Karthika Deepam August 10th episode: ఇంటి పరువు తీశావు..దీపపై పారిజాతం ఫైర్
రేపు తీర్పు ఏమి వస్తుందో అని దీప, జ్యోత్స్న, కార్తీక్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఉంటారు. దీప కూతురు ఎక్కడ దూరమైపోతుందో అని కూతుర్ని పట్టుకొని ఏడుస్తూ పడుకుంటుంది. మరోవైపు కోర్టులో ఒంటరిగా ఉన్న దీప దగ్గరికి వచ్చి ఆమెని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు నరసింహ. తల్లి బిడ్డకి పాలు తాగిస్తున్నా తప్పుగా చూసే నీలాంటి వాడితో నాకు మాటలు ఏంటి అంటుంది దీప.
నా మొగుడ్ని ఎంత మాట అన్నావు అని కోప్పడుతుంది శోభ. ఇది మనల్ని రెచ్చగొట్టి ఏదో ఒకటి చేస్తే మళ్లీ వాయిదా కోసం ప్రయత్నిస్తుంది దీంతో మనకేంటి అని భార్యని వారించి తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతాడు నర్సింహ. అప్పుడే పారిజాతం, జ్యోత్స్న దీప దగ్గరికి వస్తారు. ఇవన్నీ ముందే ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు చూడు విషయం కోర్టు వరకు వచ్చింది అని వెటకారంగా మాట్లాడుతుంది పారిజాతం. అప్పుడు మీలాంటి వాళ్ళు ఆనందించే పరిస్థితి రాదు కదమ్మ అని జవాబు ఇస్తుంది దీప.

నిన్ను చూసి ఆనంద పడటానికి వచ్చామనుకుంటున్నావా అంటుంది జ్యోత్స్న. నేనంటే పెద్దగా చదువుకోలేదు, నువ్వు బాగా చదువుకున్నావు కదా అవతల వాళ్ళు చెప్పేది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలి కదా అంటుంది దీప. నీ గురించి దీనికి చెడ్డగా చెప్తున్నాను అని నీ అభిప్రాయం, కానీ నీ గురించి నా అభిప్రాయం ఏమిటో తెలుసా అంటూ మా ఇంటి పరువు తీసేశావు అని దీప మీద కోప్పడుతుంది పారిజాతం.


Click it and Unblock the Notifications











