Karthika Deepam August 16th episode: జ్యోత్స్న విషయంలో పారిజాతం తప్పు‌గా.. కార్తీక్ ప్రవర్తనపై శ్రీధర్ అనుమానం

కోర్టులో తనకి నర్సింహ కి పెళ్లి అవ్వలేదని చెప్తుంది శోభ. అయితే అదంతా అబద్ధమని, తన కొడుకు రెండో పెళ్లి చేసుకున్నాడని కోర్టులో చెప్పి అందరికీ షాకిస్తుంది అనసూయ. కోర్టులో దీప కేసు గెలుస్తుంది, తనని గెలిపించినందుకు అనసూయ కాళ్లు పట్టుకొని కృతజ్ఞతలు చెప్తుంది దీప. మరోవైపు రెస్టారెంట్ లో తన కన్న తండ్రి అని తెలియకుండానే దాసు ని చెంప దెబ్బ కొడుతుంది జ్యోత్స్న. అది చూసిన పారిజాతం కోపంతో రగిలిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 16 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 125వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

ప్రాణం కాపాడిందని షెల్టర్ ఇచ్చావు, భర్తతో గొడవలు అంటే విడాకులు ఇప్పించావు, ఇప్పుడు ఇన్నాళ్లు కష్టపడింది అలా రెండు రోజులు తిరిగి రమ్మని దీప ని బావతో పంపించేలాగా ఉన్నావు అని తల్లితో అంటుంది జ్యోత్స్న. ఆ మాటలకి కోపంతో కూతురి పై చెయ్యెత్తి మధ్యలోనే ఆపేస్తుంది సుమిత్ర. ఆగిపోయావేం మమ్మీ కొట్టు, నువ్వు కొట్టిన దెబ్బ దీప కొట్టిన దెబ్బ కన్నా గట్టిగా తగలదు అంటుంది జ్యోత్స్న. తర్వాత దీప ని చూసి నిన్ను చూసి మా మమ్మీ ఆగిపోయిందా అంటుంది జ్యోత్స్న. సుమిత్ర కోపంగా కూతుర్ని లోపలికి వెళ్ళమంటుంది.

Karthika Deepam 2 Serial 16th August 2024 Episode Number 125 Here is full story

వాళ్లు ఎక్కడైనా తిరగవచ్చు కానీ నేను మాత్రం అడగకూడదా అంటుంది జ్యోత్స్న. ఎందుకు గొడవ పెద్దది చేస్తావు అంటుంది పారిజాతం. అసలు అది అలా తయారవ్వటానికి కారణం మీరే ముందు మిమ్మల్ని అనాలి అంటుంది సుమిత్ర. అవును నీ కూతురు విషయంలో నేను తప్పు చేశాను అని కోడలితో చెప్పి మనవరాలిని కోప్పడుతూ అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది పారిజాతం. సుమిత్ర దీపతో జ్యోత్స్న మాటలు పట్టించుకోవద్దు అని చెప్తుంది. నాకు ఈ మాటలు అలవాటైపోయాయి, అయినా మెల్లగా జ్యోత్స్న కూడా నా గురించి అర్థం చేసుకుంటుంది అంటుంది దీప. తర్వాత దీప మాటలలో శౌర్య అలిగిందని తెలుసుకొని ఆమె అలక తీర్చే ప్రయత్నం చేస్తుంది సుమిత్ర.

తన సంగతి నేను చూసుకుంటాను అంటుంది దీప. సరే తలారా స్నానం చేసి దీపం పెట్టుకో అంతా మంచే జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది సుమిత్ర. మరోవైపు జ్యోత్స్న పంపించిన ఫోటో భార్యకి చూపించి కొడుకుని తిడుతూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే వచ్చిన కార్తీక్ అనాలనుకున్నదేదో సూటిగా అనండి అంటాడు. జ్యోత్స్న పంపించిన ఫోటో చూపిస్తాడు శ్రీధర్. నన్ను ఫాలో అవుతున్నారా అంటాడు కార్తీక్. తర్వాత జ్యోత్స్న పంపించిందని తండ్రి మాటలలో అర్థం చేసుకొని తనకి మరి ఇంత అనుమానం పనికిరాదు అంటాడు.

Karthika Deepam 2 Serial 16th August 2024 Episode Number 125 Here is full story

అన్నీ తెలిసిన నేనే నిన్ను అనుమానిస్తున్నాను అలాంటిది తను నిన్ను అనుమానించడంలో తప్పులేదు అంటాడు శ్రీధర్. అసలు వాళ్ళని రెస్టారెంట్ కి ఎందుకు తీసుకు వెళ్లావు అంటూ కొడుకుతో గొడవ పడతాడు శ్రీధర్. దీప ఏం మానవత్వంతో అత్తని కాపాడిందో అదే మానవత్వంతో సౌర్య ని నేను చేరదీశాను అని చెప్పి బయట వాళ్ళు బాగానే అర్థం చేసుకుంటున్నారు ఇంట్లో వాళ్లే బయట వాళ్లకంట దారుణంగా తయారయ్యారు అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్.

వీడి ప్రవర్తన ఏదో తేడాగా ఉంది పెళ్లి అయ్యే వరకు వీడికి దీప ని దూరంగా ఉంచాలి, ముందు అవుట్ హౌస్ ఖాళీ చేయించేస్తే దరిద్రం వదిలిపోతుంది అనుకుంటాడు శ్రీధర్. మరోవైపు తన బైక్ మీద ఓ వ్యక్తి కూర్చోవడంతో అతనితో గొడవ పడుతుంది స్వప్న. ఇది నా లవర్ బైక్, నా ఇష్టం అంటాడు ఆ వ్యక్తి. ఇన్నాళ్ళకి గుర్తొచ్చిందా అంటూ మళ్ళీ అతనితో గొడవ పడుతుంది స్వప్న.

Karthika Deepam 2 Serial 16th August 2024 Episode Number 125 Here is full story

ఇక్కడే జాబ్ వచ్చింది నేను ఇకమీదట ఇక్కడే ఉంటాను అంటాడు స్వప్న లవర్ కాశీ. అంటే నాకోసం కాదన్నమాట అని మళ్ళీ గొడవ పడుతుంది స్వప్న. సరే అవన్నీ మనం రోడ్డు మీద కాదు ఏదైనా రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకుందాం అని కాశీ అనటంతో రెస్టారెంట్ కి వెళతారు స్వప్న కాశీ. మరోవైపు తండ్రి ఫోటో ముందు దీపం పెట్టి దండం పెట్టుకుంటుంది దీప. నర్సింహ బాధ వదిలిపోయింది అని తండ్రితో చెప్పుకుంటుంది. తాతయ్య ఫోటో ముందు అలా ఉండిపోయావేంటి అంటుంది శౌర్య.

తాతయ్యతో మనసులో మాట్లాడుతున్నాను అంటుంది దీప. మనసులో మాట్లాడుకుంటే తాతయ్య వింటాడా అయితే నేను కూడా తాతయ్యకి నా మనసులో మాట చెప్తాను అంటూ కార్తీక్ తనతో ఎప్పుడూ ఉండాలని, నర్సింహ తనకి వద్దని కోరుకుంటుంది శౌర్య. తను నిన్ను ఏం కోరుకొని ఉంటుందో నాకు తెలుసు, కానీ ఈ స్నేహాలు ఎన్నో రోజులు ఉండవు నాన్న, నేను గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అందుకు నీలాంటి ఒక సాయం కావాలి నాన్న అని కోరుకుంటుంది దీప.

దాసు అప్పుడే పారిజాతం ఇంటికి వస్తాడు. అదే సమయంలో పారిజాతం కూడా కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కొడుకుని చూసిన పారిజాతం బాగా ఎమోషనల్ అవుతుంది, ఇన్నాళ్ళు ఏమైపోయావు, ఫోన్ కూడా చేయటం మానేశావు, ఈ అమ్మని వద్దనుకున్నావా అని అభిమానంగా అడుగుతుంది. ఉన్నట్టుండి ఫోన్ చేయకుండా ఇలా వచ్చావ్ ఏంటి అని అనుమానంగా అడుగుతుంది. నా కూతురు కోసం వచ్చాను అంటాడు దాసు.

Karthika Deepam 2 Serial 16th August 2024 Episode Number 125 Here is full story

ఒక్కసారిగా షాక్ అవుతుంది పారిజాతం. వీడికి కూతురు చనిపోయింది అని చెప్పాను కదా, పిల్లల్ని మార్చేసిన విషయం వీడికి తెలియదు కదా అనుకుంటుంది. నువ్వు పిల్లలు మార్చేసిన విషయం నాకు తెలుసు అమ్మ, అంతేకాదు దశరథ్ కూతురు కూడా బ్రతికే ఉంది అనుకుంటాడు దాసు. నీ కూతురు చనిపోయింది కదా అంటుంది పారిజాతం. నా కూతురు లోపల ఉంది అంటాడు దాసు. ఆ మాటలకి మరింత షాక్ అవుతుంది పారిజాతం. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X