Karthika Deepam July 10th episode: నా కూతురికి నీవు తండ్రివా? కార్తీక్‌ను నిలదీసిన దీప
తను ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి సుమిత్ర వాళ్లకి చెప్పకుండా బయటికి వచ్చేస్తుంది దీప. జ్యోత్స్న దీప ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కానీ ఎక్కడికి వెళ్లిందో తెలియదు అని చెప్పడంతో కంగారు పడతారు సుమిత్ర వాళ్ళు. బయట వాళ్ల సంగతి కాదు ముందు మనవరాలి సంగతి చూడండి అని పారిజాతం అనడంతో ముహూర్తాలు పెట్టించుకు రండని కాంచన ఇంటికి కొడుకుని కోడల్ని పంపిస్తాడు శివ నారాయణ.ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 10వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 93వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
పొలమారిపోయి పాలు కింద ఒంపేసిన శౌర్య మనల్ని ఎవరైనా తలుచుకుంటేనే పొలమారతాం అంట కదా నన్ను కార్తీక్ తలుచుకుని ఉంటాడా లేదంటే నాన్న తలుచుకుని ఉంటాడంటావా అని తల్లిని అడుగుతుంది. పాలు క్లీన్ చేస్తున్న దీప ఎవరో ఒకరు తలుచుకొని ఉంటారులే అంటూ క్లాత్ క్లీన్ చేయడానికి బయటకు వస్తుంది. శౌర్య మాటలు వింటుంటే హాస్పిటల్ లో మాటలు వినేసిందేమో అనిపిస్తుంది అనుకుంటుంది. ఆమె ఆలోచనలో ఉండగా అటుగా వెళుతున్న ఒక వ్యక్తి దీపని చూసి టెంప్ట్ అవుతాడు. మూర్తి గారి ఇంట్లో దిగినావిడ ఈవిడే అనుకుంటాను, భర్త లేడని అన్నారు ఆ లోటు మనం తీరుద్దాం అనుకుంటూ దీప ని చూసి వెకిలిగా నవ్వుతాడు.

దీప కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది.మరోవైపు సుమిత్ర దంపతులు కాంచన ఇంటికి వస్తారు. దీప గురించి మాట్లాడుతూ బాధపడుతుంది సుమిత్ర. కార్తీక్ వెతుకుతున్నాడు కదా వదినా తనని ఎలాగైనా తీసుకువస్తాడు, ఒకవేళ తనకి ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే నువ్వు ఇవ్వాలనుకున్నది ఏదైనా ఇచ్చి అప్పుడు పంపించేద్దాం అంటుంది కాంచన. తర్వాత దశరథ్ పెళ్లి విషయం ప్రస్తావిస్తాడు.
కార్తీక్ ని అడిగితే వాయిదాలు వేస్తూనే ఉంటాడు అందుకే మీ బావగారు ముహూర్తాలు పెట్టించేయమని చెప్పారు అన్నయ్య అంటుంది కాంచన. మరెందుకు ఆలస్యం మామ గారితో చెప్పి ముహూర్తాలు పెట్టించి మీకు కబురు పెడతాం అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు సుమిత్ర దంపతులు. మరోవైపు కార్తీక్ దీప గురించి వెతుకుతూ ఉంటాడు అదే సమయంలో జ్యోత్స్న, పారిజాతం కూడా దీపని వెతుకుతూ ఉంటారు. దారిలో జ్యోత్స్న కి కార్తీక్ కనిపిస్తాడు. ఆ విషయం పారిజాతానికి చెప్తుంది జ్యోత్స్న.
తనని ఫాలో అవ్వు, దీప ఎక్కడ ఉందో తెలుస్తుంది అంటుంది పారిజాతం. సరే అంటూ కార్తీక్ ని ఫాలో అవుతుంది జ్యోత్స్న. ఆ విషయం కార్తీక్ గ్రహిస్తాడు తను ఎందుకు నన్ను ఫాలో అవుతుంది అనుకుంటూ కారు ఒక దగ్గర ఆపి నాతో ఏమైనా పని ఉందా నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అని జ్యోత్స్న ని అడుగుతాడు. నిన్ను ఫాలో అయితే దీప దొరుకుతుందని అంటుంది పారిజాతం. ఆమెని కోప్పడతాడు కార్తీక్.
మన దారులు ఎప్పటికీ కలవవు, నా వెంటపడింది చాలు నన్ను ముందుకు వెళ్లనీ,నువ్వు వేరే దారిలో వెళ్లి వెతుకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. బావ డబల్ మీనింగ్ లో మాట్లాడుతున్నాడు ఇంకా నేను చిన్నపిల్లని అనుకుంటున్నాడు ఈ చిన్న పిల్ల ఆడే ఆట ఏమిటో బావ కి చూపిస్తాను అని కోపంగా ఉంటుంది జ్యోత్స్న. మరోవైపు కిరణా సరుకుల కోసం ఒక షాప్ కి వస్తుంది దీప. షాప్ లో ఉన్న వ్యక్తి ఇందాక దీపని చూసి టెంప్ట్ అయిన వ్యక్తి.
అతను దీపతో అసహ్యంగా మాట్లాడటంతో అతని చెంప పగలగొట్టి బయటికి వచ్చేస్తుంది దీప. దీప కోపానికి భయపడిపోతాడు షాపువాడు. మరోవైపు కాంచన చెప్పిన విషయం తండ్రికి చెప్తాడు దశరథ్. రెండు రోజుల్లో ముహూర్తం పెట్టి చేద్దాం అంటాడు శివ నారాయణ. ఆ మాటలకి ఆనందపడుతుంది పారిజాతం. ఈ ఆనంద సమయంలో దీప ఉంటే బాగుండు అంటుంది. ఆ మాటలకి షాక్ అవుతాడు శివ నారాయణ.
తనని చూస్తేనే మండిపడిపోయే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అంటాడు. కొన్నిసార్లు మనుషులు దూరమైన తర్వాతే విలువ తెలుస్తుంది అంటుంది పారిజాతం. దీపని తలుచుకొని బాధపడుతున్న సుమిత్ర దగ్గరికి వెళ్లి జ్యోత్స్న తీయని మాటలు చెప్పి ఓదారుస్తుంది. నటనలో నన్నే మించి పోయావు అనుకుంటుంది పారిజాతం. మరోవైపు దీపని వెతుకుతున్న కార్తీక్ కి దీప దొరుకుతుంది. ఆమె దగ్గరికి వెళ్లి మీకోసం వెతుకుతున్నాను అంటాడు కార్తీక్.
ఎందుకు బాబు వెతకడం,నేను కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను, అయినవాళ్లు కాకపోయినా నన్ను చేరదీసిన వాళ్ళు నా వాళ్ళు అనుకున్నాను వాళ్లని కూడా నేను దూరం చేసుకునేలా చేశారు అని కార్తీక్ పై కోప్పడుతుంది దీప. నేను తప్పు చేశాను అని అనుకోవడం లేదు,ఆ పరిస్థితులలో అలా చేయటం కరెక్ట్ అనిపించింది, రౌడీని కాపాడటానికి నాకు అంతకు మించిన దారి కనిపించలేదు అంటూ దీపకి ఎక్స్ప్లనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు కార్తీక్ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











