Karthika Deepam August 15th episode: దీపకు విడాకులు ఇప్పించి బావతో పంపిస్తావా? నిలదీసిన జ్యోత్స్న
తనకి విడాకులు కావాలి, అర్జీ పెట్టమని జ్యోతితో చెప్తుంది దీప. కోర్టులో తనకి నర్సింహ కి పెళ్లి అవ్వలేదని చెప్తుంది శోభ. అయితే అదంతా అబద్ధమని, తన కొడుకు రెండో పెళ్లి చేసుకున్నాడని కోర్టులో చెప్పి అందరికీ షాకిస్తుంది అనసూయ. కోర్టులో దీప కేసు గెలుస్తుంది, తనని గెలిపించినందుకు అనసూయ కాళ్లు పట్టుకొని కృతజ్ఞతలు చెప్తుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 15 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 124వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
శౌర్యతో మాట్లాడుతూ ఆమెకి జాగ్రత్తలు చెప్తాడు కార్తీక్. ఎందుకు అలా చెప్తున్నావు నువ్వు మళ్ళీ రావా అని అడుగుతుంది శౌర్య. ఎందుకు రాను మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడూ విడిపోరు కదా అంటాడు కార్తీక్. నువ్వు అలా చెప్తుంటే మళ్ళీ రావేమో అనుకున్నాను అంటుంది శౌర్య.

వస్తాను కానీ మందులు వేసుకోవడానికి అమ్మని ఇబ్బంది పెట్టవద్దని, మందులు వేసుకున్న వెంటనే తనకి ఫోన్ చేయమని శౌర్య కి చెప్తాడు కార్తీక్. నీట్ గా తినలేక పోతున్న శౌర్యకి తనే తినిపిస్తాడు. ఇదంతా చూస్తున్న జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఆ సీన్ ని ఫోటో తీస్తుంది. మరోవైపు దీప కార్తీక్ తో మాట్లాడుతూ మేము వెళ్తాం బాబు అంటుంది. నేనూ వస్తాను, మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతాను అంటాడు కార్తీక్. వద్దని చెప్పి కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతుంది దీప. తర్వాత కార్తీక్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరోవైపు ఇంటికి వచ్చిన నర్సింహ దంపతులు అనసూయని పిలుస్తారు, ఆమె పలకక పోవడంతో ఇంకా రాలేనట్లు ఉంది, మనల్ని నిలువునా ముంచిన మీ అమ్మ ఇంక ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోను, ఆవిడ వచ్చేలోపే ఆవిడ బట్టలన్నీ బయటకి విసిరేస్తాను అంటుంది శోభ. అప్పుడే లోపలి నుంచి బట్టలు సర్దుకొని వచ్చిన అనసూయ నీకు అంత ఛాన్స్ ఇవ్వను నేనే వెళ్ళిపోతాను అంటుంది. కోర్టులో తనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు తల్లిని కోప్పడతాడు నర్సింహ.

ఇదంతా మీ ఇద్దరూ చేసుకున్నదే నేను కోర్టుకు వెళ్లద్దు అని చెప్పాను కానీ వినలేదు. అయినా కూతురు, కూతురు అంటున్నావు ఆ కూతుర్ని ఎప్పుడైనా చేరదీసావా, ప్రేమగా మాట్లాడావా కళ్ళు తిరిగి పడిపోయిన కూతురు కోసం కంగారు పడకుండా భుజాన వేసుకొని వచ్చేస్తున్నావు అలాంటి నువ్వు కూతుర్ని ప్రేమగా ఎలా పెంచుతావు, అని కొడుక్కి కోడలికి చివాట్లు పెట్టి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనసూయ. మా అమ్మతోనే నన్ను ఓడిపోయేటట్లు చేసావు కదా దీప అని కోపంతో రగిలిపోతాడు నర్సింహ. మరోవైపు ఇంకా హోటల్ లోనే ఉన్న జ్యోత్స్న ని ఆర్డర్ అడుగుతాడు బేరర్.
తను ఆర్డర్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు అంటూ తనే ఆర్డర్ ఇస్తుంది పారిజాతం. తర్వాత హాండ్స్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది. అప్పుడే పారిజాతం కొడుకు దాసు అనుకోకుండా ఆ హోటల్ కి వస్తాడు. చూసుకోకుండా బ్యారర్ కి డాష్ ఇవ్వటంతో బేరర్ చేతిలో ఉన్న వాటర్ జ్యోత్స్న మీద పడుతుంది. అప్పటికే కోపంలో ఉన్న జ్యోత్స్న బేరర్ చెంప పగలగొడుతుంది. తప్పు అతనిది కాదు నేనే చూసుకోకుండా అతనిని గుద్దేశాను అని దాసు అనటంతో అయితే నిన్నే కొట్టాలి అంటూ దాసు చెంప పగలగొడుతుంది జ్యోత్స్న.

ఇదంతా దూరం నుంచి చూసిన పారిజాతం నువ్వు నీ తండ్రిని కొట్టావే అంటూ మనవరాలుని తిట్టుకుంటుంది. దాసు కూడా నువ్వు చేసిన పనేమీ బాగోలేదు అని జ్యోత్స్న తో అంటాడు. అయినా జ్యోత్స్న పట్టించుకోకుండా దాసు మీద కోపడే అక్కడ నుంచి వెళ్లిపోమండటంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాసు. కోపంగా అక్కడికి వచ్చిన భారీజాతం నువ్వు కొట్టింది ఎవరినో తెలుసా అని కోపంగా అడుగుతుంది. ఎవరిని అంటుంది జ్యోత్స్న. నీకు నిజం చెప్పలేను అనుకుంటుంది పారిజాతం.
అయినా వైజాగ్ లో ఉండవలసిన దాసు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనుకుంటూ వచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అని జ్యోత్స్న ని అడుగుతుంది. వాడు ఎక్కడికి పోయాడో నాకేం తెలుసు అని కోపంగా అంటుంది జ్యోత్స్న. అప్పుడే వచ్చిన బేరర్ కి పారిజాతం క్షమాపణ చెప్పి కొంత డబ్బు టిప్పుగా తీస్తుంది. పారిజాతం ప్రవర్తనకి ఆశ్చర్య పోతుంది జ్యోత్స్న. నువ్వు ఎందుకు అంతగా రియాక్ట్ అవుతున్నావు అని పారిజాతాన్ని అడుగుతుంది.

నువ్వు కొట్టింది నీకన్నా వయసులో పెద్దవాడిని, నువ్వు కొంచెం ఆవేశం తగ్గించుకుంటే మంచిది అని మనవరాలు పై కోప్పడి ఆమెని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది పారిజాతం. జ్యోత్స్న ఇంటికి వచ్చిన తర్వాత దీప ఇంటికి తాళం వేస్తుంది. అది చూసిన సుమిత్ర ఎందుకు తాళం వేసావు అని అడుగుతుంది. జ్యోత్స్న హోటల్ లో తీసిన ఫోటో తల్లికి చూపిస్తుంది. శౌర్య కి ఆకలి వేస్తుంది అంటే నేనే హోటల్ కి తీసుకెళ్లమని చెప్పాను అంటుంది సుమిత్ర.
దీపకి ఈ రేంజ్ లో ఎంకరేజ్మెంట్ ఇంట్లోనే ఉంటే ఇంక నాకు పెళ్లి ఏమవుతుంది, రేపటి రోజున బావని తీసుకొని రెండు రోజులు అలా తిరిగి రమ్మని దీపతో నువ్వే చెప్పే లాగా ఉన్నావు అంటూ తల్లి పై ఫైర్ అవుతుంది జ్యోత్స్న. కూతురి మాటలకి కోపంతో రగిలిపోయి ఆమెని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది సుమిత్ర కానీ దీప ని చూసి ఆగిపోతుంది. అయితే దీప ని చూడని జ్యోత్స్న ఎందుకు మమ్మీ ఆగిపోయావు కొట్టు, నువ్వు కొట్టిన దెబ్బ దీప కొట్టిన దెబ్బ కన్నా గట్టిగా తగలదు అంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











