Karthika Deepam Serial: భయంతో కార్తీక్ ని హెల్ప్ అడిగిన శౌర్య..జ్యోత్స్న ముందు దోషుల్లా నిలబడ్డ కార్తీక్,దీప!

రోడ్డుమీద యాక్సిడెంట్ చేసి గాయపడిన కావేరీ కూతుర్ని సేవ్ చేసి హాస్పిటల్ కి తీసుకు వెళ్తాడు కార్తీక్. హాస్పిటల్లో కూతుర్ని కొడుకుని ఒక దగ్గర చూసిన శ్రీధర్ కంగారు పడతాడు వాళ్లకి కనిపించకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత స్వప్నతో వీడియో కాల్ మాట్లాడతాను అంటుంది కాంచన. అందుకు కంగారుపడిన శ్రీధర్ వద్దంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్ 15 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 72వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

కార్తీక్ జ్యోత్స్న కి ఫోన్ చేసి నీతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయాలనుకుంటున్నాను బయటికి వెళ్దాం నువ్వు ఫ్రీ ఏ కదా అని అడుగుతాడు. నేను నీకోసం ఎప్పుడూ ఫ్రీగానే ఉంటాను బావ అంటుంది జ్యోత్స్న. 15 నిమిషాల్లో వస్తాను అంటాడు కార్తీక్. సరే అని ఫోన్ పెట్టేస్తుంది జ్యోత్స్న. నేను ఏదో అనుకుంటే బావ ఇలా సర్ప్రైజ్ ఇచ్చాడేంటి అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది. మరోవైపు దీపతో మీటింగ్ కు వచ్చిన శౌర్యని మీ ఫాదర్ రాలేదా అనిఅడుగుతాడు ఒక ఫ్రెండ్.

Karthika Deepam 2 Serial 15th June 2024 Episode Number 72 Here is full story

ఊరు వెళ్లారు అని చెప్తుంది శౌర్య. లోపల మీటింగ్ లో రైమ్స్ అడుగుతారంట అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫ్రెండ్. ఆ మాటలకి శౌర్య కంగారు పడుతుంది. వెంటనే దీప దగ్గర ఫోన్ తీసుకొని కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావు అంటుంది దీప. లోపల రైమ్స్ అడుగుతారంట నాకు కంగారుగా ఉంది అందుకే కార్తిక్ కి ఫోన్ చేస్తున్నాను అంటుంది శౌర్య. ఫోన్ లాక్కొని కట్ చేసేస్తుంది దీప.

నేనున్నాను కదా చూసుకుంటాను అంటుంది. నువ్వు వస్తే అడ్మిషనే ఇవ్వలేదు, అలాంటిది ఇప్పుడు వాళ్లు నిన్ను ఏమైనా అంటే సమాధానం చెప్పలేవు. కార్తీక్ కి అయితే అన్నీ తెలుసు అంటుంది శౌర్య. మరోవైపు కార్తీక్ ఫోన్ చేసి కట్ చేశారు ఏమిటి అనుకుంటు రిటర్న్ కాల్ చేస్తాడు. అప్పుడు శౌర్య జరిగిందంతా చెప్పి నాకు భయంగా ఉంది నువ్వు రావా అని రిక్వెస్ట్ చేస్తుంది. సరే అని ఫోన్ పెట్టేస్తాడు కార్తీక్.

Karthika Deepam 2 Serial 15th June 2024 Episode Number 72 Here is full story

జ్యోత్స్న తో ఇంటికి వస్తాను అని చెప్పాను ఇప్పుడు ఎటువైపు వెళ్ళటం అని ఆలోచనలో పడతాడు. మళ్ళీ తనే ముందు శౌర్య దగ్గరికి వెళ్లి తనికి ధైర్యం చెప్పి అప్పుడు జ్యోత్స్న దగ్గరికి వెళ్తాను అనుకుంటూ స్కూల్ కి వచ్చి శౌర్యకి ధైర్యం చెప్తాడు. కానీ ఇంకా భయం తగ్గని శౌర్య నాతో పాటు లోపలికి రా కార్తీక్ నాకు చాలా భయంగా ఉంది మీ ఫ్రెండ్ కి ఆ మాత్రం సాయం చేయవా అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. దీప వెళ్ళిపోమని చెప్పినా శౌర్య మాట కాదనలేక తనతో పాటు వెళ్తాడు కార్తీక్. వాళ్ళ ముగ్గురిని ఫోటో తీసి జ్యోత్స్న కి పంపిస్తుంది శ్రీవాణి.

అదే సమయంలో ఇంటిదగ్గర జ్యోత్స్న బావతో కలిసి బ్రేక్ ఫాస్ట్ కి బయటికి వెళ్తున్నాను అని ఆనందంగా తల్లితో చెప్తుంది. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలి, ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకు జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర. ఆ తర్వాత శ్రీవాణి పంపించిన ఫోటో చూసి షాక్ అయిపోతుంది, కోపంతో రగిలిపోతూ స్కూల్ కి బయలుదేరుతుంది. అక్కడ జ్యోత్స్న ని చూసి కంగారు పడతారు దీప వాళ్ళు.

ఇప్పుడు ఏం గొడవ చేస్తుందో అనుకుంటూ దోషుల్లా నిలబడతారు. జ్యోత్స్న ప్రిన్సిపాల్ దగ్గరికి వచ్చి మా బావ చాలా బిజీ ఇలాంటి మీటింగ్స్ కోసం అతని టైం వేస్ట్ చేయకండి, నా నెంబర్ తీసుకోండి ఇకపై శౌర్య రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను అంటుంది. ఆ తర్వాత నెంబర్ చేంజ్ చేయమని శ్రీ వాణికి చెప్తుంది. తర్వాత కార్తీక్ తో మాట్లాడుతూ బ్రేక్ ఫాస్ట్ ప్లాన్ చేస్తే నేను హోటల్లో అనుకున్నాను స్కూల్లో అని తెలియదు అని వెటకారంగా మాట్లాడుతుంది.

Karthika Deepam 2 Serial 15th June 2024 Episode Number 72 Here is full story

దీపతో మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి కార్తీక్ ని తీసుకుని వెళ్ళిపోతుంది. తరువాత హోటల్ కి వెళ్ళిన దీపతో కడియం బాబాయ్ మాట్లాడుతూ ఉండగా జ్యోత్స్న కార్తీక్ ని తీసుకొని అక్కడికి వస్తుంది. జ్యోత్స్న కార్తీక్ మరదలు అని తెలుసుకున్న బాబాయ్ చాలా సంతోషం, మీరు కూడా మా దీపమ్మకి కార్తీక్ బాబు లాగే సాయం చేయండి అంటూ ఉండగానే అతని మాటల్ని మధ్యలో ఆపేసి పంపించేస్తుంది దీప.

అతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు చెప్పనీ, లేదంటే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు అని వెటకారంగా మాట్లాడుతుంది జ్యోత్స్న. ఇది వాళ్ళకి బిజినెస్ టైం మనం ఇక్కడి నుంచి వెళ్దాం పద అంటాడు కార్తీక్. నేను టిఫిన్ చేయడానికి వచ్చాను అంటుంది జ్యోత్స్న. నీకు ఏం కావాలి అని జ్యోత్స్న ని అడుగుతుంది దీప. మా బావ కావాలి అంటుంది జ్యోత్స్న. కార్తీక్, దీప ఇద్దరూ షాక్ అవుతారు తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X