Karthika Deepam Aug17th episode:దాసుని దారుణంగా అవమానించిన శివ నారాయణ..భర్త మీద పగతో రగిలిపోతున్న పారిజాతం!

కోర్టులో కేసు గెలిచిన దీప తనని గెలిపించినందుకు అనసూయ కాళ్లు పట్టుకొని కృతజ్ఞతలు చెప్తుంది. మరోవైపు రెస్టారెంట్ లో తన కన్న తండ్రి అని తెలియకుండానే దాసు ని చెంప దెబ్బ కొడుతుంది జ్యోత్స్న. అది చూసిన పారిజాతం కోపంతో రగిలిపోతుంది. జ్యోత్స్న పంపించిన ఫోటో చూసి కొడుకుతో గొడవ పడతాడు శ్రీధర్. కూతుర్ని చూడటం కోసం పారిజాతం ఇంటికి వస్తాడు దాసు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 17 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 126వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

నా కూతురు ఇంట్లోనే ఉందని నాకు తెలుసు, అంతే కాదు దశరథ్ అన్నయ్య కూతురు కూడా బ్రతికే ఉంది అనుకుంటాడు దాసు. నీ కూతురు చనిపోయింది కదా అంటుంది పారిజాతం. లేదు నా కూతురు లోపల ఉంది అంటూ ఇంట్లోకి వెళ్తాడు దాసు.కంగారుగా అతని వెనుక వెళ్తుంది పారిజాతం. నీ కూతురు ఇక్కడ ఉండటం ఏమిటి అంటుంది. దశరధ్ అన్నయ్య నా కూతురు నీ మనవరాలే అని చెప్పాడు కదమ్మా, అప్పుడు నీ మనవరాలు నాకు కూతురే కదా అవుతుంది తనకి జ్యోత్స్న అని కూడా పేరు పెట్టారు కదా అని జ్యోత్స్న ని పిలుస్తాడు దాసు. అంతేనా, నిజం నీకు తెలుసేమో అనుకున్నాను అనుకుంటుంది పారిజాతం.

Karthika Deepam 2 Serial 17th August 2024 Episode Number 126 Here is full story

నాకు నిజం తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది అని తెలుసు అందుకే అబద్ధం చెప్పాను అనుకుంటాడు దాసు. అంతలోనే జ్యోత్స్న కిందికి వస్తుంది. దాసు, జ్యోత్స్న ఒకరిని చూసి ఒకరు షాక్ అవుతారు. అంతలోనే దశరథ్ దంపతులు కిందికి వస్తారు. దశరథ్ దాసుని పలకరిస్తాడు, సుమిత్ర భోజనం చేద్దాం పదమంటుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలియక తికమకపడుతుంది జ్యోత్స్న. మాటల్లో పారిజాతం కొడుకు దాసు అని తెలుసుకుంటుంది.

మరి రెస్టారెంట్లో నాకు చెప్పలేదు ఏంటి అని అనుకుంటుంది జ్యోత్స్న. కూతురి అయోమయాన్ని గమనించిన దశరథ్ దాసుని కూతురికి బాబాయి అంటూ పరిచయం చేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శివ నారాయణ ఎవరికి బాబాయి అంటూ ఫైర్ అవుతాడు. నిన్ను జీవితంలో ఈ గడప తొక్కొద్దని చెప్పాను కదా అని దాసుతో అంటాడు. మీ అందరినీ చూడాలనిపించింది అందుకే వచ్చాను అంటాడు దాసు. అతడిని వెళ్లిపొమ్మని చీదరించుకుంటాడు శివ నారాయణ.

కొడుకుని అంతలా అవమానిస్తున్న భర్తని అసహ్యించుకుంటుంది పారిజాతం. ఏం అవసరం పడి వచ్చాడో ఏంటో నేను మాట్లాడి పంపిస్తాను అంటాడు దశరథ్. భోజనం పెట్టి పంపిద్దాం అంటుంది సుమిత్ర. అలా అయితే గేటు బయట భోజనం పెట్టమని కోడలితో చెప్తాడు శివ నారాయణ. ఆ మాటలకి మరింత బాధపడుతుంది పారిజాతం. వద్దులెండి నేను వెళ్ళిపోతాను అంటూ దాసు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

కొడుకు కోడల్ని మనవరాల్ని అక్కడ నుంచి పంపించేసిన తర్వాత భార్యతో మళ్ళీ వాడు ఇక్కడికి రాకూడదు వచ్చాడంటే ఒంటరిగా వెళ్లడు, తల్లితో సహా వెళ్తాడు జాగ్రత్త అని పారిజాతాన్ని హెచ్చరిస్తాడు శివ నారాయణ. బయటికి వచ్చిన దాసు నా కూతురు పద్ధతిగా పెరుగుతుంది అనుకున్నాను కానీ పెంపకంలో ఎక్కడో తేడా జరిగింది, ఇంతకీ దశరథ అన్నయ్య కూతురు ఎక్కడ ఉందో అనుకుంటాడు దాసు. అంతలో అవుట్ హౌస్ లో ఆడుకుంటున్న సౌర్యని చూసి అటువైపు వెళ్ళబోతాడు.

పారిజాతం అతడిని ఆపి అక్కడ వంట మనిషి ఉంటుంది అని చెప్పి అక్కడినుంచి తీసుకుపోతుంది. తర్వాత కొడుకుతో మాట్లాడుతూ నన్ను క్షమించు నీకు లోపల అంత అవమానం జరుగుతున్న ఏమి మాట్లాడలేకపోయాను అంటుంది. నా కూతురి కోసమే నువ్వు మౌనంగా ఉండి పోయావని నాకు తెలుసు అనుకుంటాడు దాసు. నా కూతురు నన్ను కొట్టింది అమ్మ అని బాధగాచెప్తాడు,కూతురు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు.

పారిజాతం అతని ఫోన్ నెంబర్ ఇమ్మని అడిగినా ఇవ్వడు, నా మనవడు ఎలా ఉన్నాడు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటూ పారిజాతం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు దాసు. వెళ్ళిపోతున్న కొడుకుని చూస్తూ బాధపడుతుంది పారిజాతం. తన కొడుక్కి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు భర్త మీద పగ పెంచుకుంటుంది నీ కుటుంబాన్ని ఇంతకింత నాశనం చేస్తాను అనుకుంటుంది.

మరోవైపు కూతురు ఎవరితోనో మాట్లాడ్డానికి గమనించిన కావేరి ఆమె లేనప్పుడు తను ఫోన్ చెక్ చేస్తుంది. అది గమనించిన స్వప్న నన్ను అనుమానిస్తున్నావా అంటుంది. నీ వయసు అలాంటిది అంటుంది కావేరి. నేను అంత అమాయకురాలని కాదు అంటుంది స్వప్న. నేను కూడా అలాగే అనుకున్నాను కానీ పెళ్లయిన తర్వాత తెలిసింది నా భర్తకు ముందే పెళ్లయిందని. అయినా ప్రేమించిన వాడిని వదులుకోలేక,నిజం నీకు చెప్పలేక బాధపడుతున్నాను అనుకుంటుంది కావేరి.

నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని కూతుర్ని అడుగుతుంది. కాశీకి ఉద్యోగం రాకముందే చెప్పటం ఎందుకు అనుకున్న స్వప్న అలాంటిది ఏమైనా ఉంటే నేనే చెప్తాను, నువ్వు తల దించుకునే పని ఎప్పటికి చెయ్యను అని చెప్పి తల్లిదగ్గర ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది ఎవరినో ఇష్టపడుతున్నట్లుగా ఉంది ముందు ఈ విషయం ఆయనతో చెప్పాలి అనుకుంటుంది కావేరి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X