Karthika Deepam June 17th episode: మాయమాటలతో కూతుర్ని శ్రీధర్ మోసం.. నడిరోడ్డుపై కార్తీక్, జ్య్నోత్స గొడవ!
హాస్పిటల్లో కూతుర్ని కొడుకుని ఒక దగ్గర చూసిన శ్రీధర్ కంగారు పడతాడు, వాళ్లకి కనిపించకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత స్వప్నతో వీడియో కాల్ మాట్లాడతాను అంటుంది కాంచన. అందుకు కంగారుపడిన శ్రీధర్ వద్దంటాడు. జ్యోత్స్న ని బ్రేక్ ఫాస్ట్ కి తీసుకువెళ్తానని చెప్పిన కార్తీక్ శౌర్య దగ్గరికి వెళ్లడంతో కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్17 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 73వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
నేను కూడా ఇకమీదట ఇక్కడికి రెగ్యులర్ గా వస్తూ ఉంటాను, స్కూల్లో శౌర్య రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు ఇక్కడ కూడా నీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను, అప్పుడప్పుడు వచ్చి నీ యోగక్షేమాలు తెలుసుకుంటాను అని వెటకారంగా అంటుంది జ్యోత్స్న. పారిజాతం గారు జ్యోత్స్న ని బాగా రెచ్చగొట్టి పంపించినట్లు ఉన్నారు అనుకుంటుంది దీప. కార్తీక్ కూడా అలాగే అనుకుంటాడు.

దీప మాట్లాడుతూ నా యోగక్షేమాలు ఎవరూ తెలుసుకో అక్కర్లేదు, నా జీవితం ఎవరో ఎగరేసిన గాలిపటం కాదు నాకు గా నేను ఎగరేసుకున్న గాలిపటం, ఎదురుగాలికి ఎగురుతాను తప్ప తలవంచుకొని తప్పించుకోను అంటుంది. అంత మామూలుగా వదిలేయటానికి మనది మామూలు బంధమా మా అమ్మని కాపాడి నువ్వు నాకు ఆత్మబంధువు అయ్యావు అని వెటకారంగా మాట్లాడుతుంది జ్యోత్స్న.
అంతలోనే బాబాయ్ అక్కడికి వస్తాడు అతనితో మాట్లాడుతూ నేను కార్తీక్ బాబు మరదలు మాత్రమే కాదు ఆయనకి కాబోయే పెళ్ళాన్ని కూడా అని చెప్పి కార్తీక్ ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. జ్యోత్స్న కి ఇప్పుడు పారిజాతం గారి మాటలు తప్పితే నా మాటలు చెవికెక్కవు, కార్తీక్ బాబుని ఈ విషయం గురించి మాట్లాడమన్నాను మాట్లాడారో లేదో అనుకుంటుంది దీప.

అప్పుడే బాబాయ్ దీప దగ్గరికి వచ్చి ఆవిడ మాటలు తేడాగా ఉన్నాయి ఏంటమ్మా అని అడుగుతాడు మనకెందుకులే బాబాయ్ అని టాపిక్ మార్చేస్తుంది దీప. మరోవైపు తనపై అలిగిన కూతుర్ని బ్రతిమాలుతూ ఉంటాడు శ్రీధర్. వైజాగ్ లో ఉంటే ఆరు నెలలకు ఒకసారి వస్తున్నావని అమ్మతో పోరుపడి హైదరాబాదు షిఫ్ట్ చేయించాను, ఇక్కడకి వచ్చినా కూడా నువ్వు నాతో టైం స్పెండ్ చేయడం లేదు అని తండ్రితో గొడవ పడుతుంది స్వప్న.
బిజినెస్ లో లాస్ వచ్చింది తల్లి, వ్యాపారాన్ని మళ్లీ ఒక లెవెల్ లో నిలబెట్టాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా నువ్వే చెప్పు మీ తండ్రి ఒక లూసర్ గా ఉండిపోవటం ఇష్టమా అని అడుగుతాడు శ్రీధర్. తండ్రి మాటలు నిజం అనుకుంటున్న స్వప్న లేదు డాడీ నువ్వు ఎప్పుడు ద బెస్ట్ గానే ఉండాలి, మనకి మాత్రం ఎవరున్నారు చెప్పు మన ముగ్గురమే కదా,కలిసి ఎంజాయ్ చేయాలి కదా అంటుంది. మళ్లీ కాదు మన లిస్టులో మరొక వ్యక్తి యాడ్ అయ్యారు అంటుంది స్వప్న.

ఎవరు అంటాడు శ్రీధర్. నన్ను సేవ్ చేసిన బాస్, ఇప్పుడే ఆయనతో మాట్లాడు అంటూ కాల్ చేయబోతుంది స్వప్న. కంగారుపడిన శ్రీధర్ ఫోన్ చేయొద్దు అంటాడు. థాంక్స్ చెప్తే సరిపోతుంది కదా ఫోన్ నెంబర్ ఎందుకు తీసుకున్నావు అని అడుగుతాడు. అతను నేను ఎవరో తెలియకపోయినా నన్ను సేవ్ చేసి హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాడు నాకు టిఫిన్ కూడా ఇప్పించాడు అంటుంది స్వప్న. మమ్మీ దగ్గర డబ్బులు తీసుకుని అతనికి ఇచ్చేయ్ అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు శ్రీధర్.
తర్వాత డాడీ ఇలాగే అంటారు కానీ ఎప్పుడో ఒకప్పుడు బాస్ ని తీసుకొచ్చి డాడీ కి సర్ప్రైజ్ ఇస్తాను అని తల్లితో చెప్తుంది స్వప్న. మరోవైపు కారులో వెళ్తున్న జ్యోత్స్న కార్తీక్ తో మాట్లాడాలి అనుకుంటుంది, సరిగ్గా అప్పుడే కార్తీక్ కూడా నీతో మాట్లాడాలి కారు పక్కన ఆపు అంటాడు. కారు ఆపి కిందికి దిగిన జ్యోత్స్న తో అసలు నీకు ఏమైంది, ఒకప్పుడు మాట్లాడమంటే మాట్లాడే దానివి కాదు కానీ ఇప్పుడు అవసరం లేకపోయినా మాట్లాడేస్తున్నావు అని కోప్పడతాడు.
నన్ను బ్రేక్ ఫాస్ట్ కి తీసుకువెళ్తాను అని చెప్పి ఆ శౌర్య దగ్గరికి వెళితే నాకు ఎంత బాధగా ఉంటుంది కనీసం మెసేజ్ చేయాలని కూడా అనిపించలేదా అని అడుగుతుంది జ్యోత్స్న. నీకు ఆ దీప మీద కన్సర్న్ వుంది, శౌర్య మీద కన్సర్న్ ఉంది కానీ నా మీద లేకుండా పోయింది అంటుంది. నువ్వు గోల్డెన్ స్పూన్తో పుట్టావు నీ లైఫ్ తో ఎవరిని పోల్చుకోకు అంటాడు కార్తీక్. కార్తీక్ కి ఐ లవ్ యు చెప్తూ బంధాలకి బాధలకి గోల్డెన్ స్కూన్ఐ రన్ స్పూన్ అనే తేడా ఉండదు అంటుంది జ్యోత్స్న. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఇప్పుడే చెప్పేయాలి అనుకుంటాడు కార్తీక్.
కానీ అప్పుడే జ్యోత్స్న మాట్లాడుతూ మన ఇద్దరి రూపాలు వేరు కానీ ప్రాణం ఒకటే ఒక్కసారి నువ్వు నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పు వెంటనే నేను ఈ కారు కింద పడి చచ్చిపోతాను నువ్వు లేకపోతే నాకు ఈ ప్రాణమే అక్కర్లేదు అంటూ అటుగా వస్తున్న కారు కింద పడబోతుంది జ్యోత్స్న. ఆమెని ఆపి మందలిస్తాడు కార్తీక్. ఇప్పుడున్న పరిస్థితులలో పెళ్లి చేసుకోను అనే విషయం చెప్పకూడదు అనుకుంటాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











