‘అతనితో పెళ్లొద్దని దేవుడి సంకేతాలు... గర్భంతో ఉన్నా భర్త టార్చర్, తాళిని తెంపేసి’

బాలనటిగా కెరీర్ ప్రారంభించి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించి ప్రస్తుతం బుల్లితెరపై దూసుకెళ్తున్నారు బేబీ సీత. స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీక దీపం 2 సీరియల్‌లో సుమిత్రగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు సీత. ఇటీవల తన మతం మార్పు గురించి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారగా.. ఓ వీడియో ద్వారా అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితం, విడాకులు, రెండో పెళ్లి గురించి బేబీ సీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ట్రావెల్ అవుతూనే ఉన్నాను. నా చివరి శ్వాస వరకు నేను సినీరంగంలోనే ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నా. నా సంతోషం, సుఖం కోసం నేను ఇండస్ట్రీలోకి రాలేదు.. అనుకోకుండా జరిగింది. షూటింగ్స్ చేస్తేనే నా కుటుంబం హాయిగా ఉంటుందని అర్ధం చేసుకున్నాక ఇంకా కష్టపడుతున్నా. పెద్దవాళ్లు చేసిన తప్పుల వాళ్లు నేను అనుభవిస్తున్నా. మా అమ్మానాన్నకు విడాకులు అయ్యాయి.. మనం పెళ్లి చేసుకుంటే అలా అవ్వకూడని అనుకున్నా, కానీ నా జీవితం కూడా అలాగే అయిపోయింది. సంతోషంగా ఉంటేనే కదా పిల్లల్ని కనాలి, నా ఎక్స్ నన్ను సంతోషంగా ఉంచితేనే కదా. ఎంతసేపూ డబ్బులు డబ్బులు.. అతనిని నేను ప్రేమించలేదు, అతను నన్ను ఇష్టపడుతున్నానని చెబితే రెండేళ్లు వెయిట్ చేయమన్నా. ఎందుకంటే ఆ సమయంలో ఇల్లు కొన్నాను, ఈఎంఐ కట్టాలి. వెయిట్ చేస్తానని తలఊపిన వ్యక్తి.. తర్వాత మీ ఇంట్లోవాళ్లు మనిద్దరికీ పెళ్లి చేయరు, నీ మనసు మార్చేస్తారని రోజూ టార్చర్ చేసేవాడు. దాంతో నేను ఇంట్లోవాళ్లతో గొడవ పడేదానిని అని సీత అన్నారు.

Karthika Deepam 2 fame Baby Seetha Opens Up About Divorce Painful Marriage in Emotional Interview

అడ్డ గాడిదలా పెరిగినా నాకు మెచ్యూరిటీ రాలేదు. ఎక్కడైనా ఎవరైనా డబుల్ మీనింగ్ మాట్లాడినా నాకు అర్ధం కాదు, ఎవరైనా ఏమంటే ఏడ్చేస్తాను. అతను మిడిల్ క్లాసే.. నన్ను బాగా చూసుకుంటానని చెప్పేవాడు, అతని గురించి బ్యాడ్ టాక్ వస్తున్నా నేను నమ్మలేదు. మంచివాడైనా, చెడ్డవాడైనా ఆయన్నే పెళ్లి చేసుకుంటాను... రెండ్రోజులు కాపురం చేసినా అతనితోనే చేస్తానని చెప్పా. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా.. దాంతో మంచి మంచి సంబంధాలు వదిలేశా. మా ఇంట్లో ఇష్టం లేకుండానే చివరికి పెళ్లి వరకు వచ్చేశామని సీత గుర్తుచేసుకున్నారు.

పెళ్లి రోజు అన్ని అపశకునాలే. పవర్ కట్ కావడం, వెళ్లేటప్పుడు కార్ టైర్ పంక్చర్ కావడం జరిగాయి. తిరుపతిలో తెల్లవారుజామున 3.30 నిమిషాలకు పెళ్లి. ముందురోజు మధ్యాహ్నం వరకు షూటింగ్‌లోనే ఉన్నా. నిద్రలేకుండానే హడావుడిగా బయల్దేరాం. కారు పంక్చర్ కావడంతో రిటర్న్ అవ్వమని దేవుడు చూపించాడు. అయినప్పటికీ వినిపించుకోకుండా తిరుపతికి వెళ్లిన తర్వాత రిజిస్ట్రార్ 10.30 వరకు వెయిట్ చేశాడట. మేం అర్ధరాత్రి పూట వెళ్లాం. రూమ్‌కి వెళ్లిన తర్వాత అలసిపోవడంతో మా అమ్మకి ఫిట్స్ వచ్చేశాయి. బాత్రూమ్‌లో ట్యాప్ తిప్పితే గడ్డకట్టేంత చల్లగా వాటర్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే నాకు పెళ్లి అవసరమా? నాకెందుకు ఈ కష్టాలు అనిపించింది. అలాగే తలస్నానం చేసి ఎలాగోలా పెళ్లి చేసుకున్నాం. పెళ్లిలో ఆశీర్వదించడానికి అందరూ ముత్తయిదువలు వస్తారు. కానీ భర్త చనిపోయిన వాళ్లు, భర్తని వదిలేసిన వాళ్లు వచ్చారు. నేను సెంటిమెంట్స్ నమ్మను.. అంతా నా తలరాత, వాళ్లంతా నన్ను బ్లెస్ చేశారు. మనకి ఏం రాసుంటే అదే జరుగుతుందని సీత చెప్పారు.

పెళ్లయిన రెండో రోజే గొడవలు మొదలయ్యాయి, డివోర్స్ కూడా అయిపోయాయి. అతను ఎక్కడో ఉన్నాడు. అతను ఒకటి అనుకుంటే జరిగింది మరొకటి. మ్యారేజ్‌కు ముందే నీకు ఒక విషయం తెలిసింది.. నేను, మా ఆయన కలిసే ఇల్లు కొన్నాం.. కానీ అన్నయ్య మాత్రం ఇంటిని అమ్మ పేరు మీద రాయమని చెప్పారు. అన్నయ్య చెప్పినట్లే నేను చేశా. ఆ రోజే పెళ్లి ఇష్టం లేదని చెబితే అక్కడితో పోయేది. కానీ అది మనసులో పెట్టుకుని పగ సాధించడం మొదలుపెట్టాడు. కొండ మీద తాళి కట్టేసి సిగరెట్లు కాల్చుకుంటూ కూర్చొన్నాడని సీత గుర్తుచేసుకున్నారు.

ఏడేళ్లు అతనితో కలిసున్నా ఎలాంటి సంతోషం లేదు. నెల రోజులు అత్తారింటిలో, మూడు నెలలు పుట్టింటిలో ఉండేదానిని. నన్ను కావాలని బ్యాచిలర్ రూమ్‌లో పెట్టినా అన్నీ భరించి అక్కడే ఉన్నా. మా చనిపోయే పరిస్ధితుల్లో ఉంటే నువ్వు వెళ్లి సంతకం పెట్టించుకోమని టార్చర్ చేశాడు. అతనితో ఉన్నప్పుడు రెండు సార్లు ప్రెగ్నెంట్ అయ్యా... గర్భం దాల్చినప్పుడు ఏడిపిస్తూ ఉంటే నిలబడదు కదా, రెండు సార్లు అబార్షన్ అయ్యింది. కొట్టడం, తిట్టడం, తాళిని తెంచి నేలకేసి కొట్టడం లాంటివి చేశాడు. చిన్న ప్రాబ్లమ్‌గా ఉన్నప్పుడు సరిగా ట్రీట్‌మెంట్ చేయించకపోవడంతో అది మరింత పెద్దదైంది. రెండో భర్త మంచి వ్యక్తి.. కానీ ఫైనాన్షియల్‌గా నష్టపోయాడు, కానీ నన్ను బాగా చూసుకుంటాడని సీత ఎమోషనల్ అయ్యారు.

Read more about: karthika deepam 2 seetha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X