Karthika Deepam June 10th episode: కార్తిక్ కి కోలుకోలేని షాకిచ్చిన పారిజాతం.. బావని కాలర్ పట్టుకుని నిలదీసిన
పాప కనిపించకపోవటానికి కారణం నర్సింహా అని తెలుసుకొని అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది దీప. శౌర్య కి పిజ్జా తినిపించిన కార్తీక్ తో పాపకి కొత్త కొత్త రుచులు అలవాటు చేయవద్దు అని చెప్తుంది దీప. కార్తీక్ ప్రవర్తనని కాంచన తప్పు పడుతుంది, అర్థం చేసుకోమని తల్లికి నచ్చ చెప్తాడు కార్తీక్. పుట్టినరోజు సందర్భంగా విషయం చెప్పకుండా భర్త దగ్గర కోరిక తీర్చమని మాట తీసుకుంటుంది పారిజాతం.ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 10 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 67వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
కార్తీక్ ని తన పక్కకి రమ్మంటుంది పారిజాతం. నువ్వు అడగాలనుకునే కోరిక వాళ్ళిద్దరి గురించా.. ఇంకా నీ గురించేమో అనుకున్నాను అంటాడు శివ నారాయణ. నాకు ఈ పెళ్లంటే ఇష్టం లేదని చెప్తుందేమో అని అనుకుంటాడు కార్తీక్. పారిజాతం మాట్లాడుతూ పుట్టినప్పుడే కోడల్ని చేసుకుంటానని దశరథ్ కాంచనకి మాట ఇచ్చాడు కానీ ఇప్పటివరకు మీరు ఆ ప్రయత్నాలు ఏమీ చేయటం లేదు.

అసలు మీ మనసులో పెళ్లి చేయాలనే ఉద్దేశం ఉందా అని అడుగుతుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి అని వాళ్ళు పుట్టినప్పుడే నిర్ణయించుకున్నాము, పైగా వాళ్ళిద్దరిలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే వాళ్ళు ముందే చెప్పే వాళ్ళు కదా అంటాడు శివ నారాయణ.అందుకే ఇప్పుడు నా కోరిక తీర్చండి, కార్తీక్ జ్యోత్స్న ని పెళ్లి చేసుకుంటానని చేతిలో చేయి వేసి ప్రమాణం చేయమనండి అంటుంది పారిజాతం.
ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతాడు కార్తీక్. పారిజాతం వైపు కోపంగా చూస్తాడు. కానీ అవేమీ పట్టించుకోదు పారిజాతం. ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంటుంది సుమిత్ర. అవసరమే అంటుంది పారిజాతం. ఇదంతా నాకోసమే చేసావా గ్రానీ థాంక్యూ, లవ్ యు అని మనసులోనే ఆనంద పడిపోతుంది జ్యోత్స్న. నేను రెడీ అంటూ చేయి చాపుతుంది.

కానీ కార్తీక్ ప్రమాణం చేయకపోవడంతో కోరిక నాదే కాబట్టి నేనే మనవడితో ప్రమాణం చేయిస్తాను అని బలవంతంగా కార్తీక్ తో ప్రమాణం చేయిస్తుంది పారిజాతం. ఈయనేమిటి పెళ్లంటే ఇష్టం లేనట్లు ప్రమాణం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, మొహంలో అసలు చిరునవ్వే లేదు అని మనసులో అనుమాన పడుతుంది దీప. ఆ తర్వాత కేక్ కటింగ్ అయిపోతుంది. కూతుర్ని తీసుకొని బయటికి వచ్చిన దీప తన కేకు కూడా కూతురికే ఇచ్చి నువ్వు జాగ్రత్తగా ఉండు నేను టిఫిన్ సెంటర్ దగ్గర పని చేసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది.
మరోవైపు మేడ మీదకి వచ్చేసిన కార్తీక్ దగ్గరికి వచ్చిన జ్యోత్స్న అందరూ కిందన ఉంటే నువ్వు ఎందుకు బావ పైకి వచ్చేసావు నిజం చెప్పు నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, ప్రమాణం చేయడానికి ఎందుకు అంత ఇబ్బంది పడ్డావు అని అతని కాలర్ పట్టుకుని నిలదీస్తుంది. విషయం ఇంతవరకు వచ్చిన తర్వాత నిజం చెప్పేయటమే మంచిది అనుకుంటాడు కార్తీక్. అతను మాట్లాడుతూ నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తూ వెనక్కి తిరిగేసరికి అక్కడ జ్యోత్స్న కాకుండా పారిజాతం ఉంటుంది.

షాక్ అయిన కార్తీక్ జ్యోత్స్న ఏది అని అడుగుతాడు. నువ్వు ఇలాంటిదే ఏదో చేస్తావని తనని పంపించేశాను అంటుంది పారిజాతం. ఎందుకు అలా చేశావు, నాకు ఈ పెళ్లంటే ఇష్టం లేదని చెప్పాను కదా, జ్యోత్స్న పుట్టినరోజు నాడే పువ్వు నా చేతిలో పెట్టినప్పుడు అర్థం చేసుకోవాల్సింది నువ్వు చేసేది ఒకటి చెప్పేది ఒకటి అని అంటూ పారిజాతంపై కోప్పడతాడు. నువ్వు నాకు నిజం చెప్పినప్పుడే నీకు నచ్చ చెప్పాలనుకున్నాను.

కానీ నచ్చ చెప్తే వినే పరిస్థితులలో లేవని అర్థమైంది, ఎందుకంటే అప్పటికే నీ మనసులో మరొక మనిషి వుంది అంటుంది పారిజాతం. తప్పుగా మాట్లాడుతున్నావు పారు అంటూ ఆమె పై ఫైర్ అవుతాడు కార్తీక్. నాకు ఏమీ తెలియదు అనుకుంటున్నావా, దీప ఇక్కడికి రాకముందే నీకు పరిచయం అని అందరితో ఎందుకు చెప్పలేదు, దీపకి చెప్పకుండా ఆమె భర్త మీద ఎందుకు కేసు పెట్టావు అని నిలదీస్తుంది పారిజాతం. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











