Karthika Deepam July 18th episode: దీప మనసు మార్చలేకపోతున్న కార్తీక్.. నడిరోడ్డు మీద బావని నిలదీసిన జ్యోత్స్న!
దారిలో కనిపించిన నర్సింహ తన గురించి తప్పుగా మాట్లాడితే అతని చెంప పగలగొడుతుంది దీప. మరోవైపు జ్యోత్స్న దీప కళ్ళ ముందే నిశ్చితార్థం జరగాలి ఎలాగైనా దీప ని తీసుకురమ్మని పారిజాతానికి చెప్తుంది. మరోవైపు కార్తీక్ ని వెతుక్కుంటూ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది శౌర్య. దారిలో నర్సింహ ఆమెని తీసుకుపోవాలని చూస్తాడు కానీ తప్పించుకుంటుంది. తర్వాత కడియం బాబాయ్ కి కనిపించిన శౌర్య కార్తీక్ కావాలి అనడంతో తప్పనిసరి పరిస్థితులలో అతనికి ఫోన్ చేస్తాడు బాబాయ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 18వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 100వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
బూచాడు వచ్చాడు అంటుంది ఏంటి అని కంగారుగా అడుగుతుంది దీప. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, ఇన్నాళ్లు నేను మాత్రమే శౌర్య మీద ప్రేమ పెంచుకున్నాను అనుకున్నాను కానీ ఇప్పుడు గోడ మీద నా పేరును చూసి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయి తప్పు చేశాను అనిపిస్తుంది. నన్ను వెతుక్కుంటూ వస్తున్న రౌడీ కి నర్సింహ కనిపించాడట ఎత్తుకుపోవాలనుకుంటే అతడి దగ్గర నుంచి తప్పించుకొని కడియం బాబాయ్ కి కనిపించింది. అతనే నాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.

పాప ని తీసుకుపోవటానికి పక్క వీధి వరకు వచ్చిన నర్సింహ గాడు రేపు మీ ఇంటికి రాడని గ్యారెంటీ ఏమిటి, ఇలాంటివి జరగకూడదనే ఆరోజు పాపకి తండ్రిని నేను అని చెప్పాను కానీ మీరు అర్థం చేసుకోలేదు అంటాడు కార్తీక్. మీరు చేసిన తప్పుని సమర్థించుకోవద్దు బాబు, మీరు అలా చెప్పడం వల్ల నాకు నష్టం జరిగింది, ఈ విషయం సుమిత్ర గారికి తెలిస్తే నా కూతురికి అన్యాయం చేస్తావా అంటూ నన్ను నిలదీస్తారు.
ఇక నా అత్తింటి వాళ్ళు ఎప్పుడు ఒక మాట అందామా అని ఎదురుచూస్తున్న వాళ్లే, వాళ్లందరికీ నిజం తెలిస్తే నన్ను ఎలా చూస్తారో తెలుసా బాబు, దానికి తోడు శౌర్య మీరు అన్నమాట వినేసిందేమో అనే భయం నాకు రోజూ నిద్ర లేకుండా చేస్తుంది. అందుకే నేను మా ఊరు వెళ్ళిపోతాను అంటుంది దీప. ఈరోజే పెట్టే బేడ సర్దుకొని ఆ నరకంలోకి వెళ్ళిపో, నేను అన్న ఒక మాటను పట్టుకొని ప్రపంచమంతా నిందించేసినట్లు భయంతో పారిపోతాను అంటున్నావు కానీ నేను అన్న మాటలు వాడు పట్టించుకోలేదు.
అందుకే మళ్ళీ పాప కోసం వచ్చాడు. మీరు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు, మీ గురించే ఆలోచించవలసిన అవసరం నాకు లేదు కానీ రౌడీ కోసం మీ నాన్నగారి కోసం నేను మీ గురించి ఆలోచించవలసి వస్తుంది, రౌడీ నా బాధ్యత, మీకు ఏ సమస్య లేదు అనుకున్న రోజు నేను మీ నుంచి దూరంగా వెళ్లిపోతాను అంటాడు కార్తీక్. మీ పరిస్థితులన్నీ చక్కబడే వరకు మీరు మా అత్తయ్య ఇంట్లో ఉండండి అక్కడే రౌడీ కి సేఫ్ అంటాడు. కానీ అతని మాట వినిపించుకోదు దీప.

నా కూతురు ఇంటికి తీసుకువచ్చినందుకు సంతోషం ఇంక మీరు బయలుదేరండి అని చెప్తుంది. సరే అంటూ వెళ్ళిపోతున్న కార్తీక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది శౌర్య. మళ్లీ చీటింగ్ చేసి వెళ్ళిపోతున్నావా మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడుగుతుంది. వస్తాను కానీ అమ్మను వదిలి ఎప్పుడు ఒక్కదానివే రాకూడదు, అమ్మ పర్మిషన్ తో అమ్మతోనే రావాలి. అలా అని నాకు ప్రామిస్ చెయ్యు అంటాడు కార్తీక్. సరే అని ప్రామిస్ చేస్తుంది శౌర్య. వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక టెన్షన్ పడుతుంది జ్యోత్స్న.
మరోవైపు జ్యోత్స్న కనిపించడం లేదు మీకు ఏమైనా తెలుసా అని అత్తగారిని అడుగుతుంది సుమిత్ర. నాకేం తెలుసు అంటుంది పారిజాతం. వయసు మరిచిపోయి అది మీతోనే స్నేహం చేస్తుంది. రేపు పెళ్లి అయినా కూడా అది పుట్టింటిని వదిలి వెళ్లేలా లేదు అంటుంది సుమిత్ర. రేపు అది ఏ కారణం చేత పుట్టింటికి వచ్చేసినా నాదే తప్పు అనేలా ఉన్నావు అంటుంది పారిజాతం. పోనీలెండి ఎక్కడ ఉంటే ఏంటి వాళ్ళిద్దరూ కలిసే కదా రెస్టారెంట్ పనులు చేసుకోవాలి వాళ్లది అంటే మనదే కదా అంటుంది సుమిత్ర.

మనది కాదు నాది, అది నా మనవరాలు పెళ్ళి అయిన తర్వాత చూడండి మీ అందరిని ఎలా ఆడుకుంటానో అనుకుంటుంది పారిజాతం. మరోవైపు కార్తీక్ కి అడ్డుగా కారు ఆపిన జ్యోత్స్న నువ్వేంటి ఈ ఏరియాలో అని అడుగుతుంది. ఆ తర్వాత అమ్మతో ఏదో విషయం చెప్తాను అన్నావు కదా ఏంటది అని అడుగుతుంది. అది ఇంట్లో అందరితోనే చెప్తాను అంటాడు కార్తీక్.నీకు దీప ఇల్లు తెలుసా అని అడుగుతుంది జ్యోత్స్న. తెలియదు అంటాడు కార్తీక్. ఇంక నేను వెళ్తాను అన్న కార్తీక్ తో ఇంటికేనా అంటుంది జ్యోత్స్న.మా ఇంటికి అంటాడు కార్తీక్.
దీప ఇల్లు ఎక్కడో తెలిస్తే పారువాళ్ళు దీపని ఇబ్బంది పెడతారు, తెలియకపోవడమే మంచిది అనుకుంటూ వెళ్ళిపోతాడు కార్తీక్. దీప ఇల్లు తెలియదు అని ఎంత అందంగా అబద్ధం చెప్పావు అంటే హాస్పిటల్లో చెప్పిన దాన్ని నువ్వు నిజం చేయాలనుకుంటున్నావా, అసలు నీ మనసులో ఏముంది, మమ్మీ తో ఏం చెప్పాలనుకుంటున్నావు అనుకుంటుంది జ్యోత్స్న. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











