Nata Kumari: 14 ఏళ్లుగా ఆ బాధ గుండెల్లోనే ... కార్తీక దీపం నటి భావోద్వేగం

స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా స్టార్ మాలో ప్రసారమవుతోన్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమం ప్రేక్షకులను అలరిస్తోంది. వారం వారం సరికొత్త థీమ్‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది ఈ షో. బుల్లితెర సెలబ్రిటీల అల్లరి, ఆటాపాటా, శ్రీముఖి అందాలతో రేటింగ్‌లో ఈ షో దూసుకెళ్తోంది. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమం రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
Samantha: అక్కినేని ఫ్యామిలీకి అండగా సమంత.. డైవోర్స్‌ తర్వాత అన్ని మరిచిపోయి!
Samantha: అక్కినేని ఫ్యామిలీకి అండగా సమంత.. డైవోర్స్‌ తర్వాత అన్ని మరిచిపోయి!

తెలుగు బుల్లితెర, వెండితెరలపై నవరసాలను పలికించగల అద్భుతమైన నటీనటులు ఉన్నారు. కానీ వారికి సరైన గుర్తింపు దక్కడం లేదు. ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. తమకంటే వెనక వచ్చిన వారికి అవార్డులు, ఇతర ప్రోత్సాహాలు లభిస్తుండగా.. కొందరు ప్రతిభావంతులు మాత్రం ఎలాంటి ఆదరణ దొరకడం లేదని బాధపడుతున్నారు. ఈ కోవలోకే వస్తారు నటకుమారి. తెలుగు బుల్లితెరపై పలు ధారావాహికల్లో నటించిన ఈమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు.

Karthika Deepam 2 fame Natakumari get Emotional after Receives First Award

ప్రస్తుతం తెలుగులో కార్తీక దీపం 2, గిరిజా కళ్యాణం, ఇంటి గుట్టు, బంధం తదితర సీరియల్స్‌లో నటిస్తున్నారు. ప్రధానంగా స్టార్ మాలో ప్రసారమవుతున్న ఫేమస్ సీరియల్ కార్తీక దీపం 2లో పారిజాతం పాత్రకు నటకుమారికి మంచి గుర్తింపు దక్కింది. తన మనవరాలికే ఆస్తి దక్కాలనే ఉద్దేశంతో బిడ్డలను మార్చేసి... దానికి అడ్డొచ్చే వారిని పక్కకు తొలగిస్తూ సాగే నెగిటివ్ పాత్రలో నటకుమారి అద్భుతంగా నటించారు. సీరియస్‌గా నటిస్తూనే.. కామెడీ కూడా చేస్తూ ఆమె ప్రేక్షకులను నవ్విస్తున్నారు.

Recommended For You
డబ్బు కోసం బట్టలు విప్పను... బిగ్‌బాస్ నటి స్ట్రాంగ్ వార్నింగ్
డబ్బు కోసం బట్టలు విప్పను... బిగ్‌బాస్ నటి స్ట్రాంగ్ వార్నింగ్

ఈ సీరియల్‌లో అప్పుడప్పుడు తన నాటకంలోని అనుభవాలను బయటపెడుతుంటారు. సీరియల్స్‌తో పాటు తెలుగులో పలు ఛానెల్స్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాలలో పాల్గొంటున్నారు నటకుమారి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె.. తన సీరియల్స్, ఇతర వ్యక్తిగత విశేషాలను పంచుకుంటూ ఉంటారు. అలాగే తెలుగు సినిమాల్లోని పాటలు, డైలాగ్స్‌ను రీల్స్ చేస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నారు. తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమంలో పాల్గొన్న నటకుమారి ఎమోషనల్ అయ్యారు.

You May Also Like
Rakasa Day 7 Collections: రాకాసతో అన్న రికార్డ్‌ బ్రేక్.. సంగీత్ శోభన్ మూవీకి 7వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?
Rakasa Day 7 Collections: రాకాసతో అన్న రికార్డ్‌ బ్రేక్.. సంగీత్ శోభన్ మూవీకి 7వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?

కార్తీక దీపం 2 సీరియల్‌లో నటనకు గాను నటకుమారిని వేదిక మీద సత్కరించడంతో పాటు అవార్డ్‌ను బహుకరించారు. కార్తీక దీపం 2, బ్రహ్మముడి, గుండెనిండా గుడిగంటలు నటీనటులంతా కలిసి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి సత్కరించారు. శ్రీముఖి స్వయంగా నటకుమారి మెడలో దండ వేసి.. మీ టాలెంట్‌కు సత్కరించడంతో పాటు అవార్డ్ ఇచ్చే సమయం కూడా వచ్చేసిందని ప్రశంసించింది. దాంతో నటకుమారి భావోద్వేగంతో కంటతడి పెట్టగా.. పక్కనే ఉన్న దీపిక రంగరాజు, గాయత్రి సింహాద్రిలు ఓదార్చారు. 14 సంవత్సరాల నుంచి ఎన్నో సీరియల్స్‌లో చేసినా ఒక్క అవార్డ్ కూడా తీసుకోలేకపోయానని చాలా బాధపడ్డాను. ఆ కల స్టార్ మా పరివారం వల్లే అయ్యింది. ఇలాంటి అవార్డ్స్ చూసి చాలామంది మా పిఠాపురంలో మా ఊరి పేరు నిలబెట్టింది నటకుమారి అంటుంటే చాలా సంతోషంగా ఉందని చెబుతూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆమె ప్రతిభను అభినందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: karthika deepam 2 sreemukhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X