Karthika Deepam తింగరి చేతిలో మోసపోయా.. త్యాగం చేయకు.. జ్వాలా, హిమ ఎమోషనల్

నిరుపమ్ తన ప్రేమను తిరస్కరించారనే బాధలో ఉన్న జ్వాలాను ఊరడించేందుకు ఆనందరావు, సౌందర్య ప్రయత్నించారు. అయితే మీరు నాపై ప్రేమ చూపించినందుకు ధన్యవాదాలు. నా జీవితంలో చెల్లి ఎలా అయితే లేదో.. నా లైఫ్‌లో మ్యారేజ్ కూడా ఉండదు. ఇంకా ఈ విషయం గురించి మళ్లీ మాట్లాడకండి అని సౌందర్య, ఆనందరావుకు చెప్పింది. కార్తీకదీపం సీరియల్‌ 1393 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

 తింగరి చేతిలో మోసపోయా

తింగరి చేతిలో మోసపోయా


ఆనందరావు, సౌందర్య వెళ్లిపోయిన తర్వాత తన తండ్రి కార్తీక్ ఫోటోను పట్టుకొని.. ఏంటి నాన్న నా జీవితం ఇలా అయిపోతున్నది. డాక్టర్ సాబ్ లాంటి వాడు నా భర్త అవుతాడని గొప్పగా కలలు కన్నాను. కానీ నా జీవితం ఎలా అయిపోయిందేమిటి?. ఇంటి నుంచి బయటకు వచ్చాను. పేరు మార్చుకొని ఆటో నడుపుతున్నాను. డాక్టర్ సాబ్ కనిపించిన తర్వాత కొత్త జీవితం మొదలైందని అనిపించింది. కానీ ఆ తింగరి చేతిలో మోసపోయాను. అమ్మను మోసగించి నీ జీవితంలోకి మోనిత ఎలా వచ్చిందో.. అలానే తింగరి నా జీవితంలోకి వచ్చింది. నాకు పెద్దల అండ లేదు. నేను ఒంటరిదానిని. ఏడవడం కూడా ఎప్పుడో మరిచిపోయాను. మీరే లేకుంటే ఎవరు ఉన్నా లేకున్నా ఏమిటి? ఒంటరిగానే పోరాటం చేస్తాను నాన్న అని జ్వాలా మనసులో అనుకొన్నది.

నా మూలంగా జ్వాలా కష్టాలు

నా మూలంగా జ్వాలా కష్టాలు


ఇక హిమ కూడా తన తల్లిదండ్రుల ఫోటోను పట్టుకొని.. మీ చివరి మాటలను నేను నెరవేర్చలేకపోతున్నా. జ్వాలా పెళ్లి కోసం క్యాన్సర్ అనే నాటకం ఆడాను. కానీ ఫలితం లేకపోయింది. నా మూలంగా జ్వాలా కష్టాలు పడుతున్నది. ఆటో నడుపుతున్నది. ఇలా ఎంతకాలం కష్టాలు అనుభవిస్తాం డాడీ.. మనమంతా కలిసినామని అనుకొనే లోపే.. మీకు యాక్సిడెంట్ అయింది. శౌర్య ఇంకా ఎవరి ప్రేమను నోచుకోలేదు. శౌర్య జీవితంలో ఆనందం నింపాలంటే నిరుపమ్ బావతో పెళ్లి జరిపించాల్సిందే. ఇంకా నేను ఓడిపోలేదు. నిరుపమ్, జ్వాలాను కలుపాలని నానమ్మను అనుకొంటున్నాను. నాన్నమ్మ తలుచుకొంటే జరగనిది ఏమీ ఉండదు అని హిమ అనుకొన్నది.

మీరు నాకు సపోర్ట్ చేయండి

మీరు నాకు సపోర్ట్ చేయండి


నిరుపమ్, జ్వాలా పెళ్లి గురించి ఆలోచిస్తున్న హిమను ఉద్దేశించి.. నీకు జ్వాలాపై ప్రేమ ఉన్నంత మాత్రన.. నిరుపమ్ పెళ్లి చేసుకోవాలని ఆశపడటం సరికాదు. కష్టాల్లో ఉన్న జ్వాలాకు అండగా నిలువడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మీరు నాకు సపోర్ట్ చేయండి అని అంటే.. జ్వాలాకు మరో సంబంధం తెచ్చి పెళ్లి చేద్దాం. అంతేకాని నీవు నీ పెళ్లిని త్యాగం చేయకు. వారిద్దరి పెళ్లి చేయడానికి ఆలోచిస్తున్నావు. నిరుపమ్‌కు కూడా కొన్ని ఆశలు ఉంటాయి కదా.. ఎదుటి వారి ఆశలను త్యాగాలు చేయకు అని సౌందర్య అంటే.. నేను ఒప్పిస్తాను అంటూ హిమ అంది. దాంతో నీవు మొండిగా వ్యవహరించకు అని సౌందర్య చెప్పింది.

 నిరుపమ్‌తో జ్వాలా పెళ్లి చేయాలని

నిరుపమ్‌తో జ్వాలా పెళ్లి చేయాలని


నావల్లే అమ్మ, నాన్న చనిపోయారని శౌర్య బాధపడుతున్నది అని హిమ అంటే.. నీ పొరపాటు వల్ల యాక్సిడెంట్ జరిగింది. నీవు తప్పు చేయడం వల్ల ఆ ప్రమాదం జరగలేదు. ఏదో ఒక రోజు శౌర్య తన ఆలోచనను మార్చుకొంటుంది. అంతేకానీ.. నిరుపమ్‌తో జ్వాలా పెళ్లి చేయాలని చూడకు అని సౌందర్య అంది. అయితే జ్వాలా, నిరుపమ్‌తో పెళ్లి చేయరని తెలుసు. కానీ నా ప్రయత్నాలు నేను చేస్తాను అని హిమ అంది. అయితే నీవు నిశ్చితార్థం నుంచి తప్పించుకొన్నట్టు.. పెళ్లి పీటల నుంచి తప్పించుకొంటావా? నేను ప్రాణాలతో ఉండగా అది జరగదు అని సౌందర్య చెప్పింది.

రవ్విడ్లీకి యాక్సిడెంట్

రవ్విడ్లీకి యాక్సిడెంట్


ఇదిలా ఉండగా, మోనిత కొడుకు రవ్విడ్లీకి యాక్సిడెంట్ కావడంతో హిమ, జ్వాలా అక్కడకు చేరుకొన్నారు. జ్వాలా రావడానికి ముందు రవ్విడ్లీకి హిమ వైద్యం చేసింది. తనకు ఇంజెక్షన్ అంటే భయమని రవ్విడ్లీ అంటే.. నాకు కూడా భయమే.. కానీ జ్వాలా వల్ల ఆ భయం పోయింది. నాకు జ్వాలా అంటే అందుకే ఇష్టం అని హిమ చెప్పింది. అంతలోనే జ్వాలా అక్కడికి వచ్చి.. ఏంటిరా చూసుకోవద్దా? ఈ డబ్బులు తీసుకో అంటూ రవ్విడ్లీకి జ్వాలా ఇచ్చింది. అయితే డబ్బులు నాకు వద్దు అంటే.. ట్రీట్‌మెంట్ చేయించుకొంటున్నావు కదా.. దానికి ఫీజు చెల్లించు అని జ్వాలా చెప్పింది. అంతలోనే జ్వాలా అంటే ఇష్టమని చెప్పావు కదా.. మరీ ఎందుకు మాట్లాడటం లేదని అని రవ్విడ్లీ అన్నాడు. అంతలోనే జ్వాలా బయటకు వెళ్తుంటే.. చేయి పట్టుకొని.. డాక్టర్ సాబ్‌ను ప్రేమించడం ఆపకు అంటూ హిమ చెప్పడంతో జ్వాలా ఆశ్చర్య పోయింది.

 కార్తీక్ దీపం 25వ వారం రేటింగ్

కార్తీక్ దీపం 25వ వారం రేటింగ్


కార్తీకదీపం సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే.. 24వ వారం రూరల్‌లో 10.74 నమోదు చేసుకోగా 25వ వారంలో 11.51 రేటింగ్‌ను సాధించింది. ఇక అర్బన్ ప్రాంతంలో 24వ వారం 10.72 రేటింగ్‌తో సరిపెట్టుకోగా, 25వ వారం 11.17 రేటింగ్‌ను నమోదు చేసింది. ఇటీవల కాలంలో ఈ సీరియల్‌ రేటింగ్ ఎక్కువగానే క్షీణించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X