Karthika Deepam July 15th episode: మోసంతో ముహుర్తం పెడితే ఈ పెళ్లి జరగదు.. తేల్చేసిన కార్తీక్
కార్తీక్ ని ఫాలో అవుతూ ఉంటారు జ్యోత్స్న, పారిజాతం. నా వెంట పడొద్దని వాళ్ళని హెచ్చరిస్తాడు కార్తీక్. మరోవైపు రోడ్డు మీద వెళ్తున్న దీపని ఆపి ఆమె క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతాడు నర్సింహ. అక్కడే అతని చెంప పగలగొట్టి తన జోలికి రావద్దని హెచ్చరించి వచ్చేస్తుంది దీప. హౌస్ ఓనర్ కోరిక మేరకు గుడిలో ప్రసాదం చేయడం కోసం వెళ్లిన దీప సుమిత్ర కంట్లో పడుతుంది. మరోవైపు దారిలో కనిపించిన నర్సింహ తన గురించి తప్పుగా మాట్లాడితే అతని చెంప పగలగొడుతుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 15వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 97వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
తనకి పెళ్లి ఇష్టం లేదనే విషయం తల్లితో చెప్పాలనుకుంటాడు కార్తీక్ కానీ కాంచన కార్తీక్ మాట్లాడక ముందే అతని పెళ్లి గురించి తను ఎన్ని కలలు కంటుందో చెప్తుంది. ఈ నిశ్చితార్థం ఎలాగైనా ఆపాలి అంటాడు కార్తీక్. వ్యాపారాల వెంట పరిగెట్టింది చాలు,ఇకనైనా పెళ్లి చేసుకో,నాకు కాళ్లు ఉండి ఉంటే ఈ నిశ్చితార్థానికి అటు ఇటు తిరుగుతూ ఎంతో హడావుడి చేసే దాన్ని అంటూ కార్తీక్ పెళ్లి గురించి ఓవర్ ఎగ్జైట్ అవుతుంది కాంచన. తల్లి ఆనందాన్ని చూసి మనసులో మాట చెప్పలేక పోతాడు కార్తీక్.

మరోవైపు తన దగ్గరికి భోజనం తీసుకువచ్చిన తల్లితో కోపంగా మాట్లాడుతుంది శౌర్య. కార్తీక్ దగ్గరికి నువ్వు ఎలాగూ వెళ్ళనివ్వవు కనీసం దారిలో కనిపించినా కూడా మాట్లాడనివ్వలేదు అని బుంగమూతి పెట్టుకుంటుంది. వాళ్ళకి మనకి ఏంటి సంబంధం వాళ్ళ ఇంట్లోంచి మనం వచ్చేసాం కదా ఇక అక్కడ మన అవసరం లేదు మనం ఇక్కడే ఉంటాము.
ఇక్కడ స్కూల్లోనే నిన్ను జాయిన్ చేస్తాను అంటుంది దీప. నేను చదువుకోను అంటుంది శౌర్య. భోజనం చేయమన్నా కూడా చేయకుండా వెళ్ళిపోతుంది. దీని మాటలు వింటుంటే కార్తీక్ బాబు మాటలు వినేసి నట్లే అనిపిస్తుంది కానీ ఎలా అడగాలో అర్థం కావటం లేదు, మీరు చెప్పిన మాట మా జీవితాలు ఎలా మార్చేసాయో చూశారా కార్తీక్ బాబు అనుకుంటుంది దీప.

మరోవైపు దీపని రెచ్చగొట్టి ఆమె చేత చెంప దెబ్బలు తిని ఇంటికి వచ్చిన కొడుకుని కోప్పడుతుంది అనసూయ. కొన్ని రోజులు దాని జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది అంటుంది. అలా అయితే నేను మా చుట్టాల ఇంట్లోంచి ఎవరినైనా పిల్లని తెచ్చుకొని పెంచుకుంటాను అంటుంది శోభ. నా కొడుక్కి పుట్టిన కూతురు ఉండగా వేరే వాళ్ళు ఎందుకు అంటుంది అనసూయ. అప్పుడు కూడా దీప కూతుర్ని ఇవ్వకపోతే ఏం చేస్తాం అంటుంది శోభ.
అప్పుడు నేనే వెళ్ళి నా మనవరాల్ని తెచ్చుకుంటాను అంటుంది అనసూయ. భర్త మాట నిలబెట్టుకోకపోయినా అత్త మాట నిలబెట్టుకుంటుందేమో చూడాలి అంటుంది శోభ. మరోవైపు ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు సుమిత్ర ఆమె కుటుంబ సభ్యులు. మాటల్లో దీప గురించి అడుగుతాడు శివ నారాయణ. ఎంగేజ్మెంట్ కి రమ్మని చెప్పాను అంటుంది సుమిత్ర. నువ్వు చెప్పావు కదా మమ్మీ వస్తుందిలే అంటుంది జ్యోత్స్న. వస్తానని ఏమీ చెప్పలేదు అంటుంది దీప.

తను నా ఎంగేజ్మెంట్ కి ఉండాలి మమ్మీ ఈసారి ఎక్కడైనా కనిపిస్తే నాకు ఫోన్ చెయ్యు నేను తనతో మాట్లాడతాను అంటుంది జ్యోత్స్న. మనసులో మాత్రం అసలు నేను విన్నది నిజమేనా, ఏం జరుగుతుందో నిజానిజాలు తెలుసుకోవాలి అనుకుంటుంది. మరోవైపు కూతురికి భోజనం తినిపిస్తూ కార్తీక్ నిశ్చితార్థం గురించి చెప్తుంది దీప. తర్వాత హాస్పిటల్ ఫీజు కోసం తన గాజులు కూడా ఇచ్చేసినట్లు చెప్తుంది. నిశ్చితార్థానికి అమ్మమ్మ మనల్ని పిలవలేదా అంటుంది శౌర్య.
పిలవలేదు అని అబద్ధం చెప్తుంది దీప. నువ్వు అబద్దం చెప్తున్నావు అంటుంది శౌర్య. మరోవైపు నిశ్చితార్ధాన్ని ఆపే ఆలోచనలో ఉన్న కార్తీక్ జ్యోత్స్న తో ఈ నిశ్చితార్థం ఇష్టం లేదని చెప్పాలి అనుకుంటాడు కానీ ఈ పెళ్లి వద్దన్న మరుక్షణం నేను చచ్చిపోతాను అన్న జ్యోత్స్న మాటలు విని ఆగిపోతాడు. ఏ ఒక్కరి కంటిలోనే కన్నీటి చుక్క రాకుండా ఈ పెళ్లి ఎలా ఆపాలి అని ఆలోచిస్తాడు కార్తీక్ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











