Karthika Deepam.. పగటి కలలు కనకు.. గుమ్మడికాయతో కొడుతా.. మోనితకు సౌందర్య వార్నింగ్
కార్తీకదీపం సీరియల్‌లో మరోసారి ఎత్తులు పైఎత్తులు కనిపించాయి. జైలులో ఉన్న మోనిత కార్తీక్ కుటుంబాన్ని సమస్యల్లో పడేస్తూ కుట్రలు చేస్తుండటంతో సౌందర్య కోపంతో ఊగిపోయింది. చివరకు ఏకంగా జైలుకు వెళ్లి మోనితకు సౌందర్య ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. ప్రేమ, పెళ్లి అంటూ పగటి కలలు కనబోకు. అసంభవాలను ఊహించుకోకు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఇంకా అక్టోబర్ 18న ప్రసారమైన 1173 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

నీ ముఖం చూడొద్దని అనుకొన్నా
పవిత్ర స్త్రీ గర్బాన్ని అతి నీచంగా వాడుకొని మమ్మల్ని దెబ్బ కొట్టాలని చూశావు. అసలు నీ ముఖాన్ని జీవితంలో చూడొద్దని అనుకొన్నాను అని సౌందర్య అంటే.. నేను అదే అనుకొన్నాను. బుల్లి మనవడిని చేతిలో పెట్టే వరకు నీ ముఖం చూడకూడదని అనుకొన్నాను. ఇంతకు నాకు ఏం తెచ్చావు అంటీ. దీపక్క నాకు యాపిల్స్ తెచ్చింది. అరే దీపక్క వచ్చినట్టు చెప్పిందా లేదా నేనే తొందరపడి చెప్పేశానా? ఇంతకు నాకు స్వీట్లు, గజ్జికాయలు ఏమైనా తెచ్చావా? లేక సీమంతానికి ప్లాన్ చేశారా అని మోనిత వెటకారంగా సమాధానం ఇచ్చింది.

ఈశ్వరుడు నోరు ఇచ్చాడని వాగకు
ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు కదా.. ప్రతీ దానికి ఓ స్క్రీన్ ప్లే ఉంటుంది. అది అద్బుతమైన ముగింపు ఇస్తుంది అని సౌందర్య అంటే.. మా మామగారి పేరుతో ఆనంద్ ఓ బుల్లి మనవడిని మీ చేతిలో పెడుతాను. పుట్టబోయే మీ మనవడి రాక కంటే.. ఈ కథలో, నా ప్రేమ కథలో ముగింపు ఇంతకంటే గొప్పగా ఏముంటుంది అని మోనిత జవాబచ్చింది. కృత్రిమ గర్బంతో విలువలకు విరుద్ధంగా గర్బం తెచ్చుకొన్న నీకు మేము చెప్పేది తలకెక్కదు. జైలుశిక్ష పడింది తెలుసు కదా అని సౌందర్య అన్నారు.

పాత కేసులన్నీ తిరగదొడిస్తా
జైలు కెళ్లింది. మేమంతా హ్యాపీగా ఉన్నామని అనుకోవద్దు. ఇక్కడి నుంచే నేను నా ప్లాన్స్ అన్నింటికి పదును పెడుతున్నాను. పేపర్లో చదివే ఉంటావు కదా.. నీ ఆలోచనలు, నీ ప్లాన్స్ అన్నీ నాకు తెలుసు. నీవు పెరోల్ మీద బయటకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నావు కదా.. నీవు వస్తానంటే రానిస్తానా. షాకయ్యావా? ఇక ముందు అన్నీ షాకులే. నీ పాత కేసులన్నీ తిరగదోడిస్తా. నీకు పడిన శిక్షతోపాటు మరికొన్ని క్రిమినల్ కేసులు పెట్టించి జీవితాంతం నీకు జైలు జీవితం అనుభవించేలా చేస్తా. కార్తీక్, దీప లాంటి దాన్ని కాదు. నీకు భయపడటానికి. నీవు ఒక్కటంటే నేను వంద అంటాను. నీవు గులకరాయితో కొడితే నేను గుమ్మడి కాయతో కొడుతాను అంటూ సౌందర్య గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

నా కడుపులో పెరుగుతున్న మీ వారసుడు
సౌందర్య వార్నింగ్‌కు కౌంటర్ ఇస్తూ.. మీరు పకడ్బందిగా వచ్చినట్టు ఉన్నారు. నా గురించి రీసెర్చ్ చేసినట్టు ఉన్నారు. మీరు ఎన్ని చెప్పినా నా కడుపులో పెరుగుతున్ననీ వంశోద్దారకుడు.. వారసుడు మీ ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెబుతాడు. అప్పుడు ఏ సమస్యలు ఉండవు. అన్నీ ప్రేమలే. అన్ని హక్కులు నాకు, వాడికే అంటూ మోనిత అంటే.. పగటి కలలు కనకు మోనిత.. నీ పేరు పలకడానికి మనసు అంగీకరించడం లేదు. కార్తీక్ మీద ప్రేమ ఉంటే అది నీ సమస్య. గోడల మీద రాసుకొంటావో.. లేదా గోడలతో మాట్లాడుకొంటావో నీ ఇష్టం. అసహజ పద్దతిలో గర్బం తెచ్చుకొన్నావు. నీ ప్రేమ, పిచ్చి. నీ గర్భం అంతా స్వయంకృతాపరాధం అని సౌందర్య ఘాటుగా స్పందించింది.

నా కడుపులో పుట్టబోయే బిడ్డ శ్రీకృష్ణుడు
శిశుపాలుడు తప్పుల మీద తప్పులు చేస్తూనే పోయాడు. శ్రీకృష్ణుడు చూస్తూ పోయాడు. వంద తప్పుల తర్వాత క్షమించాడు. ఆ తర్వాత శిక్షించాడు అని సౌందర్య అంటే.. ఇక నీవు చేసిన తప్పులు చాలు అని సౌందర్య అంటే.. మీరు శిశుపాలుడు అని అంటున్నారు. కానీ నాకు పుట్టబోయే బిడ్డ శ్రీకృష్ణుడిలా జైలులో పుడుతున్నాడని సంతోష పడుతున్నాను. చిన్న కృష్ణుడు వాడి అడుగులు మీ ఇంట్లో పడుతాయి. నీ ప్రేమ నా ఖర్మ అంటున్నావే.. నీ ప్రతివతశిరోమణి లేనప్పుడు.. నీ కొడుకు నా ఇంటికి వచ్చేవాడు. అది మరిచిపోయావా? పీటల వరకు వచ్చిన పెళ్లిని ఆపేశావు. ఇందులో నీ కార్తీక్‌ది, నీదే తప్పు. కొడుకును ఒడిలో పెట్టుకొని పెళ్లి పీటల మీద కూర్చొంటా అని మోనిత శపథం చేసింది.

తూరుపు తిరిగి దండం పెట్టాల్సిందే
మోనిత చేసిన శపథానికి కౌంటర్ ఇస్తూ.. పగటి కలలు కనకు. నీ నుంచి దూరంగా నా కార్తీక్, దీపను అమెరికాకు పంపిస్తున్నాను. నేర చరిత్ర కలిగిన నీకు అమెరికా వెళ్లడానికి కుదరదు. పడమటి దేశానికి వెళ్లడం నీకు కుదరదు. తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సిందే. నీ కృత్రిమ గర్బాన్ని తెచ్చుకొన్నావని, ఆధారాలను సేకరిస్తాను. నీకు మరింత శిక్షపడేలా చేస్తాను. అసంభవాలను ఊహించకు. ఆరోగ్యం సహకరించదు. ఆరోగ్యం పాడు అవుతుంది అని సౌందర్య కౌంటర్ ఇచ్చింది. కార్తీక్ ఫ్యామిలీతో సహా అమెరికాకు వెళ్తున్నారనే విషయం తెలిసిన మోనిత కంగారు పడిపోయింది. నా కార్తీక్ అమెరికాకు వెళ్తే నా గతి, నా పిల్లాడి గతి ఏం కావాలి అని షాక్ తిన్నది.
Recommended Video

కార్తీకదీపం సీరియల్ రేటింగ్
కార్తీకదీపం సీరియల్ 39వ వారం అర్బన్ ప్రాంతంలో 14.95 రేటింగ్ సాధిస్తే.. 40వ వారంలో 12.80 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. ఇక రూరల్ 39వ వారం ప్రాంతంలో 40వ వారంలో 14.52 రేటింగ్ సాధించింది. కార్తీకదీపం సీరియల్ గతంలో టాప్ రేటింగ్ సాధించినప్పటికీ.. గత కొద్దివారాలుగా నసపెట్టే విధంగా, సాగదీత ఉండటం వల్ల రేటింగ్ దారుణంగా పడిపోతూ వస్తున్నది.


Click it and Unblock the Notifications











