Karthika Deepam August 13th episode: కోర్టులో ప్లేట్ ఫిరాయించిన అనసూయ.. ఊహించని నిర్ణయం తీసుకున్న శౌర్య!

దీప కోర్టులోనే కళ్ళు తిరిగి పడిపోతుంది. కోర్టులో దీపకి కార్తీక్ కి అక్రమ సంబంధం ఉందని సాక్షాధారాలు చూపిస్తాడు లాయర్. దీప ఆరోగ్యం దృష్ట్యా వాయిదా ఇప్పించమని కోరుతుంది జ్యోతి. మరోవైపు కోర్టు బయట దీప ని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు నర్సింహ. మరోవైపు తనకి విడాకులు కావాలి, అర్జీ పెట్టమని జ్యోతితో చెప్తుంది దీప. కోర్టులో తనకి నర్సింహ కి పెళ్లి అవ్వలేదని చెప్తుంది శోభ. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 13 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 122వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

సుమిత్రని విచారించేందుకు పర్మిషన్ అడుగుతుంది జ్యోతి. ఆవిడ వాంగ్మూలం ఎందుకు అని అడుగుతాడు లాయర్ విష్ణువర్ధన్. ఆవిడ వల్లే దీప ఆ ఇంట్లో ఉంటుంది. ఆవిడని అడిగితే దీప గురించిన నిజాలు తెలుస్తాయి అంటుంది జ్యోతి. జడ్జి పర్మిషన్ ఇవ్వడంతో సుమిత్రని విచారిస్తుంది జ్యోతి. దీప ఎలాంటిది అని అడుగుతుంది. తను చాలా మంచిదని, మేము తనకి సాయం చేస్తామన్నా తీసుకోదు, తన కష్టం మీదే బ్రతుకుతుంది తను చాలా మంచిది అని చెప్తుంది సుమిత్ర.

Karthika Deepam 2 Serial 13th August 2024 Episode Number 122 Here is full story

విన్నారు కదా జడ్జిగారు అంటుంది జ్యోతి. నర్సింహ తల్లిని కూడా విచారిస్తే మనకి నిజానిజాలు తెలుస్తాయి అంటాడు విష్ణువర్ధన్. జడ్జి పర్మిషన్ ఇవ్వటంతో అనసూయని విచారిస్తాడు లాయర్. దీప కార్తీక్ తో కలిసి తిరగడం చాలాసార్లు చూశానని కార్తీక్ తన కొడుకుని రెండు మూడు సార్లు కొట్టాడని, పోలీస్ కేసు కూడా పెట్టాడని చెప్తుంది అనసూయ. విన్నారు కదా జడ్జి గారు స్వయంగా దీప అత్తె దీప కి కార్తీక్ కి అక్రమ సంబంధం ఉందని ఒప్పుకుంటుంది అంటాడు లాయర్.

అప్పుడు అనసూయ మాట్లాడుతూ నేను ఎక్కడ అక్రమ సంబంధం ఉందని ఒప్పుకున్నాను, తను నా చేతుల్లో పుట్టి పెరిగింది, తను ఎలాంటిదో మాకు తెలుసు. తను తప్పు చేసింది అంటే నేను ఒప్పుకోను అంటుంది అనసూయ.ఆమె మాటలకి కోర్టులో అందరూ షాక్ అవుతారు. మీ అమ్మ ఏంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది అంటుంది శోభ. ప్లేటు ఫిరాయించేసింది అని తిట్టుకుంటాడు నర్సింహ. శోభ తో నర్సింహ తో పెళ్లయిందా అని అడుగుతాడు లాయర్.

Karthika Deepam 2 Serial 13th August 2024 Episode Number 122 Here is full story

పెళ్లి అయిందని, ఊరు నిండా అప్పులు చేసి పారిపోయి వచ్చేసాడని జరిగిందంతా చెప్తుంది అనసూయ. అలాగే దీప కూతురు కోసమే బ్రతుకుతుందని ఆ తల్లి బిడ్డల్ని వేరు చేయొద్దని వేడుకుంటుంది. ఈ దరిద్రుడు నాకు కూడా అబద్ధం చెప్పాడన్నమాట ఇక వీడి కోసం వాదించడం అనవసరం అనుకుంటాడు లాయర్ విష్ణువర్ధన్. అనసూయ మాటలకి సుమిత్ర వాళ్ళందరూ ఆనందిస్తారు. దీపకి అనుకూలంగా కోర్టు తీర్పు వస్తుంది.

విడాకులు కూడా మంజూరు అవుతాయి. దీప కష్టాలు పోయినట్లే అని కార్తీక్ తో అంటుంది సుమిత్ర. ఇంకా పాప గురించి జడ్జిమెంట్ ఇవ్వలేదు అంటాడు కార్తీక్. పాపని నా క్లైంట్ కి చెందేలా చూడమంటుంది జ్యోతి. అది పాప చేతిలో ఉంటుంది అంటారు జడ్జిగారు. అప్పుడు కార్తీక్ పాపని తీసుకు వస్తాడు. జడ్జి నువ్వు తల్లి దగ్గర ఉండాలనుకుంటున్నావా తండ్రి దగ్గర ఉండాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు. నర్సింహాని చూపిస్తుంది శౌర్య.

Karthika Deepam 2 Serial 13th August 2024 Episode Number 122 Here is full story

అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నానమ్మ లాగా ఇది కూడా పెద్ద షాక్ ఇచ్చిందేంటి అంటుంది పారిజాతం. నా భార్యకి భర్త మీద గౌరవం లేదు కానీ నా పాపకి తండ్రి కావాలి నా దగ్గరికి వచ్చేయ్ శౌర్య అంటాడు నర్సింహా. అప్పుడు శౌర్య మాట్లాడుతూ ఆ బూచాడు నాకు నాన్నగా వద్దు, నాకు తల్లి అయినా, తండ్రి అయిన మా అమ్మే అంటుంది. ఆ మాటలకి ఆనందపడిపోతూ వచ్చి కూతుర్ని హత్తుకుంటుంది దీప.

Karthika Deepam 2 Serial 13th August 2024 Episode Number 122 Here is full story

తరువాయి భాగంలో రెస్టారెంట్లో కూర్చొని దీప నర్సింహ కి విడాకులు ఇచ్చేసింది కాబట్టి దీప, నర్సింహ ఇంక కలవరు అని జ్యోత్స్న తో అంటుంది పారిజాతం. అప్పుడే రెస్టారెంట్ కి శౌర్య, దీపతో వస్తాడు కార్తీక్. వాళ్లని చూస్తే ఏమనిపిస్తుంది అంటుంది అంటుంది జ్యోత్స్న. ఫ్యామిలీ సినిమా చూసినట్లు అనిపిస్తుంది అంటుంది పారిజాతం. మరోవైపు కార్తీక్ దీప తో మాట్లాడుతూ ఇది మీకు కన్నిటికీ ముగింపు అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X