అమ్మా! నిన్ను మిస్ అవుతున్నా.. కొడుకు మాటలకు వంటలక్క కంటతడి

ప్రస్తుత కాలంలో సినీతారలకే కాదు.. బుల్లితెర నటులకు కూడా ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగునాట సీరియల్ స్టార్స్‌ను కూడా ప్రజలు నెత్తిన పెట్టుకుంటున్నారు. స్టార్ మాలో ప్రసారమైన కార్తీక దీపం సీరియల్‌లో దీపగా నటించిన మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్ అలియాస్ దీపను తెలుగు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ప్రేమి విశ్వనాథ్ అనే కంటే దీపగానే ఆమెను జనం టక్కున గుర్తుపడతారు. తన నటనతో అంతలా అభిమానం సంపాదించారు ప్రేమి విశ్వనాథ్. ఈ కారణంగా ఆమె గురించి తెలుసుకోవడానికి తెలుగు ప్రజలు ఆసక్తి చూపిస్తారు.

కాగా.. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. శ్రీముఖి హోస్ట్‌గా బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు ఈ స్టేజ్‌పై సందడి చేస్తున్నారు. వారం వారం ప్రత్యేకమైన థీమ్‌తో సెలబ్రిటీలను ఆడిస్తూ అలరిస్తారు శ్రీముఖి. తాజాగా ఈ వారం కార్తీక దీపం 2 సీరియల్ 700 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. తాజా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి కార్తీక దీపం నటీనటులు నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్, గాయత్రి సింహాద్రితో పాటు శివన్నారాయణ, పారు, కాంచన తదితరులు హాజరై సందడి చేశారు.

Karthika Deepam 2 Premi Vishwanath Gets Emotional Seeing Son Manu

పట్టుచీరలో కళ్లజోడు పెట్టుకుని చుట్టూ గన్‌మెన్లతో ప్రేమి విశ్వనాథ్ రాయల్‌గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ డ్యాన్స్ చేయగా.. గాయత్రి సింహాద్రి సోలోగా మాస్ సాంగ్‌కి డ్యాన్స్ చేసింది. వీరందరికీ శ్రీముఖి తనదైన శైలిలో గేమ్స్ పెట్టి ఫన్ క్రియేట్ చేసింది. అయితే ప్రోమో చివరిలో దీపక్క ముద్దుల కొడుకు మను‌ని స్క్రీన్ మీద చూపించింది శ్రీముఖి. కొడుకుని చూడగానే ఐ మిస్ యూ అంటూ ప్రేమి విశ్వనాథ్ ఎమోషనల్ అవ్వగా.. నేను కూడా మిస్ అవుతున్నానని మనోజ్ అన్నాడు. అమ్మా నువ్వుంటే నాకు చాలా ఇష్టమని మను తెలుగులో చెప్పడంతో దీప కంటతడి పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా... కార్తీక దీపం 2 టీమ్ చేసిన సందడి తెలియాలంటే ఈ ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.

కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్ 2014లో మలయాళ సీరియల్ కారుతముతు సీరియల్‌లో తొలిసారిగా నటించారు. ఆ వెంటనే కాయంకులం కొచాన్నియుడే మకన్ సీరియల్‌ల ప్రేమికి అవకాశం వచ్చింది. మలయాళ చిత్ర పరిశ్రమలో తనను తాను ప్రూవ్ చేసుకున్న ఆమెకు తెలుగు బుల్లితెర నుంచి ఆహ్వానం అందింది. అదే కార్తీక దీపం. స్టార్ మాలో ప్రసారమైన ఈ ధారావాహికలో డీ గ్లామర్ రోల్‌లో ఇల్లాలి పాత్రలో అద్భుతంగా నటించారు ప్రేమి విశ్వనాథ్. భర్తకు దూరమై తిరిగి ఆయనతో ఒక్కటయ్యే దీప అనే క్యారెక్టర్ తెలుగు బుల్లితెరపై ప్రభంజనం సృష్టించి తెలుగు ప్రజల అభిమానాన్ని పొందారు ప్రేమి విశ్వనాథ్.

ప్రేమి విశ్వనాథ్‌కు టీఎస్ వినీత్ భట్‌తో పెళ్లయ్యింది. ఈ దంపతులకు మనుజిత్ అనే కొడుకు ఉన్నాడు. ఆరడుగుల హైట్‌తో, కండలు తిరిగిన దేహంతో హీరోలా ఉన్న మనుజిత్ ఫోటోలను దీప ఆ మధ్య షేర్ చేయడంతో .. మా వంటలక్కకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని అభిమానులు ఆశ్చర్యపోయారు. తల్లీకొడుకులు తరచుగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ సందడి చేస్తుంటారు. సీరియల్స్, షూటింగ్ కారణంగా భర్తకు, కొడుకుకు దూరంగా ఉండాల్సి వస్తోందని ప్రేమి విశ్వనాథ్ పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చాలా కాలం తర్వాత కొడుకుని చూడటంతో వంటలక్క కన్నీటి పర్యంతమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X