Karthika Deepam August 12th episode: కోర్టులో సూపర్ ట్విస్ట్ ఇచ్చిన శోభ.. అనసూయని అబద్ధం చెప్పమంటున్న నర్సింహ!

ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కోర్టుకి వస్తారు పారిజాతం, జ్యోత్స్న. కోర్టులో లాయర్ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక పోతుంది దీప. కోర్టులోనే కళ్ళు తిరిగి పడిపోతుంది. కోర్టులో దీపకి కార్తీక్ కి అక్రమ సంబంధం ఉందని సాక్షాధారాలు చూపిస్తాడు లాయర్. దీప ఆరోగ్యం దృష్ట్యా వాయిదా ఇప్పించమని కోరుతుంది జ్యోతి. మరోవైపు కోర్టు బయట దీప ని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు నర్సింహ. మరోవైపు తనకి విడాకులు కావాలి, అర్జీ పెట్టమని జ్యోతితో చెప్తుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 12 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 121వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

నర్సింహ రెండో పెళ్లి గురించి తెలియాలంటే శోభ ని బోన్ లో ప్రవేశపెట్టాలని అడుగుతుంది జ్యోతి. జడ్జి పర్మిషన్ ఇస్తాడు. బోన్ లోకి వచ్చిన శోభని నర్సింహతో రెండో పెళ్లి గురించి అడుగుతుంది జ్యోతి. తనకి నర్సింహ కి పెళ్లి జరగలేదని, కార్తీక్ విశాల హృదయంతో దీప కి ఎలా అయితే సాయం చేస్తున్నాడో నేను కూడా అలాగే సాయం చేశానని, దీపతో కార్తీక్ కి సంబంధం అంట కడుతున్నారని నర్సింహతో నాకు సంబంధం అంటగడుతున్నారు అంటుంది శోభ. ఆమె అబద్ధం చెప్తుంది అంటుంది దీప. నర్సింహ ని ని పెళ్లి చేసుకోకపోతే మెడలో తాళి ఎందుకు ఉంటుంది అని అడుగుతుంది.

Karthika Deepam 2 Serial 12th August 2024 Episode Number 121 Here is full story

ఇది తాళి కాదు అంటూ తన మెడలో చైన్ చూపిస్తుంది శోభ. సూపర్ ట్విస్ట్ ఇచ్చింది గ్రానీ అని ఆనందంగా పారిజాతంతో చెప్తుంది జ్యోత్స్న. దీప ఏడుస్తూ ఆమె అబద్ధం చెప్తుంది నిజం ఏమిటో మా అత్తయ్యకి తెలుసు తనను పిలిపించండి తను నిజం చెప్తుంది అంటుంది. అనసూయని కోర్టుకి పిలిపించాలని మధ్యాహ్నానికి కోర్టు వాయిదా వేస్తాడు జడ్జి. తర్వాత లాయర్ టీ తాగుతూ ఉంటే అతని దగ్గరికి వెళ్తారు నర్సింహ, శోభ. లాయర్ అతనితో మాట్లాడుతూ నిజం చెప్పండి మీ ఇద్దరికీ పెళ్లి జరగలేదా అని అడుగుతాడు నిజంగానే పెళ్ళి జరగలేదు అని చెప్తాడు నర్సింహ.

డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర నిజం దాచకూడదు. అయినా ఇప్పుడు మనం ఈ కేసుగెలవాలంటే మీ అమ్మ చెప్పబోయే సాక్ష్యం మీద ఆధారపడి ఉంది వెళ్ళి మీ అమ్మగారికి తీసుకొని రా అని చెప్తాడు లాయర్. సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు నర్సింహ, శోభ. తర్వాత అతని దగ్గరికి పారిజాతం, జ్యోత్స్న వస్తారు. తనని తాను పరిచయం చేసుకొని దీపకి విడాకులు రాకుండా చూడాలని, పాప నర్సింహ కి చెందేలాగా చూడమని అందుకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తానని చెప్తుంది జ్యోత్స్న.

Karthika Deepam 2 Serial 12th August 2024 Episode Number 121 Here is full story

ముందు జ్యోత్స్న మాటలకి ఆశ్చర్యపోతాడు లాయర్, తర్వాత ఆ దీప విడాకులు తీసుకుంటే ఎక్కడ మీ బావని పెళ్లి చేసుకుంటుందో అని భయపడుతున్నారా.. భయపడకండి ఈ కేసులో కచ్చితంగా ఈ కేసు నేను గెలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు లాయర్. తర్వాత పారిజాతం వాళ్ళు సుమిత్ర వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇంతసేపూ ఎక్కడికి వెళ్లారు, అయినా జ్యోత్స్న ని తీసుకురావద్దని నీకు చెప్పాను కదా అని పారిజాతంతో అంటుంది సుమిత్ర. నేనే గ్రానీ ని తీసుకొని వచ్చాను, మీరందరూ దీప కోసం వచ్చారు కదా, నేను బావ కోసం వచ్చాను అంటుంది జ్యోత్స్న.

తను చదువుకోలేదు కదా అందుకే తనకి తోడుగా ఉందామని వచ్చాము అంటుంది కాంచన. నువ్వు పొరపాటు పడ్డావు కాంచన, జ్యోత్స్న పుస్తకాల్లో మాత్రమే చదివింది కానీ దీప జీవితాలని చదివేసింది అంటుంది పారిజాతం. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని తను భయపడుతుంది, తనమీద మీరు సెటైర్లు వేస్తారు ఏంటి అని కోప్పడుతుంది పారిజాతం. మరోవైపు నర్సింహ ఇంటికి వెళ్లి జరిగిందంతా తల్లికి చెప్పి నీ కొడుకు ఆనందంగా ఉండాలంటే శోభకి నాకు పెళ్లి జరగలేదని ఒక ముక్క చెప్పు చాలు అని తల్లిని ఒప్పించి కోర్టుకు తీసుకు వస్తాడు.

Karthika Deepam 2 Serial 12th August 2024 Episode Number 121 Here is full story

అప్పుడు దీప అనసూయ దగ్గరికి వచ్చి తనకి అనుకూలంగా మాట్లాడమని బ్రతిమాలుతుంది. నాకు నా కొడుకు ముఖ్యం, నువ్వు నీ కూతురు కోసం ఎలా తపన పడుతున్నావో నేను నా కొడుకు కోసం అలా తపన పడుతున్నాను ఎక్కడ ఏం మాట్లాడాలో నాకు తెలుసు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనసూయ. మళ్లీ సుమిత్ర వాళ్ళ దగ్గరికి వస్తుంది దీప. వాళ్ళంతా ఒకటే దీప అంటాడు కార్తీక్.

తరువాయి భాగంలో శౌర్య ని కోర్టులో నువ్వు తల్లి దగ్గర ఉంటావా తండ్రి దగ్గర ఉంటావా అని లాయర్ అడిగితే శౌర్య తండ్రి వైపు చేయి చూపిస్తుంది. షాక్ అయిపోతుంది దీప.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X