Karthika Deepam August 14th episode: అనసూయ కాళ్లు పట్టుకున్న దీప..సడన్ ఎంట్రీ ఇచ్చిన పారిజాతం కొడుకు!
దీప ఆరోగ్యం దృష్ట్యా వాయిదా ఇప్పించమని కోరుతుంది జ్యోతి. మరోవైపు కోర్టు బయట దీప ని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు నర్సింహ. మరోవైపు తనకి విడాకులు కావాలి, అర్జీ పెట్టమని జ్యోతితో చెప్తుంది దీప. కోర్టులో తనకి నర్సింహ కి పెళ్లి అవ్వలేదని చెప్తుంది శోభ. అయితే అదంతా అబద్ధమని, తన కొడుకు రెండో పెళ్లి చేసుకున్నాడని కోర్టులో చెప్పి అందరికీ షాకిస్తుంది అనసూయ. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 14 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 123వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
కూతుర్ని పట్టుకొని ఎమోషనల్ అవుతుంది దీప. అది చూసిన జడ్జి కూడా ఎమోషనల్ అవుతాడు. ఇకమీదట నీ కూతురు నీ దగ్గరే ఉంటుంది అని చెబుతూ ఈరోజు ఇచ్చిన తీర్పు మనసుకి చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కేసుని ముగిస్తాడు జడ్జ్. అనసూయ అక్కడనుంచి వెళ్ళిపోతుంటే ఆమె దగ్గరికి వెళుతుంది దీప. కార్తీక్ బూచాడిని నీ దగ్గరికి కూడా రానివ్వనని చెప్పాను కదా ఇకమీదట ఆ బూచోడు నీ దగ్గరికి రాడు అని శౌర్యతో చెప్పి ఆమెని దగ్గరికి తీసుకుంటాడు.

ఇదంతా చూస్తున్న జ్యోత్స్న, పారిజాతం కోపంతో రగిలిపోతారు. ఎటోచ్చి నష్టపోయింది మనమే ఈ ప్రేమానురాగాలు మనం చూడలేం పద అని పారిజాతాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. అందరూ కలిపి నన్ను ఎదవని చేశారు అని కోప్పడుతూ భార్యని తీసుకొని వెళ్ళిపోతాడు నర్సింహ. లాయర్ విష్ణువర్ధన్ ఈ కేసు కూడా నేనే గెలిచాను అని జ్యోతి తో అంటాడు. ఆశ్చర్యంగా చూస్తుంది జ్యోతి.
ఆశ్చర్యపోకండి ఈ కేసులో న్యాయం గెలిచింది అంటే న్యాయవాది గెలిచినట్లే, మనం మళ్ళీ మరో కేసులో కలుద్దాం అంటూ వెళ్ళిపోతాడు విష్ణువర్ధన్. మరోవైపు అనసూయ దగ్గరికి వచ్చిన దీప ఆమె కాళ్లు పట్టుకొని ఆమెకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది, ఇంత జరిగిన తరువాత నీ కొడుకు కోడలు నిన్ను ఇంట్లోకి రానివ్వరు, నువ్వు కూడా నాతో పాటు వచ్చేయ్ అంటుంది. దీప దగ్గర ఆటోకి మాత్రం డబ్బులు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనసూయ.
దీప కి ధైర్యం చెప్పి, శౌర్యని బాగా చదువుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోతి. ఇక నువ్వు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు పదా మన ఇంటికి వెళ్దాం అని దీపతో ఉంటుంది సుమిత్ర. మరోవైపు చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఊర్లోకి ఎంట్రీ ఇస్తాడు పారిజాతం కొడుకు. తన తల్లి తన కూతుర్ని మార్చేసిన సంఘటన తలుచుకొని ఇప్పుడు నా కూతురు ఎలా ఉందో, తనని చూడటానికి నన్ను ఇంట్లోకి రానిస్తారో రానివ్వరో అనుకుంటాడు.
పక్కనే ఉన్న టీ కొట్టు లో టీ తాగి డబ్బులు ఇస్తాడు పారిజాతం కొడుకు. చిల్లర లేదు అంటాడు షాపు వాడు. మళ్ళీ వస్తానులే ఈ ప్రదేశానికి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది నన్ను అంత త్వరగా నన్ను వదిలిపెట్టదు అంటాడు పారిజాతం కొడుకు. ఏంటా సంబంధం అంటాడు షాపు వాడు. ఒక చావు, ఒక పుట్టుక, ఒక బ్రతుకు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు పారిజాతం కొడుకు. మరోవైపు రెస్టారెంట్లో కూర్చొని జరిగిన దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది జ్యోత్స్న.
దీప కి విడాకులు అయిపోయాయి కదా ఇక తన దారి తను చూసుకుంటుందిలే అని మనవరాలికి ధైర్యం చెప్తుంది పారిజాతం. అప్పుడే శౌర్య, దీపని తీసుకొని అదే రెస్టారెంట్ కి వచ్చిన కార్తీక్ ని చూసి షాక్ అవుతుంది జ్యోత్స్న. పారిజాతానికి కూడా చూపిస్తుంది. ఈమధ్య అన్నిటికి పార్టీలు చేసుకోవటం అలవాటైపోయింది కదా విడాకులు వచ్చినందుకు పార్టీ చేసుకుంటున్నట్లు ఉన్నారు అంటుంది పారిజాతం. మరోవైపు కార్తీక్ ఆర్డర్ పెట్టిన ఫుడ్ వస్తుంది, ఒక ప్లేట్ పాపకి ఇచ్చి ఒక ప్లేట్ దీపకి ఇస్తాడు కార్తీక్.
వద్దు, నేను మొహం కడుక్కొని వస్తాను అని చెప్పి వెళ్తుంది దీప. ఆమె ఏడుపుని గమనించిన కార్తీక్ ఆమె వెనకే వెళ్లి జరిగిన సంఘటన మీ కష్టాలకి ముగింపు, ఇక మీ కూతురు భవిష్యత్తు మీరు కోరుకుంటున్నట్లుగానే ఉంటుంది శౌర్య చదువు విషయంలో నా సాయం మీకు ఎప్పుడూ ఉంటుంది అని ఆమెకి ధైర్యం చెప్పి మళ్ళీ టేబుల్ దగ్గరికి తీసుకు వస్తాడు. పాపని ఇక్కడ వదిలేసి వాళ్ళిద్దరూ ఒంటరిగా అక్కడ కబుర్లు చెప్పుకోవటం ఏమిటి అని కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న.
టేబుల్ దగ్గరికి వచ్చిన కార్తీక్ వాళ్ళని చూసి నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు మళ్ళీ బూచాడు వచ్చి తీసుకు వెళ్ళిపోతేనో అని భయంగా అడుగుతుంది శౌర్య. ఇక నిన్ను భయపెట్టడానికి ఎవ్వరూ రారు, అమ్మని ప్రశ్నలు అడిగి విసిగించొద్దు, అమ్మ ఎలా చెప్తే అలా నడుచుకో అంటాడు కార్తీక్ ఇవన్నీ చెప్తున్నావు ఎందుకు, ఇకపై నువ్వు రావా అని ప్రశ్నిస్తుంది శౌర్య.
తరువాయి భాగంలో పారిజాతం కొడుకు చెంప పగలగొడుతుంది జ్యోత్స్న. అది చూసి షాక్ అవుతుంది పారిజాతం. తర్వాత కోపంగా ఇంటికి వచ్చిన జ్యోత్స్న దీప ఉంటున్న ఇంటికి తాళం వేస్తుంది. తాళం ఎందుకు వేసావు అని సుమిత్ర కూతుర్ని నిలదీస్తుంది. హోటల్లో ఫోటో చూపిస్తుంది జ్యోత్స్న. నేనే దాన్ని తీసుకొని రెస్టారెంట్ కి వెళ్ళమని చెప్పాను అంటుంది సుమిత్ర. దీపకి ఈ రేంజ్ ఎంకరేజ్మెంట్ ఇంట్లోనే ఉంటే ఇంక నాకు పెళ్లి ఎందుకు అవుతుంది, నీ ప్రాణాలు కాపాడిందని షెల్టర్ ఇచ్చావు, మొగుడితో గొడవలు అని విడాకులు ఇప్పించావు, ఇప్పుడు రెండు రోజులు అలా తిరిగి రండి అని బావని దీపతో పంపించేలాగా ఉన్నావు అంటుంది జ్యోత్స్న. కోపంతో రగిలిపోయిన సుమిత్ర కూతురిపై చేయి ఎత్తుతుంది కానీ దీప ని చూసి ఆగిపోతుంది.


Click it and Unblock the Notifications











