For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam weekly roundup నిరుపమ్ పెళ్లి గోల.. సౌందర్య, స్వప్న, శోభ మూడు ముక్కలాట

  |

  కార్తీకదీపం సీరియల్ గత మూడు సంవత్సరాలుగా సుదీర్ఘంగా సాగుతున్నది. ఈ సీరియల్‌లో రెండో జనరేషన్ మధ్య బంధాలు, అనుబంధాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా నిరుపమ్ పెళ్లి వ్యవహారం ప్రధాన అంశంగా సీరియల్ కొనసాగుతున్నది. ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టుతో సీరియల్ జోష్‌తో ముందుకెళ్తున్నది. గతవారం రోజులుగా అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు ఈ సీరియల్ ఎలాంటి మలుపులు తిరిగిందనే విషయంలోకి వెళితే..

   ఆగస్టు 1వ తేదీ ఎపిసోడ్

  ఆగస్టు 1వ తేదీ ఎపిసోడ్

  తన కుటుంబ సభ్యులపై అలిగి బయటకు వెళ్లిన శౌర్యను దుండగులు కిడ్నాప్ చేశారు. గతంలో దొంగతనం కేసులో తమను పట్టించడానికి ప్రతీకారం తీర్చుకొన్నామని శౌర్యకు చెప్పి బంధించారు. శౌర్య ఆచూకీ తెలుసుకొని వచ్చిన నిరుపమ్.. దుండగుల బారి నుంచి శౌర్యను రక్షించాడు. అయితే దుండగులు పారిపోతూ నిరుపమ్‌, శౌర్యను గదిలో బంధించారు. అయితే నిరుపమ్ ఇచ్చిన సమాచారంతో హిమ, ప్రేమ్ వారిని కాపాడేందుకు అక్కడికి చేరుకొన్నారు. అయితే శౌర్యను నిరుపమ్‌ను ఒకే రూమ్‌లో ఉంచితే వారి మధ్య ప్రేమ పెరుగుతుందని ప్రేమ్ డ్రామాకు తెరలేపాడు. ఫుల్ ఎపిసోడ్ కోసం..

  ఆగస్టు 2వ తేదీ ఎపిసోడ్

  ఆగస్టు 2వ తేదీ ఎపిసోడ్


  అయితే తాను పక్కగా ప్లాన్ చేసి శౌర్యను అడ్డు తొలగించుకోవాలని చేసిన పనికి నిరుపమ్ అడ్డు తగలడంతో డాక్టర్ శోభ అసహనంతో ఊగిపోయింది. నిరుపమ్‌కు చేరువ అవుతుండగా శౌర్యను దూరం చేయాలని దుండగులతో చేసిన కిడ్నాప్ ప్లాన్ బెడిసికొట్టడంతో శోభ మరో ప్లాన్‌కు తెరలేపింది. ప్రేమ్ ఆడిన నాటకంతో శౌర్య, నిరుపమ్ రాత్రంతా ఒకే గదిలో ఉండిపోయారు. వారిద్దరూ ఒకరిపై మరొకరు చిర్రుబుర్రులు ఆడుతూ కాలం గడిపారు. ఫుల్ ఎపిసోడ్ కోసం..

  ఆగస్టు 3వ తేదీ ఎపిసోడ్

  ఆగస్టు 3వ తేదీ ఎపిసోడ్

  గదిలో శౌర్య, నిరుపమ్ బయట ఉన్న హిమ, ప్రేమ్ మధ్య ప్రేమ వ్యవహారానికి తెరలేచింది. వీడియోలో ప్రేమ్ లవ్ ప్రపోజల్‌‌ను చూసిన హిమ షాక్ తిన్నది. చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను. ఎన్నోసార్లు హిమ ఐ లవ్ యూ చెప్పాలనుకొన్నాను. కానీ ఏదో కారణం వల్ల చెప్పలేకపోయాను ప్రేమ్ చెప్పిన మాటలు విని హిమ ఆలోచనల్లో పడింది. ఇంట్లో హిమ గురించే నిరుపమ్ ఆలోచించడంపై శౌర్య మనస్తాపానికి గురైంది. ఫుల్ ఎపిసోడ్ కోసం..

   ఆగస్టు 4వ తేదీ ఎపిసోడ్

  ఆగస్టు 4వ తేదీ ఎపిసోడ్


  ఉదయాన్ని నిరుపమ్, శౌర్యను గది నుంచి బయటకు తీయడంతో హిమ, ప్రేమ్ అంతా కలిసి ఇంటికి వెళ్లారు. నిన్ను కిడ్నాప్ ఎందుకు? ఎవరు చేశారు అని సౌందర్య అడిగితే.. అంటే ఆటోదాన్ని ఎవరు కిడ్నాప్ చేస్తారా అని నీ ఉద్దేశం అంటూ ఎదురు ప్రశ్న వేసింది. అయితే ఇంట్లో తన కుమారులిద్దరు ఉండటం చూసి స్వప్న ఆవేశపడింది. నా ఇద్దరు కొడుకులకు నీ ఇద్దరు మనవరాళ్లను కట్టబెట్టాలని చూస్తున్నారా.. అది వాడిని మాయ చేస్తే.. ఇది వీడిని మామ చేసేలా ఉంది అని అంటే.. సౌందర్య కూతురుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే మాయ చేయడం అనడంపై అత్త స్వప్న దురుసుగా మాట్లాడటంపై శౌర్య ఘాటుగా స్పందించింది. పెళ్లి కార్డుల తీసుకొచ్చి.. కార్డులో ఉన్న తేదీ రోజే నా మనవడు నిరుపమ్, హిమకు పెళ్లి జరుగుతుందని సౌందర్య చెప్పింది. అయితే నిరుపమ్, శౌర్యకు పెళ్లి చేస్తానంటే.. హిమను సౌందర్య చెంపదెబ్బ కొట్టింది.

  ఆగస్టు 5వ తేదీ ఎపిసోడ్

  ఆగస్టు 5వ తేదీ ఎపిసోడ్


  నిరుపమ్, హిమ పెళ్లికి సౌందర్య ఏర్పాట్లు మొదలుపెట్టింది. హిమ ఇష్టం లేదని చెబుతున్నప్పటికీ ఆమె పట్టించుకోలేదు. అయితే సౌందర్య పెళ్లి పనుల గురించి డాక్టర్ శోభ ఆందోళన పడింది. అయితే పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను అంటూ స్వప్న సవాల్ విసిరింది. అయితే ఎవరు అడ్డుపడినా నిరుపమ్, హిమ పెళ్లి చేస్తానని సౌందర్య ప్రతి సవాల్ విసిరింది. అయితే శౌర్యను నేను పెళ్లి చేసుకొను. నాకు ఉన్నది ఒకటే జీవితం.. దానిని నీతో పంచుకోవాలని అనుకొన్నాను అంటూ హిమకు నిరుపమ్ చెప్పాడు. అయితే తన కుటుంబంలో అందరూ హ్యాపీగానే ఉన్నారు..ఇక్కడ నేను ఉండటం అవసరమా? అంటూ శౌర్య షాకింగ్‌గా మాట్లాడింది. అయితే స్వప్నకు సౌందర్య మరో షాక్ ఇచ్చింది. పెళ్లి కార్డులు ఇచ్చి.. అందులో ఉన్న తేదీ రోజునే నిరుపమ్, హిమ పెళ్లి అవుతుంది అని ఛాలెంజ్ చేసింది.

   ఆగస్టు 6వ తేదీ ఎపిసోడ్

  ఆగస్టు 6వ తేదీ ఎపిసోడ్

  నిరుపమ్ పెళ్లి విషయంలో సౌందర్య, శోభ, స్వప్న తమ పనుల్లో తాము ఉన్నారు. ఎవరి ప్లాన్స్ వారు వేసుకొంటూ కనిపించారు. ఇక మోనిత కొడుకు శౌర్యను కలిసి.. నీవు నానమ్మ ఇంటికి వెళ్లడం హ్యాపీగా ఉంది అని అన్నాడు. అయితే నాకు అలాంటి ఇంట్లో ఒక్కరోజైనా ఉండాలని ఉంది అని రవ్విడ్లీ అన్నాడు. దాంతో నీవు ఆ ఇంటికి వారసుడివే కదా.. నీకు ఆ ఇంట్లో ఉండే హక్కు ఉంది అని శౌర్య మనసులో అనుకొన్నది. ఇదిలా ఉండగా, నిన్ను పెళ్లి చేసుకొంటానని హిమతో ఒక్కమాట చెప్పించు.. నేను అమెరికా వెళ్లిపోతాను.. లేదంటే నన్ను నీవు పెళ్లి చేసుకోవాలి అని నిరుపమ్‌ను శోభ ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది.

  English summary
  Karthika Deepam August 1st week roundup story: 1419 to 1424 episode from August 1st to August 6th
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X