డాక్టర్ బాబుపై మనసుపడ్డ ఆ అమ్మాయి.. అలా మిస్ అయ్యానంటూ..
బుల్లితెరపై స్టార్‌లా దూసుకెళ్తున్నారు నిరూపమ్ పరిటాల. కార్తీక దీపం సీరియల్‌తో తెలుగునాట మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. నిరూపమ్ అంటే కన్నా.. డాక్టర్ బాబు అంటేనే జనం ఠక్కున గుర్తుపడతారంటే ఆయన క్రేజ్‌ను అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళల్లో నిరూపమ్‌కు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే ఓ అభిమాని చేసిన పనితో నిరూపమ్ షాకయ్యారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ రచయిత, నటుడు ఓంకార్ పరిటాల కుమారుడే నిరూపమ్. సినీనటుడు కావాలని ఓ సినిమా చేసినప్పటికీ అది డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో బుల్లితెరపై అవకాశాల కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. చంద్రముఖి, అత్తారింటికి దారేది, హిట్లర్ గారి పెళ్లాం తదితర సీరియల్స్‌లో నటించాడు నిరుపమ్. ఈ దశలో కార్తీక దీపం సీరియల్ ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. నాటి నుంచి ఎక్కడికెళ్లినా డాక్టర్ బాబు .. డాక్టర్ బాబు అంటూ అమ్మాయిలు వెంట పడుతుంటారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తల్లిగారు అంజనా దేవి గారు కూడా నిరుపమ్ నటనకు అభిమానే కావడం విశేషం.

తాజాగా ఆయన మాట్లాడుతూ.. అమ్మమ్మలు, అమ్మలు నా సీరియల్స్ చూస్తుండటం వల్ల పిల్లలు కూడా నన్ను ఈజీగా గుర్తుపడతారు. మరి వాళ్లింటిలో మనిషిలాగే నా మనవడు, నా కొడుకు అన్నట్లుగా మాట్లాడతారు. మనం చేసే పని కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. కొంతమంది మెసేజ్‌లు పెడుతుంటారు చూసి నవ్వుకుని వదిలేస్తాం. ఒకసారి ఎక్కడికో వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కా. అక్కడున్న ఎయిర్ హోస్టెస్ మా ఫ్యామిలీ అంతా చాలా ఇష్టపడతారు మిమ్మల్ని, మీరు దిగేటప్పుడు నాకొక సెల్ఫీ ఇచ్చి వెళ్లండని ఆ అమ్మాయి అడిగింది. కానీ దిగే హడావుడిలో ఆ అమ్మాయికి సెల్ఫీ ఇవ్వలేకపోయాను. ఆ రోజు కుకీస్ ప్యాకెట్, స్లిప్ ఇచ్చి అడిగిందని నిరుపమ్ గుర్తుచేసుకున్నారు.
చాలా ఫ్యాన్ పేజీస్ ఉన్నాయి.. వారిలో ఒకరిద్దరితోనే టచ్‌లో ఉంటాను. మగవాళ్లకి తెలియని చాలా విషయాలు, చాలా అప్‌డేట్స్ ఆడవాళ్లకి తెలుస్తాయి. ఎందుకంటే వాళ్లు రెగ్యులర్‌గా టీవీలు, షోలు ఫాలో అవుతారు. బుల్లితెరపై స్టార్స్ అని మమ్మల్ని పిలుస్తుంటారు. కానీ అవేవి శాశ్వతం కాదు.. కాసేపు ఉంటాయి అంతే. ఎక్కడ మన గురించి ఏ అప్‌డేట్స్ ఉన్నా కానీ మన గురించి ఫ్యాన్ పేజ్ వాళ్లకి ఎలా తెలుస్తాయో తెలియదు. సీరియల్స్‌కు లేట్‌గా వస్తానని నా మీద ఒక రూమర్ ఉంది. కానీ దీని వెనుక కారణం ఉంది. ఇప్పుడున్న ఆర్టిస్ట్‌లో సొంతగా డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్‌లు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈరోజు వరకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా. నాకు డబ్బింగ్ ఉంది కదా అని 9 లోపు నన్ను పంపించరు. 9 గంటల తర్వాతే నేను డబ్బింగ్ చెప్పుకోవాలి లేదంటే పొద్దున్న స్టార్ట్ అయ్యేముందు చెప్పుకోవాలి. ఉదయాన్నే వర్కవుట్ చేసుకుని.. డబ్బింగ్‌లు చెప్పుకుని షూటింగ్స్‌కి వెళ్లాలని నిరుపమ్ తెలిపారు.
సీరియల్స్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. సినిమాలెందుకు నిర్మించడం లేదని యాంకర్ అడగ్గా.. ఖర్చు వల్లే. సీరియల్‌కి అంత ఇన్వెస్ట్‌మెంట్ అవసరం లేదు. సినిమాను తీయగానే కాదు.. దాని రిలీజ్‌కి, పబ్లిసిటీకి చాలా కష్టాలు పడాలి. టీవీలో అలా ఉండదు. మన ప్రొడక్ట్ తీసి ఒక బడ్జెట్‌లో తీసిస్తే ఛానెల్ వాళ్లు టెలికాస్ట్ చేస్తారు. టీఆర్పీలు, యాడ్ రెవెన్యూల బట్టి సీరియల్ వాళ్లకు మొత్తం అర్ధమైపోతుంది. వాళ్లు ఇచ్చే బడ్జెట్‌లోనే సరిపెట్టుకోవాలి. ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఒక కొత్త సీరియల్ స్టార్ట్ చేయడానికి 80 లక్షల నుంచి కోటి రూపాయలు బడ్జెట్ అవుతుంది. అది బ్రేక్ఈవెన్ కావాలంటే రెండేళ్లు పడుతుంది. ఖర్మ కాలిపోయి రేటింగ్ రాక.. ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే క్లోజ్ చేశారంటే మీకది మైనస్సే. పల్లకిలో పెళ్లికూతురు అనే సీరియల్‌ని నేనే ప్రొడ్యూస్ చేశా.. అది మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఏ సీరియల్‌ని కూడా మనం ఆపడానికి లేదు.. ఛానెల్ వాళ్లు చెప్పేస్తారు. ఎవరు ఏమనుకున్నా ఇదంతా ఒక బిజినెస్.. మనోడు, మనతోనే ఉంటున్నాడు, పాపం కొంచెం చూద్దామని ఉండదు. బిజినెస్ లేదు.. దీని వల్ల లాస్ వస్తుందన్నప్పుడు క్లోజ్ చేసేస్తారు అని నిరుపమ్ వెల్లడించారు.
2007లో నేను అప్పుడే చెన్నై నుంచి వచ్చి చంద్రముఖి సీరియల్ చేస్తున్నా. మణికొండ ఏరియాలో అక్కడక్కడ ఇళ్లు ఉండేవి, పిచ్చి పిచ్చి రోడ్లు, తుప్పలు ఉండేవి. ఆ రోజుల్లోనే మణికొండదే నెక్ట్స్ అని చెప్పేవాళ్లు. ఇందులోనే అని నేను అడిగేవాడిని. కట్ చేస్తే రెండు మూడేళ్లలో అగ్గిపెట్టెలు మాదిరిగా అపార్ట్‌మెంట్స్ వచ్చాయి. అప్పుడు కొందామంటే మన దగ్గర డబ్బులు ఉండవు.. ఇప్పుడు కొందామంటే అందుబాటులో ఉండవు. ఒక సీరియల్ కోసం నెలకు 12 రోజులు వర్క్ చేయాలి అప్పుడే అది ప్లస్‌లో ఉంటుంది. అంతకుమించి వెళితే అది మైనస్‌లోకి వెళ్తుంది. సెట్‌లో 40 నుంచి 50 మంది ఉంటారు. కేరవాన్‌లతో పెద్దగా పనిలేదు.. పరిస్ధితి కష్టంగా ఉన్న లోకేషన్స్, టెంపుల్స్, లేడీస్‌కి డ్రెస్ ఛేంజింగ్ కోసం పెడతారు. స్టూడియోలలో మంచి మేకప్ రూమ్‌లు ఉంటాయని నిరుపమ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు బుల్లితెర ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications



