Karthika Deepam July 17th episode: నిజం చెప్పాలని కార్తీక్.. శౌర్యని నర్సింహ ఎత్తుకుపోయే ప్రయత్నం!

రోడ్డు మీద వెళ్తున్న దీపని ఆపి ఆమె క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతాడు నర్సింహ. అక్కడే అతని చెంప పగలగొట్టి తన జోలికి రావద్దని హెచ్చరించి వచ్చేస్తుంది దీప. హౌస్ ఓనర్ కోరిక మేరకు గుడిలో ప్రసాదం చేయడం కోసం వెళ్లిన దీప సుమిత్ర కంట్లో పడుతుంది. మరోవైపు దారిలో కనిపించిన నర్సింహ తన గురించి తప్పుగా మాట్లాడితే అతని చెంప పగలగొడుతుంది దీప. మరోవైపు జ్యోత్స్న దీప కళ్ళ ముందే నిశ్చితార్థం జరగాలి ఎలాగైనా దీప ని తీసుకురమ్మని పారిజాతానికి చెప్తుంది ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 17వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 98వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

ఈ నిశ్చితార్థం ఆపేయటానికి ఏం చేయాలి, నా మనసులో మాటని ఎవరు అర్థం చేసుకుంటారు. అసలు ఈ విషయం ముందే చెప్పవలసింది కానీ కుటుంబం కోసం ఆలోచించాను. ఆరోజు ఏదో మంచి పని చేస్తున్నాను అనుకున్నాను కానీ ఈరోజు నిద్రలేని రాత్రికి గురవుతాను అనుకోలేదు ఇప్పుడు నా బాధ గురించి ఎవరికి చెప్పుకోవాలి అని ఆలోచిస్తాడు కార్తీక్. మరోవైపు ఇటుకలతో ఇల్లు కడుతూ ఉంటుంది శౌర్య. ఏం చేస్తున్నావు అంటుంది దీప. మనకి సొంతిల్లు లేదు కదా అందుకే ఇల్లు కడుతున్నాను అంటుంది శౌర్య. మన ఊర్లో ఇల్లు ఉంది కదా అంటుంది దీప. కానీ నువ్వు అక్కడ ఉంచలేదు కదా..

Karthika Deepam 2 Serial 17th July 2024 Episode Number 98 Here is full story

నానమ్మ అన్నట్లుగా నువ్వు పిల్లి పిల్లల్ని మూడిళ్లు తిప్పినట్లుగా తిప్పుతున్నావు అంటుంది శౌర్య. ఈ ఊరికి వచ్చాక ముదురు కబుర్లు బాగా నేర్చుకున్నావు అని శౌర్య ని మందలిస్తుంది దీప.వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఒక కారు అటు గా వెళ్తూ ఉండటంతో ఆ కారు వైపు ఆశగా చూస్తుంది శౌర్య. కార్తీక్ కారు కూడా ఇలాగే సౌండ్ వస్తుంది అమ్మ, కార్తీక్ ఏమో అనుకున్నాను అంటుంది. మన ఇంటికి ఎవరూ రారు వచ్చే వాళ్లే అయితే మనకోసం ఇప్పటికే వచ్చేవారు, రాలేదంటే వాళ్లు మనల్ని మర్చిపోయినట్లే అంటుంది దీప.

Karthika Deepam 2 Serial 17th July 2024 Episode Number 98 Here is full story

బాధగా శౌర్య లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడే ఉంటే నీకు అస్తమానం కార్తీక్ బాబు గుర్తొస్తారు అందుకే మన ఊరు వెళ్ళిపోదాము, అప్పుల వాళ్ళు వస్తే నర్సింహా ఇల్లు తెలుసు కాబట్టి అతని అడ్రస్ ఇచ్చేస్తాను అనుకుంటుంది దీప. మరోవైపు ఏదో లిస్టు రాసుకుంటున్న తల్లి దగ్గరికి వస్తాడు కార్తీక్. నాకు హెల్ప్ చేయు అంటుంది కాంచన. ఏంటా లిస్టు అంటాడు కార్తీక్. పెళ్లి అంటే ఎన్ని పనులు ఉంటాయి నేను కదలడం లేదు కానీ మనసు మాత్రం ఇల్లంతా తిరిగేస్తోంది అని ఆనందంగా చెప్తుంది కాంచన.

నాకు చిన్న పని ఉంది అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అంటాడు కార్తీక్. మనసులో ఈ నిశ్చితార్థం ఆపేయటానికే అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనుకుంటాడు. నన్ను ఆశీర్వదించు అంటూ తల్లి కాళ్ళకి దండం పెడతాడు కార్తీక్. నువ్వు మనసులో ఏదైతే కోరుకుంటున్నావో అది జరగాలి అని ఆశీర్వదిస్తుంది కాంచన. ఇప్పుడు ఆశీర్వదిస్తున్నావ్ కానీ తర్వాత నువ్వే నన్ను తిట్టుకుంటావు అని మనసులో అనుకుంటాడు కార్తీక్.

Karthika Deepam 2 Serial 17th July 2024 Episode Number 98 Here is full story

మరోవైపు దీప బయటికి వెళ్తున్నాను గంటలో వచ్చేస్తాను నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు అని శౌర్య తో చెప్పి బయటకు వెళుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ కార్తీక్ పేరు వైపు చూస్తుంది. మరోవైపు ఫ్రెండ్స్ తో కలిసి ఇంటి ముందు ఆడుకుంటుంది జ్యోత్స్న. అప్పుడే కార్తీక్ వస్తాడు. వాళ్లతో పాటు జాయిన్ అవ్వమంటారు ఫ్రెండ్స్. లేదు నేను అత్తయ్యతో మాట్లాడాలి అంటాడు కార్తీక్.

అమ్మ లేదు అంటుంది జ్యోత్స్న. ఎక్కడికి వెళ్లిందో తెలియదు అంటుంది. ఏదైనా అర్జెంటు మేటరా అని కూడా అడుగుతుంది అవును అర్జెంట్ నా జీవితం గురించి మాట్లాడాలి అంటాడు కార్తీక్. మీ బావ నిన్ను భలే ఆట పట్టిస్తున్నాడు అంటారు పక్కన ఉన్న ఫ్రెండ్స్. నేనేం మాట్లాడుతున్నాను వీళ్ళేం అర్థం చేసుకున్నారు అనుకుంటాడు కార్తీక్. తనతోపాటు జ్యోత్స్న ఆడటానికి రమ్మంటే నేను లోపల వెయిట్ చేస్తాను అని వెళ్ళిపోతాడు కార్తీక్.

మరోవైపు ఇంటికి వచ్చిన దీపకి శౌర్య కనిపించకపోవడంతో కంగారుపడుతుంది. కార్తీక్ బాబు కోసం వెతుక్కుంటూ వెళ్లిపోయిందేమో అని వెతకడం ప్రారంభిస్తుంది. మరోవైపు శౌర్య దారిలో కనిపించిన వారందరినీ కార్తీక్ ఇల్లు తెలుసా అని అడుగుతూ ఉంటుంది. అదే సమయంలో నర్సింహ కంట్లో పడుతుంది శౌర్య. అదే సమయంలో శౌర్య కూడా నర్సింహ ని చూసి భయంతో పారిపోయి ఒకచోట దాక్కుంటుంది.

ఈరోజు ఎలాగైనా తనని వెతికి ఇంటికి తీసుకువెళ్లాలి అనుకుంటాడు నర్సింహ కానీ ఎవరో ఫోన్ చేయటంతో ఇప్పుడే వస్తున్నాను సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతడు వెళ్ళిపోవడం చూసి కార్తీక్ కోసం భయంతో ఏడుస్తుంది శౌర్య. మరోవైపు శౌర్య ని వెతుకుతున్న దీప కూతురు కోసం రోడ్డు మీద కనిపించిన ప్రతి వారిని అడుగుతూ ఉంటుంది, బాధతో ఏడుస్తుంది తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X