చీర కట్టులో కార్తీక దీపం 2 బ్యూటీ అదరహో... రొమాంటిక్ ఫోజుల్లో గ్లామర్ ట్రీట్!

స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ మంచి రేటింగ్‌తో దూసుకెళ్తోంది. గతంలో వచ్చిన సూపర్ హిట్ సీరియల్ కార్తీక్ దీపం సీజన్ 2 వంటి ఈ ధారావాహిక కూడా మహిళా ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంటోంది. కార్తీక్, దీపలు ఈ సీరియల్‌లో కొనసాగగా.. వీరిద్దరినీ ముప్పుతిప్పలు పెట్టే మోనిత ప్లేస్‌లో ఎవరు నటిస్తున్నారు అనే చర్చ నడిచింది. ఆమె గాయత్రీ సింహాద్రి. కార్తీక్ దీపం 2 సక్సెస్‌లో ఈవిడది కూడా కీలకపాత్రే. మోనితను మించిన క్రూయెల్‌గా.. కార్తీక్‌ను సొంతం చేసుకోవడానికి ఎంతకైనా తెగించే మొండిదానిగా గాయత్రి అద్భుతంగా నటించారు.

Karthika Deepam 2 Actress Gayathri Simhadrii s Latest Saree Photoshoot Goes Viral on Social Media

ఎవరీ గాయత్రి సింహాద్రి?
విజయవాడకు చెందిన గాయత్రి.. విశాఖలో పెరిగింది. చదువు తర్వాత మోడలింగ్ వైపు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తన అందంతో ఆకట్టుకుంటూ మిస్ వైజాగ్ వంటి టైటిల్‌ను కూడా గెలుచుకుంది. 2022లో జీ తెలుగులో ప్రసారమైన త్రినయని సీరియల్‌తో తెలుగు బుల్లితెరపై తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇందులో నెగిటివ్ షేడ్స్‌లో అద్భుతంగా నటించారు గాయత్రి. త్రినయని తర్వాత పల్లకిలో పెళ్లికూతురు, అత్తారింటికి దారేది వంటి సీరియల్స్‌లో నటించారు. మ్యాడ్ అనే సినిమాలో ఓ చిన్న పాత్ర కూడా పోషించింది గాయత్రి. దీనితో పాటు సూపర్ ఫ్యామిల, జోష్ వంటి కార్యక్రమాలకు యాంకర్‌గా చేసి సత్తా చాటింది.

కార్తీక దీపం సీరియల్ తెలుగునాట ప్రభంజనం సృష్టించగా.. దీనికి సీక్వెల్‌గా కార్తీక దీపం 2 నవ వసంతం తీసుకొచ్చారు మేకర్స్. కార్తీక దీపంలో డాక్టర్ బాబుగా నిరుపమ్, వంటలక్క దీపగా ప్రేమి విశ్వనాథ్.. విలన్‌ డాక్టర్ మోనితగా శోభాశెట్టి అద్భుతంగా నటించారు. అలాంటి సీరియల్‌కి సీక్వెల్ అనగానే కార్తీక దీపంలోని అన్ని క్యారెక్టర్లు యధాతథంగా దిగిపోతాయని అభిమానులు ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. కార్తీక, దీపలు మాత్రమే కొత్త సీరియల్‌గా ఉండగా.. మొత్తం క్యాస్టింగ్, కథ కూడా పూర్తిగా మారిపోయింది.

అత్యంత కీలకమైన శోభాశెట్టి పాత్రలో విలన్‌గా గాయత్రి సింహాద్రిని తీసుకొచ్చారు. తెలుగు సీరియల్స్‌లో లేడీ విలన్లకు బ్రాండ్‌గా మారిన శోభా శెట్టి రేంజ్‌లో గాయత్రి రక్తి కట్టించగలదా అని అంతా భావించారు. అయితే సీరియల్ ప్రసారమైన తర్వాత అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. కార్తీక దీపంలో డాక్టర్ మోనితగా శోభాశెట్టి విలనిజం పండిస్తే.. కార్తీక దీపం 2లో జ్యోత్స్నగా, కార్తీక్‌కి మరదలిగా గాయత్రి సింహాద్రి ఏకంగా ప్రేక్షకులను భయపెట్టేస్తోంది. తన కన్నింగ్ క్యారెక్టర్, ఎత్తులు, పై ఎత్తులతో కార్తీక్, దీపలు ఇబ్బంది పెట్టేస్తోంది.

ఇదంతా కార్తీక దీపం సీరియల్ వరకే.. బయట మాత్రం గాయత్రి చాలా మంచి వ్యక్తి. అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే గాయత్రి సింహాద్రి తన సీరియల్స్, షూటింగ్స్, ఇతర వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలోనూ గాయత్రికి భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 109K ఫాలోవర్స్ ఉన్నారు. హీరోయిన్లను మించిన అందంతో గాయత్రి చేసే ఫోటో షూట్స్ కుర్రాళ్లను రెచ్చగొడుతుంటాయి. తాజాగా శారీలో జ్యోత్స్న చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. హీరోయిన్ లాంటి ఫిగర్‌ పెట్టుకుని సీరియల్స్ చేస్తున్నారేంటీ? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: karthika deepam 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X