Karthika Deepam:దీప కళ్ళ ముందే నిశ్చితార్థం జరగాలంటున్న జ్యోత్స్న..కార్తీక్ తన మనసులో మాటని తల్లికి చెప్తాడా!

కార్తీక్ ని ఫాలో అవుతూ ఉంటారు జ్యోత్స్న,పారిజాతం. నా వెంట పడొద్దని వాళ్ళని హెచ్చరిస్తాడు కార్తీక్. మరోవైపు రోడ్డు మీద వెళ్తున్న దీపని ఆపి ఆమె క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతాడు నర్సింహ. అక్కడే అతని చెంప పగలగొట్టి తన జోలికి రావద్దని హెచ్చరించి వచ్చేస్తుంది దీప. హౌస్ ఓనర్ కోరిక మేరకు గుడిలో ప్రసాదం చేయడం కోసం వెళ్లిన దీప సుమిత్ర కంట్లో పడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 13వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 96వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

నిశ్చితార్థానికి రమ్మని దీపని పిలుస్తుంది సుమిత్ర రాలేను అంటుంది దీప. రావడం రాకపోవడం అనేది నీ నిర్ణయం కానీ వస్తే నేను సంతోషిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర. తర్వాత తల్లి దగ్గరికి వస్తుంది శౌర్య. అమ్మమ్మ వెళ్లిపోయింది కదా అందుకే వచ్చాను, గుడి కి అందరూ వచ్చారు కానీ కార్తీక్ రాలేదు ఎందుకు రాలేదని తల్లిని అడుగుతుంది. ఎందుకు రాలేదో నాకు ఎలా తెలుస్తుంది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీప. కార్తీక్ వచ్చి ఉంటే బాగుండేది అనుకుంటుంది శౌర్య.

Karthika Deepam 2 Serial 13th July 2024 Episode Number 95 Here is full story

అదే సమయంలో కార్తీక్ దీప వాళ్ళ పాత ఇంట్లో శౌర్య నోట్ బుక్ చూస్తూ శౌర్య ని తలుచుకుంటూ ఉంటాడు. ఇల్లంతా చూస్తూ ఉంటే దీప దేవుడి దగ్గర పెట్టిన డబ్బా కనిపిస్తుంది కార్తీక్ కి. ఫీజు కోసం దాచిన డబ్బా అది అని గుర్తుకు వస్తుంది. దానిని తీసి మళ్ళీ పెట్టేయ్యబోతుంటే కింద పడిపోతుంది. అందులో నుంచి డబ్బులతో పాటు లెటర్ కూడా కనిపిస్తుంది కార్తీక్ కి. మిగిలిన డబ్బులు కూడా గడువులోపే మీకు అందుతాయి అని ఆ లెటర్లో రాసి ఉండటం చూసి మీకు ఆత్మ అభిమానం ఎక్కువ దీప.

ఆత్మ అభిమానంతో పాటు అర్థం చేసుకోకపోవడం, మొండితనం అన్నీ ఎక్కువే. ఎవరైనా ఏమైనా అనుకుంటారని మీరు, అందరూ బాధపడతారని నేను ఇక్కడ వరకు తెచ్చుకున్నాము అనుకుంటూ ఆ డబ్బా మళ్ళీ అక్కడే పెట్టేసి బయటికి వస్తాడు. అప్పుడే పారిజాతం అక్కడికి వచ్చి కార్తీక్ ని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది నువ్వు అనుకున్నది ఏదీ జరగదు అంటాడు కార్తీక్. జరిగి తీరుతుంది అంటుంది పారిజాతం.

Karthika Deepam 2 Serial 13th July 2024 Episode Number 95 Here is full story

అంతలోనే దశరధ్ వాళ్ళు వస్తారు కార్తీక్ ని చూసి ఇక్కడ ఏం చేస్తున్నావ్ ఇంట్లోకి వెళ్ళవలసింది అంటారు. మీకోసమే ఎదురు చూస్తున్నాడు, మీరు ముహూర్తాలు పెట్టించుకో వస్తారని తెలిసి ఎప్పుడు ఎప్పుడు గుడ్ న్యూస్ విందామా అని ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు అంటుంది పారిజాతం. పారు ఎందుకిలా శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తుంది అనేది తిట్టుకుంటాడు కార్తీక్. గురువారం ముహూర్తం పెట్టారు అని చెప్తుంది సుమిత్ర. చాలా ఆనంద పడిపోతుంది పారిజాతం అప్పుడే బయటి నుంచి వచ్చిన జ్యోత్స్న కి విషయం చెప్తుంది.

ఈ విషయం నాన్నగారికి కూడా చెప్పాలి లోపలికి వెళ్దాం అంటాడు దశరద్. అందరూ లోపలికి వెళ్తుంటే కార్తీక్ నాకు పని ఉంది నేను బయలుదేరుతాను అని కారు దగ్గరికి వెళ్తాడు. సుమిత్ర అతని దగ్గరకు వెళ్లి దీప గురించి చెప్తుంది. తనకోసం వెతకొద్దు, ఎంగేజ్మెంట్ కి రమ్మని పిలిచాను రావడం రాకపోవడం తన ఇష్టం అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ మాటలు జ్యోత్స్న వాళ్ళు వింటారు. మరోవైపు ఆటోలో వెళుతున్న శౌర్య కి కార్తీక్ కారులో వెళ్లిపోవడం కనిపిస్తుంది.

Karthika Deepam 2 Serial 13th July 2024 Episode Number 95 Here is full story

ఆటో వాడితో ఫాస్ట్గా వెళ్ళు ఆ కారులో కార్తీక్ ఉన్నాడు అతనితో మాట్లాడాలి అంటుంది. కారు అంత ఫాస్ట్ గా ఆటో వెళ్ళదు అంటాడు ఆటో వాడు. ఎందుకు అతనిని ఇబ్బంది పెడతావు అని శౌర్యని కోప్పడుతుంది దీప. నువ్వే అందరినీ ఇబ్బంది పెడుతున్నావు అని తల్లిపై కోప్పడుతుంది శౌర్య. కూతురు దగ్గర కూడా తలవంచుకునే పరిస్థితి తీసుకువచ్చారు అని కార్తీక్ ని తిట్టుకుంటుంది దీప. మరోవైపు దీప గురించి మాట్లాడుకుంటూ ఉంటారు జ్యోత్స్న, పారిజాతం.

బావ నాతో పెళ్లి ఇష్టం లేదని నీకు ఏమైనా చెప్పాడా అని అడుగుతుంది జ్యోత్స్న. లేదు అని అబద్ధం చెప్పేస్తుంది పారిజాతం. దీప ఎక్కడ ఉందో ఎలాగైనా కనుక్కోవాలి తన కళ్ళ ముందే నా నిశ్చితార్థం జరగాలి అంటుంది జ్యోత్స్న. ఆ బాధ్యత నాది అంటుంది పారిజాతం. మరోవైపు కాంచన కార్తీక్ ఎంగేజ్మెంట్ గురించి ఫోన్ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. తల్లికి ఎలాగైనా నిజం చెప్పాలి అనుకుంటూ తల్లి దగ్గరికి వస్తాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X