Karthika Deepam 12th June Episode: దీపపై జ్యోత్స్న ఫైర్.. కార్తీక్ మౌనంగా!

కార్తీక్ ప్రవర్తనని కాంచన తప్పు పడుతుంది, అర్థం చేసుకోమని తల్లికి నచ్చ చెప్తాడు కార్తీక్. పుట్టినరోజు సందర్భంగా విషయం చెప్పకుండా భర్త దగ్గర కోరిక తీర్చమని మాట తీసుకుంటుంది పారిజాతం. పుట్టినరోజు నాడు జ్యోత్స్న ని పెళ్లి చేసుకుంటాను అని కార్తీక్ చేత బలవంతంగా ప్రామిస్ చేయించుకుంటుంది పారిజాతం. తరువాత అలా ఎందుకు చేసావంటూ పారిజాతంపై కోప్పడతాడు కార్తీక్. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 12 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 69వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

శౌర్య ఫోన్లో కార్తీక్ తో మాట్లాడుతుందని తెలుసుకొని ఆమె దగ్గరికి వస్తుంది జ్యోత్స్న. అప్పుడే శౌర్య కార్తీక్ తో మాట్లాడుతూ ఫోన్ చాలా బాగుంది, ఇప్పుడు నీతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడొచ్చు అంటుంది. అప్పుడు జ్యోత్స్న ఫోన్ శౌర్య దగ్గర నుంచి తీసుకొని కార్తీక్ మాటలు వింటుంది. కార్తీక్ కి ఆ విషయం తెలియక నీకు గాని మీ అమ్మకు గాని ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చెయ్యు, మీ అమ్మకి ఆత్మ అభిమానం ఎక్కువ నాకు చెప్పదుఅందుకే మీకు ఏ అవసరం వచ్చినా నాకు నువ్వే చెప్పాలి అంటాడు కార్తీక్.

Karthika Deepam 2 Serial 12th June 2024 Episode Number 69 Here is full story

ఆ మాటలకి కోపంతో రగిలిపోయిన జ్యోత్స్న ఫోన్ శౌర్యకి ఇచ్చేస్తుంది. ఇప్పటివరకు ఏం మాట్లాడావు కార్తీక్,నేను వినలేదు జో విన్నది అని చెప్తుంది శౌర్య. కంగారుపడిన కార్తీక్ ఫోన్ పెట్టేస్తాడు మనసులోనే ఎవరికి తెలియకూడదు అనుకుంటామో వాళ్ళకే తెలుస్తాయి ఇప్పుడు జ్యోత్స్న ఏం అపార్థం చేసుకొని ఏం గొడవ చేస్తుందో అని ఫీల్ అవుతాడు. తర్వాత జ్యోత్స్న ఫోన్ ఎక్కడిది అని శౌర్య ని అడుగుతుంది. కార్తీక్ ఇచ్చాడు అని చెప్తుంది శౌర్య. నేను కొనుక్కున్నాను అంటుంది దీప.

కార్తీక్ నీకు ఫోన్ ఇవ్వడం నేను చూశాను అంటూ దీపని ఇరికించేస్తుంది శౌర్య. ఆమెని కోప్పడుతుంది దీప. పిల్లలు అబద్ధం చెప్పరు అంటూ దీపపై ఫైర్ అవుతూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. అప్పుడు శౌర్య ని లోపలికి తీసుకువెళ్లి నేను ఫోన్ కొనుక్కున్నాను కావాలంటే బిల్లు చూడు అంటూ బిల్లు చూపిస్తుంది దీప. సారీ అమ్మ, కార్తీక్ నీకు ఫోన్ ఇవ్వటం చూసి నీకు సర్ప్రైజ్ చేసాడేమో అనుకున్నాను ఇప్పుడే జో కి నిజం చెప్తాను అంటుంది దీప.

Karthika Deepam 2 Serial 12th June 2024 Episode Number 69 Here is full story

అక్కర్లేదు అని శౌర్య ని మందలిస్తుంది దీప. మరోవైపు అత్తగారి ప్రవర్తన ఏమీ బాగోలేదు అని భర్తకి చెప్తుంది సుమిత్ర. ఆమెని ఏమి అనవద్దు, అసలే ఈరోజు ఆమె పుట్టిన రోజు పైగా నిన్న రాత్రి నాన్న దగ్గర మాట కూడా తీసుకుంది అంటాడు దశరద్. నిజమే కానీ జ్యోత్స్న మనల్ని అపార్థం చేసుకుంటుంది అందుకే అత్తయ్యని జ్యోత్స్న కి కొంచెం దూరంగా ఉండమని చెప్పి గట్టిగా చెప్పాలి అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర.

మరోవైపు దీప హోటల్ కి వెళ్ళిన సంగతి అనసూయ కొడుకుతో చెప్తుంది. దాని జోలికి వెళ్ళవద్దు అని హెచ్చరిస్తుంది. కానీ నర్సింహ మాత్రం దీప పై పగ సాధిస్తాను అని మనసులో అనుకుంటాడు. మరోవైపు పారిజాతం దగ్గరికి వచ్చిన జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఫోన్ విషయం చెప్తుంది. వాళ్ళిద్దరికీ సంబంధం ఉంది గ్రానీ కానీ నేను చూస్తూ ఊరుకోను చిన్నప్పటినుంచి మీ మాటలతో నన్ను బావకి పెళ్ళాన్ని చేసేసారు.

Karthika Deepam 2 Serial 12th June 2024 Episode Number 69 Here is full story

ఇప్పుడు పెళ్లి అవ్వలేదు కానీ నేను ఎప్పుడో మానసికంగా బావకి పెళ్ళాన్ని అయిపోయాను. అలాంటి నా బావని ఎగరేసుకుపోతానంటే చూస్తూ ఊరుకోను, ఆ దీపకి మిట్ట మధ్యాహ్నం చుక్కలు చూపిస్తాను అంటూ ఆవేశంతో ఊగిపోతుంది. ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత మనవరాలిలో వచ్చిన మార్పును చూసి ఆనందపడుతుంది పారిజాతం. మరోవైపు హోటల్లో పనిచేస్తున్న దీప జ్యోత్స్న తనను అపార్థం చేసుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది.

అలాగే కార్తీక్ మనసులో ఎవరైనా ఉన్నారా లేదంటే ప్రమాణం చేయటానికి ఎందుకు అంత ఆలోచించారు అని కూడా ఆలోచిస్తుంది. వాళ్ళిద్దరికీ ఎలాగైనా పెళ్లి జరగాలి లేదంటే దానికి కూడా కారణం కూడా నేనే అంటుంది జ్యోత్స్న అసలు ఇదంతా ఆ పారిజాతం గారి వల్లే అనుకుంటుంది. ఇంతలో బాబాయి హాస్పిటల్ వాళ్ళు టిఫిన్ ఆర్డర్ ఇచ్చారు నేను వెళ్లి ఇచ్చి వస్తాను అంటాడు. నువ్వు ఉండు బాబాయ్ నేను ఇచ్చి వస్తాను అని టిఫిన్ తీసుకుని బయలుదేరుతుంది దీప. దారిలో నర్సింహ కనిపిస్తాడు.

ఆవేశంలో ఉన్న ఆడదాని జోలికి పోవద్దని నాలాంటి వాడు చెప్పాడు అందుకే నిన్ను ఏమి చేయలేదు అనే దీపని రెచ్చగొడతాడు. తల్లి లేకుండా పోతుందని నా కూతురు గురించి ఆలోచించి నిన్ను ఏమీ చేయలేదు అంటుంది దీప. తొందరపడకు తొందరలోనే ఆ పని కూడా అయిపోతుంది అంటాడు నర్సింహ.ఆ మాటలకి కోపంతో రగిలిపోతుంది దీప. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X