Karthika Deepam June 14th episode: తల్లిని చూసి అసూయ పడుతున్న కార్తీక్.. శౌర్య మనసు పాడు చేస్తున్న జ్యోత్స్న!
పుట్టినరోజు నాడు జ్యోత్స్న ని పెళ్లి చేసుకుంటాను అని కార్తీక్ చేత బలవంతంగా ప్రామిస్ చేయించుకుంటుంది పారిజాతం.తరువాత అలా ఎందుకు చేసావంటూ పారిజాతంపై కోప్పడతాడు కార్తీక్. రోడ్డుమీద యాక్సిడెంట్ చేసి గాయపడిన కావేరీ కూతుర్ని సేవ్ చేసి హాస్పిటల్ కి తీసుకు వెళ్తాడు కార్తీక్. హాస్పిటల్లో కూతుర్ని కొడుకుని ఒక దగ్గర చూసిన శ్రీధర్ కంగారు పడతాడు వాళ్లకి కనిపించకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 14 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 71వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
నన్ను చూసి ఎందుకు పాట ఆపేసావు అని అడుగుతాడు కార్తీక్. నేను పాడటం చూస్తే నువ్వు నవ్వుతావు అందుకే ఆపేసాను అంటుంది శౌర్య. ఆ మాటలకి నవ్వుతాడు కార్తీక్. ఏం పని మీద వచ్చారు అని అడుగుతుంది దీప. రేపు మీ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది ఆ విషయం మీకు చెప్పడానికి వచ్చాను అంటాడు కార్తీక్. పేరెంట్స్ మీటింగ్ అంటే ఏమిటి అని దీప అడిగితే ఆమెకి అర్థమయ్యేలాగా చెప్తాడు కార్తీక్. మీటింగ్ అని నీకు ఎలా తెలుసు అంటుంది శౌర్య. ఆరోజు స్కూల్లో నా నెంబర్ ఇచ్చాం కదా అందుకే నాకు మెసేజ్ పెడతారు.

ఇప్పుడు అమ్మ దగ్గర కూడా ఫోన్ ఉంది కదా రేపు అమ్మ నంబర్ స్కూల్లో ఇవ్వు అప్పుడు అమ్మ ఫోన్ కి మెసేజ్లు వస్తాయి అంటాడు కార్తీక్. అమ్మకి ఇంగ్లీష్ చదవడం రాదు, నేను ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అందుకే కొన్ని రోజులు నీ నంబరే ఉంచుతాను అంటుంది శౌర్య. అందుకు సరే అంటాడు కార్తీక్. శౌర్య అమ్మకి మాట్లాడటం రాదు అందుకే నువ్వు కూడా మాతో పేరెంట్స్ మీటింగ్ కి రా అని అడుగుతుంది. కానీ ఎక్కడ నర్సింహ మాటలు నిజం అయిపోతాయో అని దీప, కార్తీక్ ఇద్దరు ఇబ్బంది పడతారు. నేను తీసుకువెళ్తానులే అని కూతురికి చెప్తుంది దీప.
కార్తీక్ తో మాట్లాడుతూ నేను మీతో మాట్లాడాలి అని చెప్పి శౌర్య ని లోపలికి పంపించేస్తుంది. తర్వాత కార్తీక్ బయటికి వెళ్లడంతో దీప కూడా బయటకు వచ్చి మీతో రెండు విషయాలు మాట్లాడాలి అంటూ స్వప్న గురించి అడుగుతుంది. ఆమె నాకు ఏదో బంధువైనట్లు అలా అడుగుతున్నారు ఏంటి అంటాడు కార్తీక్. గత జన్మలో బంధం ఉంటేనే ఈ జన్మలో కలుస్తారు, ఆమె బాగోగులు కాస్త పట్టించుకోండి అని చెప్తుంది దీప. సరే అంటాడు కార్తీక్, రెండో విషయం ఏమిటి అని అడుగుతాడు.
మీకు జ్యోత్స్న ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా వీళ్ళందరూ మీకు పెళ్లి అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు అనుకుంటున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఎలాంటి సంబంధం లేదు మీకు ఇష్టం లేకపోతే ఆ విషయం జ్యోత్స్న కు చెప్పండి అంతేకానీ దూరం పెట్టకండి దానికి కారణం వేరే వాళ్ళు అనుకుని వాళ్ళని ఇబ్బంది పెడతారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది అనుకుంటాను అంటూ లోపలికి వెళ్ళిపోతుంది.

ఏమి కాదు ఆయన అలాగే అంటారు కానీ ఆయనకి నాకంటే నువ్వంటే నా ఇష్టం అంటుంది కాంచన. తర్వాత స్వప్న గురించి ఎంక్వయిరీ చేసి ఆమెతో వీడియో కాల్ మాట్లాడుతాను అంటుంది. అందుకు కంగారు పడతాడు శ్రీధర్, హెల్ప్ చేశావు కదా అక్కడ వరకు చాలు అందరిని తెచ్చి నెత్తి మీద పెట్టుకోవద్దు అంటూ చిరు కోపం ప్రదర్శిస్తాడు. భర్త ప్రవర్తనకి ఆశ్చర్యపోయినా సరే అంటుంది కాంచన. తర్వాత కార్తీక్ జ్యోత్స్న ని తీసుకొని బ్రేక్ ఫాస్ట్ కి రెస్టారెంట్ కి వెళ్తాను అని చెప్పటంతో ఆనందపడుతుంది, త్వరగా వెళ్ళు అని కొడుకుని పంపిస్తుంది.

మాతోపాటు రావడానికి మాకు ఎవరూ లేరు మేమే వెళ్తున్నాము అంటూ శౌర్య ని తీసుకుని వెళ్ళిపోతుంది దీప. తను అలా అంది కానీ నాకు ఎందుకో బావ వీళ్ళతో పాటు వెళ్తాడేమో అనుమానంగా ఉంది అనుకుంటుంది జ్యోత్స్న. అంతలోనే కార్తీక్ జ్యోత్స్న కి ఫోన్ చేసే బ్రేక్ ఫాస్ట్ కి రెస్టారెంట్ కి వెళ్దాము నువ్వు ఫ్రీ ఏ కదా అని అడుగుతాడు. కార్తీక్ అలా అడగటంతో ఆనందంతో షాక్ అవుతుంది జ్యోత్స్న. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











