Karthika Deepam వంటలక్కను వెంటాడుతున్న క్యాన్సర్.. డాక్టర్ బాబు పరిస్థితి మరింత దారుణంగా!

మూడేళ్లకుపైగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న కార్తీకదీపం సీరియల్‌ రోజుకో మలుపు తిరుగుతున్నది. భర్త డాక్టర్ బాబు అవమానాన్ని భరించలేక విజయనగరంలో దీపను ఇడ్లీ బండి పెట్టుకొన్న సంగతి తెలిసిందే. అయితే దీపను గుర్తించి ఇద్దరు పిల్లలను తీసుకొని తన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఊహించని ట్విస్టులు చోటుచేసుకొన్నాయి. దీప తీవ్ర అనారోగ్యానికి గురైందనే విషయాన్ని తెలుసుకొన్న ఆమెను కాపాడుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

 దీప ఆరోగ్యం మరింత క్షీణించడంతో

దీప ఆరోగ్యం మరింత క్షీణించడంతో

తనను భార్యగా కాకుండా సౌందర్య కోడలిగానే ఇంటికి తీసుకొచ్చానని చెప్పడంతో మరోసారి దీప తీవ్ర మనో వేధనకు గురైంది. తనను ఇంకా అవమానించారనే విషయంపై ఆమె మనసులో బాధకు గురవుతున్నారు. ఈ క్రమంలో దీప ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఆమెను రక్షించుకొనేందుకు డాక్టర్ బాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

తల్లికి సవాల్ విసిరిన డాక్టర్ బాబు

తల్లికి సవాల్ విసిరిన డాక్టర్ బాబు

దీపకు వైద్యం చేయించడానికి డాక్టర్ బాబు చేస్తున్న ప్రయత్నాలను తన పంతంతో నిర్వీర్యం చేస్తున్నది. ఈ క్రమంలో దీపను తన వెంట పంపించాలని, తనకు వైద్య చేయించకపోతే తన పేరు కార్తీక్ కాకుండా మరో పేరు సిద్ధం చేసుకోవాలని డాక్టర్ బాబు సవాల్ విసిరారు. దీపను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించాడు.

 ఎట్టి పరిస్థితిల్లో వైద్యం చేయించుకోను..

ఎట్టి పరిస్థితిల్లో వైద్యం చేయించుకోను..

అయితే తాను చావనైనా చస్తాను కానీ వైద్యం ఎట్టి పరిస్థితిలో చేసుకోనని దీప స్పష్టం చేసింది. పిల్లలు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరారు.. ఇక వారి గురించి నాకు బెంగలేదు. మీరు నా భార్యగా ఒప్పుకోరు. నేను ఎందుకు బతకాలి. మీకు మీ జీవితంపై క్లారిటీ ఉంది. నాకు నా జీవితంపై క్లారిటీ ఉందని బెట్టు చేసింది. కాబట్టి నన్ను చావు వెంటాడిని భయపడేది లేదని స్పష్టం చేసింది. పంతంతో నీవు నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకు. సామదాన దండోపాయాలు ఉపయోగించైనా వైద్యానికి ఒప్పిస్తాను అంటూ కార్తీక్ బాబు హెచ్చరించాడు.

నీకు క్యాన్సర్ వచ్చే సూచనలంటూ

నీకు క్యాన్సర్ వచ్చే సూచనలంటూ

అయితే తాను చనిపోయేంత రోగం ఏమీ లేదు. గత పదేళ్లలో ఇలా నీరసంగా ఉంటూనే ఉంది అని దీప చెప్పింది. నాకు ఉన్న జబ్బుతో నేను బతుకనని డాక్టర్లు చెప్పారా డాక్టర్ బాబు అంటూ నిలదీసింది. ప్రస్తుతం నీ ఆరోగ్య పరిస్థితి ఇలానే కొనసాగితే నీకు క్యాన్సర్ రావడం ఖాయం అంటూ హెచ్చరించారు. అయినా వైద్యం చేయించుకోనని దీప పంతం చేయడంతో డాక్టర్ బాబు లాగి చెంప మీద గట్టిగా ఒక్కటిచ్చారు.

భర్తగా నేను కొట్టాను అంటూ కార్తీక్

భర్తగా నేను కొట్టాను అంటూ కార్తీక్

డాక్టర్ బాబు చేయి చేసుకోవడంతో దీప దిగ్బ్రాంతికి గురైంది. కార్తీక్ నాపై చేయి చేసుకోవడం ఏమిటనే విధంగా చూడటంతో.. నేను సౌందర్య కొడుకుగా కొట్టలేదు. నీ భర్తగా కొట్టాను. ఆ హక్కు నాకు ఉంది. నీ మెడలో ఉన్న తాళిని కట్టింది నేనే. నిన్ను కొట్టడానికి ఎలాంటి స్థాయికైనా వెళ్తానని హెచ్చరించారు. ఇలాంటి భావోద్వేగాల మధ్య దీప, డాక్టర్ బాబు చిక్కుకుపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X