‘ఆ నాలుగేళ్లు నరకం చూశా... అలా సీతాలక్ష్మీ నుంచి యాస్మిన్‌గా మారా’
స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీక దీపం సీరియల్‌లో హీరోకి మేనత్తగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సీత. అయితే ఈమె బేబీ సీతగా చిన్నప్పుడే బాలనటిగా దక్షిణాదిలో ఫేమస్ అయ్యారు. పెద్దయిన తర్వాత హీరోలకు చెల్లెలిగా, ఇతర సహాయ పాత్రలలో నటిస్తూ వచ్చారు సీత. అనంతరం బుల్లితెరపై అడుగుపెట్టి తెలుగు, తమిళ భాషలలో పలు సీరియల్స్‌లో నటించారు. గత కొంతకాలంగా సీత గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఆమె మాతం మారారని, తన పేరుని కూడా మార్చుకున్నారన్నది ఆ వార్త. దీనిపై సీత క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
నా ఫాలోవర్స్‌లో కొంతమందికి నా గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎప్పుడు చూసినా కామెంట్స్‌లో అడుగుతూనే ఉన్నారు. మనం వన్ వర్డ్ ఆన్సర్‌లా పెడతాం. అది చూసేసి కొందరు మంచిగా చెబితే, మరికొందరు తప్పుగా కూడా చెబుతున్నారు. అది నాకు కష్టంగా ఉంది. కొంతమందికి తెలియదు.. సీతా లక్ష్మీ అనే పేరు ఉంది కదా బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది కదా? ఎందుకు బొట్టు పెట్టుకోవడం లేదని అడుగుతారు. నేను బుర్ఖా వేసుకుని బయటికి వెళ్తే.. కావాలని వేసుకుంటున్నారా? నటిస్తున్నారా? చాలామంది అడుగుతున్నారు. మా అమ్మనాన్న పెట్టినపేరు సీతాలక్ష్మీ. చిన్నప్పుడే బేబీ ఆర్టిస్ట్‌గా చేసేటప్పుడు బేబీ సీతా అని అనేవాళ్లు. బ్యాంక్ డిటెయిల్స్, ఆధార్ కార్డ్ అన్ని కూడా సీతా లక్ష్మీ అనే ఉంటాయి. జీవితంలో అందరికీ కొంచెం మంచి చెడు జరుగుతూనే ఉంటాయి. నా జీవితంలో ఒక బ్యాడ్ టైం వచ్చింది.. చాలా ఇబ్బందిపడ్డా. ఆ విషయం నుంచి నేను బయటకు రావడానికి 4, 5 ఏళ్లు యాక్టింగ్‌కు దూరమయ్యానని సీత ఆవేదన వ్యక్తం చేశారు.

నాకు విడాకులు అయ్యాయని ఎంతమందికి తెలుసో లేదో తెలియదు. ఆ ఇష్యూ నుంచి నేను బయటకు రావడానికి చాలా టైం పట్టింది. విడాకులు అనేది అస్సలు ఊహించలేనిది. అయినా కూడా విధి రాత అనేది మార్చలేం.. కదా. 2012 వరకు యంగ్ క్యారెక్టర్స్ చేశాను, ఆ తర్వాత 5 ఏళ్లు నేను యాక్ట్ చేయలేదు. షూటింగ్‌కు వస్తే అందరూ అడుగుతారు, ఆ టైంలో మనం బాధపడతాం, అందుకే అమ్మవాళ్ల ఇంట్లోనే ఉండిపోయా. అప్పుడే మా స్కూల్ ఫ్రెండ్ కలిసి మనం పెళ్లి చేసుకుందాం అని అడిగాడు. మనకి ఒక తోడు ఉండాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో ఒప్పుకోలేదు.. కానీ నా భర్త కుటుంబం ఒప్పుకుంది. ఆయన పేరు అబ్ధుల్ ఖాదర్.. యాస్మిన్ అని పిలుస్తారు. నాతో పాటే చదువుకున్నాడు, నా గురించి అన్ని విషయాలు తెలుసు. నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. నేను కూడా డిసైడ్ అయ్యాను. అప్పుడు పెళ్లి చేసుకున్నాను.. ఒకే క్యాస్ట్‌లో, మతంలో పెళ్లి చేసుకోవాలంటేనే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే కొన్ని పరిస్ధితుల్లో మతం మారాల్సి వచ్చింది. మనకి సపోర్ట్ కావాలి.. మా ఇంట్లో సపోర్ట్ లేదు, మా అత్తగారింట్లో సపోర్ట్ కావాలంటే తప్పలేదని సీత చెప్పారు.
మా అత్తగారు నాకు యాస్మిన్ అని పేరు పెట్టారు.. సీత అని పిలవరు. యాస్మిన్ అని పేరు మార్చుకుంటే ఇండస్ట్రీలో కుదరదు.. మా అత్తగారింటికి వ్యతిరేకంగా ఏం చేయను. నన్ను ఇలాగే ఉండు.. అలాగే ఉండమని కూడా ఎవరు ఫోర్స్ చేయలేరు. షూటింగ్స్‌కి వచ్చినప్పుడు మాత్రం ఆ పాత్రకు తగ్గట్లుగానే నడుచుకుంటా. ఒక టైంలో బొట్టు పెట్టుకుని ఉంటాను.. ఒక సమయంలో స్టిక్కర్ పెట్టుకుని ఉంటా. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు లాంటివి నాకు లేవు. క్యాస్ట్, రీలిజయన్ ఫీలింగ్ లేదు.. మనమంతా ఇండియన్స్ అని సీత తేల్చిచెప్పారు.
జీవితంలో కొన్ని విషయాలు మనం అనుకున్నట్లుగా జరగవు, నేను కూడా ఎన్నో ఆశపడ్డాను. విడాకులు అవుతాయని కలలో కూడా ఊహించుకోలేదు. మా ఆయనతో చాలా బాగుంటానని మా అమ్మతో చెప్పాను, కానీ చివరికి ఏమైంది? ఇలా సెకండ్ మ్యారేజ్ కూడా అవుతుందని అనుకోలేదు. మనం పుట్టినప్పుడే దేవుడే ఫిక్స్ చేసేశాడు.. అవన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతూనే ఉంటాయి. 3 ఏళ్ల చిన్నప్పుడు నేను అనుకుని సినిమాల్లోకి వెళ్లానా? మా కుటుంబ పరిస్ధితులతో వెళ్లాల్సి వచ్చింది. నాకు అందరూ దేవుళ్లు ఇష్టమే.. మా అత్తగారింటి సంతోషం కోసమే ఇదంతా. అల్లాకి మొక్కుతాను, నమాజ్ చేస్తాను. కష్టపడతాను, నిజాయితీగా ఉంటాను.. ఎవరికీ చెడు చేయలేదని సీత ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications