Karthika Deepam July 11th episode: కార్తీక్ కోసం కన్నీరు పెట్టుకుంటున్న శౌర్య.. భర్త చెంప పగలగొట్టిన దీప!

ముందు మనవరాలి సంగతి చూడండి అని పారిజాతం అనడంతో ముహూర్తాలు పెట్టించుకు రండని కాంచన ఇంటికి కొడుకుని కోడల్ని పంపిస్తాడు శివ నారాయణ. మరోవైపు కార్తీక్ ని ఫాలో అవుతూ ఉంటారు జ్యోత్స్న,పారిజాతం. నా వెంట పడొద్దని వాళ్ళని హెచ్చరిస్తాడు కార్తీక్ ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 11వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 94వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

శౌర్య కోసమే నేను అలా మాట్లాడాను లేదంటే ఆ నర్సింహ శౌర్యని తీసుకుని వెళ్ళిపోయేవాడు అంటాడు. మీరు శౌర్య గురించే ఆలోచించారు కానీ నా గురించి ఎందుకు ఆలోచించ లేకపోయారు. మీరు ఆ బిడ్డకు తండ్రి అంటే నేను మీకు ఏమవుతాను, ఎవరు ఏం ప్రశ్నిస్తారో, ఏమి సమాధానం చెప్పాలో తెలియక పారిపోయి వచ్చాను అంటుంది దీప. మీరు నాతో రండి ఇంట్లో వాళ్ళు మీకోసం చూస్తున్నారు, వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తాను అంటాడు కార్తీక్.

Karthika Deepam 2 Serial 11th July 2024 Episode Number 93 Here is full story

అప్పుడు మన ఇద్దరినీ కలిపి అసహ్యించుకుంటారు అంటుంది దీప. శౌర్య ఎలా ఉంది, తనని చూడాలనిపిస్తుంది అంటాడు కార్తీక్. తల్లిగా తన బాగోగులు నేను చూసుకోగలను దయచేసి మళ్ళీ వెతుక్కుంటూ రాకండి అలా చేస్తే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాము అని కార్తీక్ ని హెచ్చరించి వెళ్ళిపోతుంది దీప. తప్పుగా మాట్లాడానేమో అని అప్పుడు ఆలోచనలో పడతాడు కార్తీక్.

మరోవైపు దీప కోసం అవుట్ హౌస్ వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర. ఆమెకి ధైర్యం చెప్తాడు దశరధ్. దీప ఇంకా రాదా అని బాధగా అడుగుతుంది సుమిత్ర. నీ ప్రేమే తనని రప్పిస్తుంది ఇక ఇంట్లోకి వెళ్దాం పద రేపు ముహూర్తాలు పెట్టించడానికి పంతులు గారిని రమ్మన్నాను అంటాడు దశరథ్. వద్దు, ఇంట్లో పరిస్థితులు బాగోలేదు మనమే గుడికి వెళ్దాం అంటుంది సుమిత్ర.

Karthika Deepam 2 Serial 11th July 2024 Episode Number 93 Here is full story

మరోవైపు పప్పు కడుగుతూ ఉంటుంది దీప, ఏం చేస్తున్నావు అంటుంది శౌర్య. ముత్యాలమ్మ గూడెంలో సైకిల్ మీద ఇడ్లీలు అమ్మినట్టు ఇక్కడ కూడా అమ్ముతాను అంటుంది దీప. నేను కూడా వస్తాను అంటుంది శౌర్య. ఎందుకు అంటుంది దీప. కార్తీక్ ఎక్కడైనా కనిపిస్తాడేమో చూస్తాను, నాకు కార్తీక్ ని చూడాలనిపిస్తుంది అంటుంది శౌర్య. అక్కడ నుంచి వచ్చేసాం కదా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటుంది దీప. నేనేం చేసేది నాకు కార్తీక్ ఊరికే గుర్తొస్తున్నాడు అంటుంది శౌర్య.

మాట మార్చి శౌర్య ని నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తుంది దీప. మరుసటి రోజు పొద్దున్నే సైకిల్ పై టిఫిన్స్ తీసుకువెళ్తున్న దీప నువ్వు లోపలికి వెళ్లి ఆడుకో నేను పని ముగించుకొని వచ్చేస్తాను అంటుంది. నన్ను కూడా తీసుకొని వెళ్ళు దారిలో ఎక్కడైనా కార్తీక్ కనిపిస్తే చూస్తాను, లేదంటే బయటపెట్టుకొని వెళ్ళిపో లేదంటే నేను కార్తీక్ ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాను అంటుంది శౌర్య. ముత్యాలమ్మ గూడెం లో నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోయావు కదా అలాగే వాళ్లని మర్చిపోవాలి అంటుంది దీప.

కార్తీక్ అందరిలా ఫ్రెండ్ మాత్రమే కాదు అంటూ లోపలికి వెళ్తుంది శౌర్య. అంటే అని అనుమానంగా అడుగుతుంది దీప. అంటే బెస్ట్ ఫ్రెండ్ అని అర్థం అంటూ తలుపు వేసేసుకుంటుంది శౌర్య. దీని మాటలు వింటుంటే కార్తీక్ బాబు అన్న మాటలు వినేసిందేమో అని భయంగా ఉంది అనుకుంటుంది దీప.లోపల శౌర్య కార్తీక్ ని తలుచుకొని నేను గుర్తు రావటం లేదా, నన్ను చూడాలనిపించడం లేదా అనుకుంటూ ఏడుస్తుంది. మరోవైపు కార్తీక్ కూడా శౌర్య ని తలచుకొని బాధపడుతూ ఉంటాడు.

Karthika Deepam 2 Serial 11th July 2024 Episode Number 93 Here is full story

అప్పుడే అక్కడికి వచ్చిన జ్యోత్స్న నీకు మాత్రమే తెలిసిన సీక్రెట్ ఒకటి నాకు తెలుసు అంటుంది. ఏమిటది అంటాడు కార్తీక్. అడిగిన వెంటనే చెప్పేస్తే ఎలా అంటూ దీప దొరికిందా అని కార్తీక్ ని అడుగుతుంది జ్యోత్స్న. లేదు అంటాడు కార్తీక్. పోనీ ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా అని అడుగుతుంది జ్యోత్స్న. వాళ్ళు అలా మాటల్లో ఉండగానే కాంచన వచ్చి వాళ్ళని టిఫిన్ కి రమ్మని పిలుస్తుంది. జ్యోత్స్న వాళ్లతో పాటు వెళుతుంది. జ్యోత్స్న ఎందుకిలా మాట్లాడుతుంది..

మళ్ళీ పారు ఏమైనా చేస్తుందా ఏదో జరుగుతుంది అని అనుకుంటాడు కార్తీక్. మరోవైపు పని ముగించుకొని ఇంటికి వస్తున్న దీపకి నర్సింహ ఎదురుపడతాడు. ఏంటి మళ్లీ పాత జీవితం ప్రారంభించావా, నీకోసం అందరూ వెతుకుతున్నారు నీ గురించి అన్ని తెలుసుకున్నాను అంటాడు. ఇన్నాళ్ళు నాకు అనుమానంగా ఉండేది కానీ ఆ కార్తీక్ గాడు ఆ మాటలు నిజం చేశాడు, దీపకి భర్తని నేను కానీ శౌర్య కి తండ్రి మాత్రం ఆ కార్తీక్ గాడు అంటూ అసహ్యంగా మాట్లాడుతాడు.

అతని చెంప పగలబడుతుంది దీప. అయినా ఆమెని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతాడు నర్సింహ. మళ్లీ అతని చెంప పగలగొట్టి నువ్వు వెధవ్వేమో కానీ నేను కాదు నా కళ్ళల్లో తప్పు చేశాను అనే భయం కనిపిస్తుందేమో చూడు, ఏడిపిస్తే భరిస్తున్నాను కదా అని నా గుణాన్ని వేలెత్తి చూపిస్తే ఊరుకోను, చెయ్యి నరికేస్తాను అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీప. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X