన్ని కార్తీక్ బాబు తట్టుకోలేక మానసికంగా వ్యథకు గురవుతున్నారు.


Click it and Unblock the Notifications











