Karthika Deepam June 18th episode: నడిరోడ్డు మీద మొండికేస్తున్న శౌర్య.. నర్సింహకి గుడ్ న్యూస్ చెప్పిన శోభ!
స్వప్నతో వీడియో కాల్ మాట్లాడతాను అంటుంది కాంచన. అందుకు కంగారుపడిన శ్రీధర్ వద్దంటాడు. జ్యోత్స్న ని బ్రేక్ ఫాస్ట్ కి తీసుకువెళ్తానని చెప్పిన కార్తీక్ శౌర్య దగ్గరికి వెళ్లడంతో కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న. స్కూల్ కి వెళ్లి రచ్చ చేస్తుంది, తర్వాత దీప హోటల్ దగ్గరికి వెళ్లి అక్కడ కూడా రచ్చ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్18 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 74వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
శౌర్య ముద్దు మాటలు వింటుంటే ఎవరికైనా జాలి వేస్తుంది, నేను వాళ్లకి ఏ సాయం చేయాలనుకుంటున్నా కేవలం శౌర్య కోసమే అని క్లారిటీ ఇచ్చి కోపంగా వెళ్లి కార్ లో కూర్చుంటాడు కార్తీక్. జ్యోత్స్న కూడా కోపం గా కారులో కూర్చుంటుంది. మరోవైపు శౌర్య స్కూల్ వదిలేయడంతో తల్లి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక తండ్రి తన కూతుర్ని ముద్దు చేస్తూ తీసుకు వెళ్తుంటే చూసి ఏడుస్తుంది శౌర్య. తనకి కూడా తండ్రి ఉండి ఉంటే ఎంత బాగుండేది అనుకుంటుంది. మరోవైపు కోపంతో రగిలిపోతున్న జ్యోత్స్న జరిగిందంతా పారిజాతానికి చెప్తుంది.

నువ్వు ఆవేశంతో ఇప్పుడు తెలుసుకున్నావు కానీ నేను అనుభవంతో ఎప్పుడో తెలుసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను విను అంటుంది పారిజాతం. నీవన్నీ అవుట్ డేటెడ్ సలహాలు అవి నాకు అక్కర్లేదు ప్లాన్ వేస్తే సోషల్ మీడియాలో వైరల్ వీడియో పోస్ట్ చేసినట్లు ఉండాలి. ఇప్పుడు నీ అనుభవం కంటే నా ఆవేశమే వర్కౌట్ అవుతుంది అంటుంది జ్యోత్స్న. కార్తీక్ మాటలలో ఎక్కడ నిన్ను పెళ్లి చేసుకోను అని అనలేదు కదా అని అనుమానం గా అడుగుతుంది పారిజాతం.
ఆ డౌట్ నీకెందుకు వచ్చింది, బావ నీతో ఏమైనా చెప్పాడా అని అడుగుతుంది జ్యోత్స్న. నాకెందుకు చెప్తాడు అని మాట మార్చేస్తుంది పారిజాతం. వచ్చే ముహూర్తాల్లో నాకు, బావకి పెళ్లి చేయాలని మాట తీసుకున్నావు కదా చూస్తూ ఉండు ఆ మాటే నిజం అవుతుంది అంటుంది జ్యోత్స్న. ఆ మాటలకి ఆనందపడిపోతుంది పారిజాతం నా బంగారు కలలు అన్నీ నిజమయి నా ముందు నిలబడినట్లుగా ఉంది అంటూ మనవరాలిని పొగిడేస్తుంది.

మరోవైపు స్కూల్ నుంచి వస్తున్న శౌర్య తల్లితో ఎండలో నడవలేక పోతున్నాను కార్తీక్ కి రమ్మని ఫోన్ చేస్తాను అని అంటుంది. వద్దు అంటుంది దీప. నేను ఎండలో నడవలేకపోతున్నాను అంటుంది శౌర్య. ఎత్తుకుంటాను రమ్మంటుంది దీప. నీ కాళ్లు నొప్పి పెడతాయి అందుకే కార్తీకి ఫోన్ చేస్తానంటే వినటం లేదు అంటూ రోడ్డు మీద గొడవ చేస్తుంది శౌర్య. ఇలా మొండికేస్తే ఎలా అంటుంది దీప. అమ్మ, ముత్యాలమ్మ తల్లి నువ్వే కాపాడాలి ఎవరినైనా పంపించు అంటుంది అని మొక్కుకుంటుంది శౌర్య. అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు.
కార్తీక్ తో నీకు ఫోన్ చేస్తాను అంటే అమ్మ వద్దంటుంది ఇంతలో నువ్వే వచ్చావు అంటుంది శౌర్య. సరే నిన్ను నేను దింపేస్తానులే అంటాడు కార్తీక్. అమ్మని కూడాహోటల్ లో దింపుదాం అంటుంది శౌర్య. వద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు నేను హోటల్ కి వెళ్తాను అంటుంది దీప. వాళ్ళు అలా రోడ్డు మీద మాట్లాడుకోవడం అనసూయ చూస్తుంది సిగ్గులేని బ్రతుకులు నడిరోడ్డు అని కూడా చూడకుండా కబుర్లు ఆడుకుంటున్నారు అని అసహ్యించుకుంటుంది.
తర్వాత దీప హోటల్ కి వెళ్ళిపోతే శౌర్య ని తీసుకొని కార్ లో వెళ్ళిపోతాడు కార్తీక్. మరోవైపు బజారులో సిగ్గు,పౌరుషం లాంటివి అమ్మితే తీసుకొని రా అని భర్తతో చెప్తుంది శోభ. ఆ మాటలకి కోప్పడతాడు నర్సింహ. నా భర్త, నా తండ్రి కూడా నన్ను ఎప్పుడూ కొట్టలేదు అలాంటిది ఆ దీప వచ్చి నన్ను కొట్టి ఇప్పటికి నాలుగు రోజులైంది కానీ దానిని నువ్వు ఇప్పటివరకు ఏమీ చేయలేకపోయావు అని భర్తని దెప్పి పొడుస్తుంది శోభ.

అప్పుడే అక్కడికి వచ్చిన అనసూయ వాడిని అలా పొడుచుకు తింటావేంటి, అందరూ బాగానే ఉన్నారు నేను, నా కొడుకు ఇలా అయిపోయాం. ఆఖరికి నా కొడుకు నీ చేత మాటలు పడాల్సి వస్తుంది అని శోభ పై కోప్పడుతుంది అనసూయ. ఇంతలో శోభ బయటకు వచ్చి వామిటింగ్ చేసుకుంటుంది. అది చూసి సంతోషిస్తుంది అనసూయ. నువ్వు తండ్రి కాబోతున్నావు అంటూ నర్సింహ కి శుభవార్త చెప్తుంది.
ఆనంద పడిపోతున్న నర్సింహతో ముందు హాస్పిటల్ కి తీసుకువెళ్తాము అని చెప్పటంతో ముగ్గురు హాస్పిటల్ కి బయలుదేరుతారు. అక్కడ దీప టిఫిన్ డెలివరీ ఇచ్చి వెనక్కి వస్తుంటే వాళ్లకి ఎదురవుతుంది. ఎదురొచ్చినందుకు దీపపై కోప్పడుతుంది అనసూయ, ప్రెగ్నెన్సీ విషయం దీప కి చెప్పొద్దు అంటాడు నర్సింహ. ఇది దాచుకునే విషయం కాదు గర్వంగా చెప్పవలసిన విషయం అంటుంది శోభ. ఏ విషయం అని అంటుంది దీప. నా కోడలు నన్ను నాయనమ్మని చేయబోతుంది అని ఆనందంగా చెప్తుంది అనసూయ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











