Karthika Deepam June 11th episode: కార్తీక్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్న పారిజాతం.. బావతోనే పెళ్ళంటూ శపథం చేసిన
శౌర్య కి పిజ్జా తినిపించిన కార్తీక్ తో పాపకి కొత్త కొత్త రుచులు అలవాటు చేయవద్దు అని చెప్తుంది దీప. కార్తీక్ ప్రవర్తనని కాంచన తప్పు పడుతుంది, అర్థం చేసుకోమని తల్లికి నచ్చ చెప్తాడు కార్తీక్. పుట్టినరోజు సందర్భంగా విషయం చెప్పకుండా భర్త దగ్గర కోరిక తీర్చమని మాట తీసుకుంటుంది పారిజాతం. పుట్టినరోజు నాడు జ్యోత్స్న ని పెళ్లి చేసుకుంటాను అని కార్తీక్ చేత బలవంతంగా ప్రామిస్ చేయించుకుంటుంది పారిజాతం. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 11 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 68వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
దీప నీకు ముందే తెలుసు అని మాకు ఎందుకు చెప్పలేదు అని కార్తీక్ ని నిలదీస్తుంది పారిజాతం. నా మనవడికి నా మనవరాలికి పెళ్లి చేయటమే నా జీవిత లక్ష్యం అంటుంది. పెళ్లి చేసుకుని నా మరదలు జీవితాన్ని నాశనం చేయలేను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఇప్పుడే ఇంట్లో వాళ్ళతో చెప్తాను అంటాడు కార్తీక్. నువ్వు ఏ ఉద్దేశంతో పెళ్లి వద్దంటున్నావో నేను కూడా అందరికీ చెప్తాను.

నువ్వు ఎంత మొండి వాడివో నేను అంతకంటే మొండి దాన్ని మీ ఇద్దరికీ పెళ్లి చేసి తీరతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం. మరోవైపు బజారు పని మీద బయటకు వచ్చిన అనసూయ ఆకలిగా ఉండటంతో దీప పని చేస్తున్న హోటల్లోనే టిఫిన్ చేయడానికి వస్తుంది. అక్కడ ఉప్మా తింటూ ఇది దీప చేతి ఉప్మా లాగా ఉంది అనుకుంటూ బాబాయిని ఈ ఉప్మా ఎవరు చేశారు అని అడుగుతుంది.
చేసిన మనిషి నీ వెనకే ఉన్నారు అంటాడు బాబాయ్. అప్పుడు దీప అనసూయ దగ్గరికి వచ్చి మనుషుల్ని మరిచిపోయినా వారి చేతి రుచిని మరిచిపోలేదు ఇవే బంధాలు అంటే అంటుంది. నువ్వు పని చేస్తున్న హోటల్ అని తెలియక వచ్చాను, వెళ్ళిపోతాను అంటుంది అనసూయ. పర్వాలేదు తినేసి వెళ్ళు అని దీప చెప్పడంతో టిఫిన్ చేసిన అనసూయ డబ్బులు ఇవ్వబోతుంది దీప తీసుకోకపోవడంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది అనసూయ.

బయటకు వెళ్లిన తర్వాత మళ్లీ ఇటువైపు ఎట్టి పరిస్థితులలోనూ రాకూడదు అనుకుంటుంది. మరోవైపు పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వెళ్తుంది. బావ ఏమన్నాడు, బావకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా,అసలు నన్ను అక్కడి నుంచి ఎందుకు పంపించేసావు అని అడుగుతుంది జ్యోత్స్న. బావకి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే కానీ హోటల్ కన్స్ట్రక్షన్ అయ్యాక చేసుకుంటాను అంటున్నాడు.
అయినా బావా నిన్ను చేసుకోను అంటే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా, ముఖ్యంగా నేను ఊరుకోను అంటుంది పారిజాతం. నువ్వెందుకు ఈ పెళ్లిని ఇంత సీరియస్ గా తీసుకుంటున్నావు అంటుంది జ్యోత్స్న. ఎందుకంటే ఈ ఇంట్లో మనది ప్రత్యేకమైన బంధం, నీతో మీ బావ పెళ్లి జరిపించడమే నా జీవిత లక్ష్యం అంటుంది పారిజాతం. నువ్వు కాదు నేను చెప్తున్నాను బావని పెళ్లి చేసుకోవడమే నా జీవిత లక్ష్యం.
బావ కాదన్నా కూడా ఈ పెళ్లి జరుగుతుంది అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఇన్నాళ్ళకి నా మనవరాలు ఫామ్ లోకి వచ్చింది అనుకుంటూ మనవరాలిని చూసి మురిసిపోతుంది పారిజాతం. మరోవైపు పారిజాతం చేసిన పనికి కోపంతో రగిలిపోతూ అదే ఫ్రస్టేషన్ తో కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు కార్తీక్. ఎదురుగా ఏదో యాక్సిడెంట్ అవ్వటంతో కారు ఆపి అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి స్కూటీ యాక్సిడెంట్ చేసి కిందన పడిపోతుంది.

ఎదుటి వ్యక్తి దెబ్బలు గట్టిగా తగిలాయి అంటూ డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటే అతనికి కొంచెం డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు కార్తీక్. ఆమెని పక్కకు తీసుకు వెళ్లి కాలికి కట్టు కడతాడు. కార్తీక్ ని మెచ్చుకుంటుంది ఆ అమ్మాయి. ఈ నొప్పితో నేను బండి తీయలేను నన్ను కొంచెం హాస్పిటల్ కి తీసుకు వెళ్ళవా అని అడుగుతుంది. సరే అంటూ జాగ్రత్తగా తన కారు ఎక్కిస్తాడు కార్తీక్. మీ నాన్నగారికి ఫోన్ చెయ్యు హాస్పిటల్ దగ్గరికి వస్తారు అని చెప్తాడు కార్తీక్.
మా నాన్నగారు చాలా బిజీ ఆయన రారు, మా అమ్మకి ఫోన్ చేస్తాను అంటుంది ఆ అమ్మాయి. మరోవైపు శౌర్య కి భోజనం పెట్టటానికి ఇంటికి వస్తుంది దీప. కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను ఉండు అంటూ ఫోన్ టేబుల్ మీద పెట్టి వెళ్తుంది. అదే సమయంలో ఆ ఫోన్ తీసుకొని కార్తీక్ కి ఫోన్ చేస్తుంది శౌర్య. శౌర్య ఫోన్లో మాట్లాడటం జ్యోత్స్న చూస్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.


Click it and Unblock the Notifications











