Premi Viswanath: అదీ వంటలక్క క్రేజ్.. కార్తీక దీపం 2కి ప్రేమి విశ్వనాథ్‌కి పారితోషికం ఎంతంటే?

తెలుగు బుల్లితెరపై సంచలనం కార్తీక దీపం సీరియల్. భారీ టీఆర్పీలతో స్టార్ హీరోల సినిమాలకే పోటీ ఇచ్చి జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది కార్తీక దీపం. ఈ సీరియల్ ఇంతపెద్ద హిట్ కావడానికి ముగ్గురు ఆర్టిస్టులు ప్రధాన కారణం ఒకరు డాక్టర్‌బాబు, రెండు వంటలక్క, మూడు డాక్టర్ మోనిత. భార్య, ప్రియురాలి మధ్యలో నలిగిపోయే భర్తగా నిరుపమ్.. డాక్టర్ బాబుని దక్కించుకోవాలనే ప్రియురాలిగా శోభాశెట్టి, భర్త వేసిన నిందను భరిస్తూనే ఆయనను కంటికి రెప్పలా కాపాడుకునే పాత్రలో ప్రేమి విశ్వనాథ్ అద్భుతంగా నటించారు. వీరిలో వంటలక్క పాత్ర డీ గ్లామర్ రోల్‌లో పోషించి ఆకట్టుకున్నారు ప్రేమి విశ్వనాథ్. ఆమె రెమ్యునరేషన్ ఎంత? ఒక్క ఎపిసోడ్‌కు ప్రేమి విశ్వనాథ్ ఎంత పారితోషికం తీసుకుంటారు? అనేది పరిశీలిస్తే..

2017లో ప్రారంభమైన ఈ సీరియల్... 2023 వరకు ఏకధాటిగా దాదాపు 1500కు పైగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన తెలుగు ధారావాహికగా నిలిచిపోయింది. ఈ సీరియల్ ముగిసి నాలుగేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ దీని గురించి డిస్కషన్ నడుస్తూనే ఉంది. ఇక ప్రేమి విశ్వనాథ్ అయితే తెలుగు ప్రేక్షకులకు ఇంట్లో మనిషిగా మారిపోయారు. హీరోయిన్లను మించిన క్రేజ్‌తో.. ప్రతి తెలుగు కుటుంబంలోనూ అభిమానులను సంపాదించుకున్నారు ప్రేమి విశ్వనాథ్.

Karthika Deepam 2 Fame Premi Viswanath Remuneration How Much Does Vantalakka Earn Per Episode

కేరళలోని ఎడపల్లి ఎర్నాకులంలో జన్మించారు ప్రేమి విశ్వనాథ్. 2014లో కారుతముతు సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టారు ఈ ముద్దుగుమ్మ. అనంతరం కాయంకులం కొచాన్నియుడే మకన్ సీరియల్స్‌లో నటించారు. ఈ క్రమంలోనే కార్తీక దీపం సీరియల్‌లో వంటలక్కగా నటించే అవకాశం రావడంతో చలో హైదరాబాద్ అనేశారు. దీప పాత్ర ద్వారా ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కార్తీక దీపం సీరియల్‌కు, ఆ జోడీకి ఉన్న ఆదరణ దృష్ట్యా... కార్తీక్ దీపం సీజన్ 2ను తెరకెక్కించారు. తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన చెల్లమ్మ సీరియల్‌కు రీమేక్‌గా దీనిని రూపొందించారు. పాత కార్తీక దీపం సీరియల్‌లో కేవలం డాక్టర్ బాబు, వంటలక్క మాత్రమే ఉండగా.. మిగిలిన వారంతా కొత్తవారే. అయినప్పటికీ వీరిద్దరూ సీరియల్‌ను ముందుకు నడిపిస్తున్నారు. కార్తీక దీపం 2 కూడా మంచి టీఆర్పీలతో ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంటోంది.

ఇక ప్రేమి విశ్వనాథ్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. డాక్టర్ టీఎస్ వినీత్ భట్‌తో ఆమెకు పెళ్లయ్యింది. ఈ దంపతులకు మనుజిత్ అనే కుమారుడు ఉన్నాడు. ఆరడుగుల హైట్, సిక్స్ ప్యాక్‌ బాడీతో హీరోలా ఉంటాడు ఈ కుర్రాడు. దాంతో ప్రేమికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? అంటూ జనం ఆశ్చర్యపోతున్నారు. మీడియాకు, పబ్లిసిటీ దూరంగా ఉండే ప్రేమి విశ్వనాథ్.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. తన సీరియల్స్, షూటింగ్స్, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ప్రేమి విశ్వనాథ్ తన క్రేజ్, ఫేమ్ దృష్ట్యా బాగానే పారితోషికం తీసుకుంటున్నారని బుల్లితెర వర్గాల టాక్. గతంలో కార్తీక దీపం సీరియల్‌కి గాను ఒక్క ఎపిసోడ్‌కి 25 వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు వంటలక్క. ప్రస్తుతం కార్తీక దీపం 2లో నటిస్తున్నందుకు ప్రేమి విశ్వనాథ్‌కు భారీ పారితోషికం లభిస్తోందట. గతంతో పోలిస్తే తన శాలరీ ఆమె డబుల్ చేశారట... అంటే ఒక్కో ఎపిసోడ్‌కు 50 వేల రూపాయలు తీసుకుంటోందట. నెలకు 20 నుంచి 25 రోజుల వరకు షూటింగ్ ఉంటుంది. అంటే ఈ లెక్కన ప్రేమి విశ్వనాథ్‌ నెలకు 10 లక్షల రూపాయల నుంచి 12 లక్షల రూపాయల వరకు పారితోషికం కింద అందుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ వంటలక్క రెమ్యునరేషన్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X