నా కొడుకుని అలా శిక్షిస్తా... కార్తీక దీపం నటి ప్రేమి విశ్వనాథ్ షాకింగ్‌గా..

శ్రీముఖి హోస్ట్‌గా స్టార్ మాలో ప్రసారమవుతున్న.. ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రేక్షకులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. వారం వారం బుల్లితెర సెలబ్రిటీలతో శ్రీముఖి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. దీనిలో భాగంగా ఈ వీక్ కార్తీక దీపం 2 టీమ్ ఈ షోలో సందడి చేసింది. నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్, గాయత్రి సింహాద్రి, నటకుమారి సహా మొత్తం కార్తీక దీపం 2 నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రేమి విశ్వనాథ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తన కొడుకుతో అనుబంధం గురించి చెబుతూ ఆమె ఎమోషనల్ అయ్యారు.

ఇంగ్లీష్ అమ్మాయిలు, ప్రేమి విశ్వనాథ్ చుట్టూ తిరుగుతుండగా కార్తీక్ బాబు కృష్ణుడిలా ఫోజు ఇస్తాడు. ఆ తర్వాత ఇంగ్లీష్ అమ్మాయిలు పాడిన పాటను గెస్ చేయమని శ్రీముఖి టాస్క్ ఇవ్వగా.. ప్రేమి విశ్వనాథ్‌కు ఏం అర్ధం కాదు. అయితే విలన్ బ్యాచ్‌లో ఉన్న పారిజాతం ఆ లైన్ అందుకుని పాడేస్తుంది. ఆ పాటకు శ్రీముఖి, అవినాష్ డ్యాన్స్ చేస్తుండగా.. మీరు కంటెస్టెంటా? యాంకరా? అని ఎక్స్‌ప్రెస్ హరి అడుగుతాడు. కార్తీక దీపం ఫ్యాన్‌ని రా నేను అంటూ శ్రీముఖి ఫైర్ అవుతుంది. మీకు బాబు గారంటే ఇష్టం లేదా? అని హరి అడగ్గా.. బాబుగారికి ఇద్దరున్నారు, ఇక నేనెక్కడ సరిపోతానని శ్రీముఖి ఫన్నీగా ఆన్సర్ ఇస్తుంది.

Karthika Deepam 2 fame Premi Viswanath became emotional upon seeing her son after a long time

ఆ తర్వాత ఒక మాస్క్‌ని ముఖానికి పెట్టుకుని తమ ముఖాన్ని పెన్సిల్‌తో దానిపై గీసే టాస్క్‌లో అందరూ నవ్విస్తారు. ముఖ్యంగా అవినాష్ గీసిన బొమ్మను చూసిన శ్రీముఖి.. ఈ ఫేసే బాగుందిరా అంటూ పంచ్ విసురుతుంది. దీప, జ్యోత్స్నలు కూడా ఈ టాస్క్ వేయగా.. మీ ముక్కు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో కొట్టుకుపోయిందా అని దీపపై సెటైర్ వేస్తాడు హరి. జ్యోత్స్న గీసిన బొమ్మ చూసిన హరి.. అసలు తప్పులేదు బాబుగారు దీప వెనకాల పడటం అంటాడు.

చివరిలో దీపక్క ముద్దుల కొడుకు మను వచ్చేశాడని శ్రీముఖి స్క్రీన్ మీద చూపించింది. కొడుకును చూడగానే ప్రేమి విశ్వనాథ్ షాకైంది. స్టార్ మా ప్రేక్షకులు అందరికీ నమస్కారం అని మను తెలుగులో చెప్పడంతో అంతా చప్పట్లు కొడతారు. ఈ క్రమంలో దీప సీక్రెట్స్ అన్నీ మను నుంచి రాబట్టేందుకు ప్రయత్నిస్తుంది శ్రీముఖి. మీ మమ్మీకి ఫోన్ పిచ్చి ఉందా? లేదా? అని అడగ్గా లేదని బోటన వేలు కింద పెట్టి చూపిస్తాడు మను. మా అమ్మ అస్సలు ఫోన్ వాడదు, కనీసం నేను చేసినా లిఫ్ట్ చేయదు అంటాడు.

నా కంటే తనకు జిమ్‌లో ఉండటం ఎక్కువ ఇష్టం.. ఎంతసేపు వర్కవుట్స్ చేస్తే నీకు ఇబ్బందిగా అనిపించడం లేదా అని అంటే ఎక్కువగా లేట్ నైట్ వర్కౌట్లు చేస్తాడు. ఎందుకురా అలా అని అడిగితే అప్పుడు అమ్మాయిలు ఎక్కువగా ఉంటారు. వారికి ట్రైనింగ్ ఇస్తాను అని చెబుతాడని ప్రేమి విశ్వనాథ్ తెలిపారు. మీ మమ్మీ మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టిందా అని శ్రీముఖి అడగ్గా.. చైర్, చీపురుకట్ట, చెప్పులు ఆ టైంలో ఏది దొరికితే దానితో కొట్టేస్తుందని మను తెలిపాడు. చివరిలో ఐ మిస్ యూ అని ప్రేమి విశ్వనాథ్ చెప్పగా.. ఐ మిస్ యూ టూ, అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టమని మను చెప్పడంతో ప్రేమి విశ్వనాథ్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కార్తీక దీపం 2 చేసిన సందడి చూడాలంటే ఈ ఆదివారం ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రసారమయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X