నిరుపమ్ ముసలోడు.. ‘కార్తీక దీపం’ హీరోపై శ్రీముఖి సంచలన వ్యాఖ్యలు

బుల్లితెరపై ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని నటుడు నిరుపమ్ పరిటాల (Nirupam Paritala). కార్తీక దీపం సీరియల్ తో సంచలనం సృష్టించారు. టెలివిజన్ రంగంలో సూపర్ స్టార్ గా ఎదిగారు. ఆయన సీరియల్స్ కు విశేషమైన ఆదరణ దక్కుతుండటం విశేషం. మరోవైపు ఆయనకు బుల్లితెర ఆడియెన్స్ ల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా నిరుపమ్ పరిటాల భారీ రేటింగ్ వస్తున్న సీరియల్స్ లో నటిస్తూ అంతకంతూ ఎదుగుతున్నారు. ఎప్పుడూ సీరియల్స్ లోనే కాకుండా ఇక తాజాగా కాస్తా రూటు మార్చి స్టార్ మా ఛానెల్ లోని ఒక స్పెషల్ షోకు హాజరయ్యారు. తన అభిమానులను సర్ ప్రైజ్ చేసేందుకు విచ్చేశారు.

స్టార్ మా ఛానెల్ లో కొన్నాళ్లుగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం టీవీ ప్రోగ్రామ్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) వ్యాఖ్యతాగా వ్యవహరిస్తోంది. అయితే ఈ షోలో తాజాగా సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్ ను షూట్ చేశారు. ఇందుకు సంబంధించిన లేటెస్ట్ ప్రొమోను తాజాగా విడుదల చేశారు. ఏప్రిల్ 20 ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ ఫుల్ ఎపిసోడ్ స్టార్ మా ఛానెల్ లో ప్రసారం కానుంది. ఇక తాజాగా విడుదలైన ప్రోమో మాత్రం సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్ పై ఆసక్తిని క్రియేట్ చేసింది.

Karthika Deepam 2 Actor Nirupam Paritala Insulted by Anchor Sreemukhi

ఆదివారం విత్ స్టార్ మా పరివారం సమ్మర్ స్పెషల్ (Aadivaaram With Star Maa Parivaaram Summer Special) కు సంబంధించి డిజిటల్ కట్ ను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో బుల్లితెర స్టార్స్ నిరుపమ్ పరిటాల (కార్తీక్ బాబు), గుండె నిండి గుడి గంటలు హీరో బాలు (విష్ణుకాంత్) తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వ్యాఖ్యాతాగా వ్యవహరిస్తున్న శ్రీముఖి షోకు గ్రాండ్ గా స్వాగతం పలికింది. వారికి సాదరంగా స్వాగతం పలికింది. అలాగే సమ్మర్ స్పెషల్ షోలో ఉండే టాస్క్ లను వివరించింది. ఈ సారి టాస్క్ ల్లో గెలిచిన విన్నర్ కు కాశ్మీర్ ట్రిప్ ఫ్రీగా లభిస్తుందని కూడా చెప్పి ఉత్సాహం తెప్పించింది.

అయితే పలు టాస్క్ లను వివరిస్తున్న క్రమంలో బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాలపై శ్రీముఖి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన వయస్సుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 36 ఏళ్ల యంగ్ యాక్టర్ ను పట్టుకొని అంకుల్ అంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గ్గా మారింది. ఆయన హ్యాండమ్ లుక్ ను పొగిడే క్రమంలో ఇలా అనింది. అయితే నిరుపమ్ పరిటాలపై శ్రీముఖి వేసిన ఫన్నీ కామెంట్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్ లో కాస్తా హాట్ స్టోరీగా నిలిచింది.

ఇక నిరుపమ్ పరిటాల ఎప్పుడూ ఫిట్ గా కనిపిస్తారు. ఆయన ఫిట్ నెస్, హ్యాండమ్ లుక్ కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉంటారు. సీరియల్ కెరీయర్ ప్రారంభం నుంచి ఇంకా తన యంగ్ లుక్ ను పెంచుకుంటూ పోతున్నారు. తన అభిమానులను, బుల్లితెర ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. ఇక ప్రస్తుతం నిరుపమ్ 'కార్తీక దీపం 2' సీరియల్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు. మరోవైపు శ్రీముఖి 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోతో పాటు రీసెంట్ గా ప్రారంభమైన 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2' షోకు వ్యాఖ్యాతగా అలరిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X