Karthika Deepam July 12th episode:కార్తీక్ ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్న పారిజాతం..సుమిత్ర కి అడ్డంగా
బయటి వాళ్ల సంగతి కాదు ముందు మనవరాలి సంగతి చూడండి అని పారిజాతం అనడంతో ముహూర్తాలు పెట్టించుకు రండని కాంచన ఇంటికి కొడుకుని కోడల్ని పంపిస్తాడు శివ నారాయణ. మరోవైపు కార్తీక్ ని ఫాలో అవుతూ ఉంటారు జ్యోత్స్న,పారిజాతం. నా వెంట పడొద్దని వాళ్ళని హెచ్చరిస్తాడు కార్తీక్. మరోవైపు రోడ్డు మీద వెళ్తున్న దీపని ఆపి ఆమె క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతాడు నర్సింహ. అక్కడే అతని చెంప పగలగొట్టి తన జోలికి రావద్దని హెచ్చరించి వచ్చేస్తుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 12వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 95వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
గోడమీద కార్తీక్ పేరుని చూసి ఈ పేరును చూసి శౌర్య పదేపదే కార్తీక్ బాబు ని గుర్తు చేసుకుంటుంది అందుకే ఈ పేరుని చెరిపేయాలి అనుకొని ఒక క్లాత్ తెచ్చి ఆ పేరుని తుడిచేయబోతుంది దీప. అప్పుడే శౌర్య వచ్చితల్లిని వారిస్తుంది. ఇది మన ఇల్లు కాదు ఇలా గోడల మీద పేర్లు రాస్తే హౌస్ ఓనర్ ఊరుకోరు అంటుంది దీప. సరే చెరిపేయ్ అని కోపంగా అక్కడినుంచి వెళ్ళిపోయిన శౌర్య చేతి మీద కార్తీక్ పేరు రాసుకొని వచ్చి ఇక్కడ రాసుకుంటే ఏ హౌస్ ఓనరు కోప్పడరు కదా అంటుంది.

ఆమె మాటలకి ఎమోషనల్ అవుతుంది దీప. ఇంతలో డోర్ బెల్ మోగటంతో కార్తీక్ అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంది శౌర్య. నర్సింహ ఏమో అనుకొని భయపడుతుంది దీప కానీ అక్కడికి వచ్చింది హౌస్ ఓనర్. రేపు గుడిలో ప్రసాదం పంచాలి అనుకుంటున్నాను ఒక 50 మందికి నువ్వు ప్రసాదం వండాలి అంటాడు. అందుకు ఒప్పుకుంటుంది దీప. సరే రేపు పొద్దున్నే గుడికి వచ్చేయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు హౌస్ ఓనర్.
మరోవైపు జ్యోత్స్న ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని చెప్పడానికి సుమిత్ర ఇంటికి వస్తాడు కార్తీక్. అయితే మీ అత్తయ్య వాళ్ళు ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టించడానికి గుడికి వెళ్లారు కావాలంటే నువ్వు కూడా వెళ్ళు అంటాడు శివ నారాయణ. శివ నారాయణ అక్కడ నుంచి వెళ్లిపోయిన తరువాత కార్తీక్ పారిజాతంతో మాట్లాడుతూ నువ్వు తప్పు చేస్తున్నావు , ఈ పెళ్లి ఇష్టం లేదని ఇప్పుడే చెప్తాను అంటాడు కార్తీక్. అలా చేస్తే మొదటి బాధపడేది మీ అమ్మే,

మేన కోడలిని కోడలు చేసుకోవాలని ఒకే ఒక ఆశతో బ్రతుకుతుంది తను. అయినా మీ మరదలు మాత్రం ఊరుకుంటుందా, నువ్వు పెళ్లి ఇష్టం లేదు అన్న మరుక్షణం విషం తాగి చచ్చిపోతుంది అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది పారిజాతం. ఆలోచనలో పడతాడు కార్తీక్. మరోవైపు గుళ్లో పంతులుగారు గురువారం బాగుంది అని ముహూర్తం పెడతారు. ఆ ముహూర్తమే ఖాయం చేయండి అంటారు కాంచన దంపతులు, సుమిత్ర దంపతులు. తర్వాత సుమిత్ర ప్రసాదం పంచడానికి వెళుతుంది.
అదే సమయానికి అక్కడికి దీప కూతుర్ని తీసుకొని ప్రసాదం చేయడానికి వస్తుంది. శౌర్య సుమిత్ర ని చూసి అమ్మమ్మ ఇక్కడే ఉంది అని ఆనందంగా చెప్తుంది మనం ఆ ఇంటి నుంచి వచ్చేసాం కదా వాళ్లతో మాట్లాడకూడదు నువ్వు ఇక్కడే కూర్చో అని ఒక చోట కూర్చోబెట్టి దీప గుడి వెనక్కి వెళ్లి దాక్కుంటుంది. వెనకనుంచి దీప అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేస్తుంది సుమిత్ర. ఒక్కసారిగా షాక్ అవుతుంది దీప. ఇలా దొరికిపోతావని అనుకోలేదు కదా నేను ముందే చూసాను పిలిస్తే పలుకవని నిన్ను ఫాలో అయ్యాను అంటుంది.

అసలు ఏంటి ఇదంతా, ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయావు అని నిలదీస్తుంది. నిజం చెప్పలేక ఎన్నాళ్ళని పరాయి ఇంట్లో ఉంటానమ్మా అందుకే వచ్చేసాను అంటుంది దీప. నేను నీకు పరాయిదాన్నేమో కానీ నువ్వు నాకు ఎప్పటికీ కూతురివే అయినా నువ్వు నాకు చెప్పకుండా బయటికి వెళ్ళవు అలా వెళ్ళావు అంటే ఏదో జరిగింది నిజం చెప్పు అనే నిలదీస్తుంది సుమిత్ర.. అయినా నిజం చెప్పదు దీప.

నీకు సరియైన దారి చూపించలేకపోయానని ఇప్పటికీ బాధపడుతున్నాను అందుకే నాతో వచ్చేయ్ అంటుంది సుమిత్ర. అందుకు అంగీకరించదు దీప. సరే కార్తీక్ వాళ్ళకి ఎంగేజ్మెంట్ ముహూర్తాలు పెట్టించడానికి వచ్చాము ఆరోజు నువ్వు శౌర్య మా ఇంటికి రండి వస్తే నేను చాలా సంతోషిస్తాను అంటుంది సుమిత్ర. రాలేనమ్మ అంటుంది దీప. అది నీ నిర్ణయానికి వదిలేస్తున్నాను మీరు వస్తే నేను సంతోషిస్తాను అంటుంది సుమిత్ర తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











