Karthika deepam Twist దీప నీ సినిమా ఫ్లాప్ అంటే. మోనిత అసలు సినిమా ఇప్పుడే అంటూ వంటలక్క షాక్

కార్తీకదీపం సీరియల్‌లో ఊహించని ట్విస్టులు చోటుచేసుకోవడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచినట్టు కనిపిస్తున్నది. మోనిత ప్రసవించిన బిడ్డ పేగును మెడకు వేసుకొని జన్మించడంతో దోష నివారణ పూజ నిర్వహించడానికి కార్తీక్, తల్లి సౌందర్య వెల్లడం, ఆ పూజను దీప చూడటం ఎమోషనల్‌గా మారింది. దోష నివారణ పూజ తర్వాత మోనిత ఓవరాక్షన్ చూసి కార్తీక్, సౌందర్య అసహనంతో రగలిపోయారు. ఇక మోనితతో పూజలో కూర్చొన్న కార్తీక్‌ను చూసిన దీప ఇంటికి దూరమైంది. ఆ తర్వాత తాజాగా నవంబర్ 11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌‌లో ఏం జరిగిందంటే..

మోనితను కొట్టబోయిన కార్తీక్

మోనితను కొట్టబోయిన కార్తీక్

దోష నివారణ పూజ తర్వాత కార్తీక్‌తో మాటలు కలిపేందుకు మోనిత ప్రయత్నించింది. మన బాబును చూడు... పాపతో ఆడుకోవా? వాడిని ఎత్తుకోవా? అని మోనిత అంటే.. నీ బతుకు నీవు బతుకు అని కార్తీక్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దాంతో కార్తీక్‌ను ఆపి.. ఆనందరావు గారు.. మీ నాన్నతో ఆడుకొంటావా? మీ నాన్నమ్మను బిస్కెట్స్ తీసుకురమ్మని అడుగుతావా? అంటూ మోనిత అనడంతో.. కార్తీక్ కోపంతో ఊగిపోతూ.. నిన్న అంటూ కొట్టబోయాడు. దాంతో కార్తీక్‌ను సౌందర్య ఆపారు. ఆ తర్వాత వారిద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పాపం దీప అంటూ మోనిత

పాపం దీప అంటూ మోనిత

అయితే మోనిత, కార్తీక్ మధ్య జరిగిన గొడవను చూస్తున్న ప్రియమణి జాలిగా ముఖం పెట్టింది. ఎందుకు ప్రియమణి అలా జాలిగా చూస్తావు. నేను సక్సెస్ అయ్యాను. జాలి పడాల్సింది దీప అక్కమీద.. పాపం దీప.. అని.. ఆ మాటలు ఎందుకు అన్నానో నీకు ముందు ముందు నీకే తెలుస్తుంది. ఐ లవ్ యూ దీపక్క అంటూ మోనిత ఆనందంలో మునిగిపోయింది.

దొరబాబు లాంటి బిడ్డను కన్నాను అంటూ

దొరబాబు లాంటి బిడ్డను కన్నాను అంటూ

మోనిత ఇంటికి వెళ్లి తనను తాను ప్రశంసించుకొన్నది. ఎంతైనా నేను గ్రేట్.. జైలుకు వెళ్లాను. దొరబాబు లాంటి బిడ్డను కన్నాను. నా అత్త సౌందర్యతో కలిసి పూజా చేశాను. ఇదంతా మోనిత సాధించిన గొప్పతనమే కదా.. అని మోనిత సంబరపడింది. అయితే కార్తీక్ తనను తిట్టడంపై ఆలోచనల్లో పడింది. నన్ను సరిగా అర్ధం చేసుకో.. అర్ధం చేసుకొంటే ఇలాంటి కన్‌ఫ్యూజన్ ఉండవు. గుడిలో పూజా చేశాం. ఉయ్యాల్లో బాబు ఉన్నాడు. ఈ ప్రశ్నలకు కార్తీక్ మాత్రమే సమాధానం చెప్పాలి. నీతో ఆ జవాబులు చెప్పిస్తాను అని మోనిత తనలో తాను అనుకొన్నది.

గుడిలో దీప కనిపించింది అంటూ

గుడిలో దీప కనిపించింది అంటూ

ఇక ఇంటికి చేరుకొన్న సమయంలో తల్లి సౌందర్యతో కార్తీక్ మాట్లాడుతూ.. నాకు గుడిలో దీప కనిపించింది అని చెప్పాడు. దాంతో సౌందర్య కంగారు పడిపోయింది. ఒకవేళ దీప అక్కడికి వస్తే ఊరుకొంటుందా? ఊరుకొంటుందా? గొడవ పెట్టదా? అని సౌందర్య చెప్పింది. అయితే దీప గుడికి రాకపోవచ్చు.. నీవు ఆమె ధ్యాసలో ఉండి అలా అనుకొని ఉండొచ్చు అని కార్తీక్‌కు సర్దిచెప్పింది.

 దీపక్క రాలేదా అంటూ వారణాసి

దీపక్క రాలేదా అంటూ వారణాసి

అయితే కారులో దీప రాకపోవడంతో సౌందర్యతో కారు డ్రైవర్ మాట్లాడుతూ.. దీపక్క రాలేదా అంటే.. దీప మాతో ఎందుకు వస్తుంది అని సౌందర్య ప్రశ్నించింది. అయితే గుడి వద్ద మీ కారు కనిపిస్తే.. ఆగిపోయింది.. మీ కారులో వస్తానని ఆగిపోయింది అంటే సౌందర్య, కార్తీక్ కంగారు పడిపోయారు. అయితే మీతో రాలేదా? ఇంటికి కూడా రాలేదు అంటూ కారు డ్రైవర్ వారణాసి ప్రశ్నించాడు.

దీపకు ముఖం ఎలా చూపించాలి అంటూ

దీపకు ముఖం ఎలా చూపించాలి అంటూ

తాను మోనితతో పూజలో కూర్చొన్నట్టు దీప చూసిందనే విషయంతో కార్తీక్ మానసికంగా దిగజారిపోయాడు. నడవలేక ఇంట్లో కూలబడిపోయాడు. దీప చూసిందంటే.. అంతా అయిపోయినట్టే అంటూ సౌందర్య బాధపడింది. పూజలో కూర్చోవడం చూసిన దీప ఇంటికి రాలేదంటే.. ఎక్కడికి పోయి ఉంటుంది అంటూ కంటతడి పెట్టింది. ఇక దీపకు నా ముఖం ఎలా చూపించాలి? వద్దు వద్దు అంటూ చెప్పినా మోనితతో పూజ చేయించావు. ఇక దీప నన్ను నమ్ముతుందా అంటూ కార్తీక్ కన్నీరుమున్నీరయ్యాడు.

దీపకు మీరు ద్రోహం చేశారంటూ

దీపకు మీరు ద్రోహం చేశారంటూ

మోనితతో పూజ చేయించిన విషయం దీపకు తెలియడంతో తండ్రి ఆనందరావు ఆవేశపడిపోయాడు. అనుకొన్నదంతా అయిపోయింది. ఈ విషయం గురించి ముందే చెప్పమని కార్తీక్ చెప్పాను. కానీ మీరు చెప్పలేదు. ఇక ఈ ఇంట్లో ఎలా దీప ఉంటుంది. దీప ఈ ఇంట్లోకి రాదు అని ఆనందరావు అంటే.. దీపను ఎలాగైనా ఒప్పిస్తాను. కాళ్లు పట్టుకొనైనా ఇంటికి తీసుకొస్తాను అంటే.. మీరంతా దీపకు ద్రోహం చేశారు. మీరు చేసింది తప్పు కాదు.. పొరపాటు కాదు.. ద్రోహం జరిగింది అంటూ ఆనందరావు ఆగ్రహం చెందారు. అయితే ఈ తప్పులకు కారణం దీపనే అంటూ కార్తీక్ అంటూ.. మమ్మ ఏం చేద్దామంటూ అడుగుతూ ఆలోచనల్లో పడ్డారు.

Recommended Video

Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
 అసలు సినిమా ఇప్పుడే అంటూ మోనితకు దీప షాక్...

అసలు సినిమా ఇప్పుడే అంటూ మోనితకు దీప షాక్...

ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మోనితకు దీప జబర్దస్త్ షాక్ ఇచ్చింది. తాజా ప్రోమోలో దీపక్క నీ సినిమా ప్లాప్ అని మోనిత అని సంతోషంలో మునిగిపోయింది. అయితే అసలు సినిమా ఇప్పుడే మొదలైంది అంటూ దీప షాకిచ్చింది. ప్రస్తుతం తాజా ప్రోమో సీరియల్‌పై మరింత ఆసక్తిని పెంచింది. ఈ ప్రోమో వైరల్‌గా మారడంతో.. సీరియల్‌ మున్నుందు వచ్చే ట్విస్టు ఏమిటి అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X