KarthikaDeepam Aug19th episode:దీపకి నిజం చెప్పకూడదనుకుంటున్న కార్తీక్..పారిజాతానికి గట్టి షాకిచ్చిన జ్యోత్స్న
కోర్టులో దీప కేసు గెలుస్తుంది, తనని గెలిపించినందుకు అనసూయ కాళ్లు పట్టుకొని కృతజ్ఞతలు చెప్తుంది దీప. మరోవైపు రెస్టారెంట్ లో తన కన్న తండ్రి అని తెలియకుండానే దాసు ని చెంప దెబ్బ కొడుతుంది జ్యోత్స్న. అది చూసిన పారిజాతం కోపంతో రగిలిపోతుంది. జ్యోత్స్న పంపించిన ఫోటో చూసి కొడుకుతో గొడవ పడతాడు శ్రీధర్. కూతుర్ని చూడటం కోసం పారిజాతం ఇంటికి వస్తాడు దాసు. శివ నారాయణ దాసుని ఘోరంగా అవమానించి ఇంటి నుంచి పంపించేస్తాడు. భర్త మీద పగ పెంచుకుంటుంది పారిజాతం. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. ఆగష్టు 19 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 127వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
సుమిత్ర ఇంటికి వచ్చిన వ్యక్తిని చూసి బూచాడనుకొని భయపడుతుంది శౌర్య.తల్లి దగ్గరికి వచ్చి దాక్కుంటుంది. వచ్చిన వ్యక్తి బూచాడు కాదని కూతురికి ధైర్యం చెప్తుంది దీప. నాన్న మంచివాడని, నాలాగా ఉంటాడని ఎందుకు అబద్ధం చెప్పావు, నాన్న మంచి వాడు కాదనేనా నాకు నిజం చెప్పలేదు, నేను నాన్న ని వద్దాన్నాననే కోపం తో నన్ను ఎత్తుకు పోడు కదా అని భయం గా అడుగుతుంది శౌర్య.

లేదమ్మా, విడాకులు అయిపోయాయి ఇక బూచాడు మన దగ్గరికి రాడు అంటుంది దీప. విడాకులు అంటే ఏమిటి అని అడుగుతుంది శౌర్య. కూతురి కి అర్థమయ్యేలా చెప్తుంది దీప. నాకు ఎవరూ వద్దమ్మా నువ్వు కార్తీక్ ఉంటే చాలు అంటుంది శౌర్య. అప్పుడే కార్తీక్ ఫోన్ చేసి భోజనం చేసావా,టాబ్లెట్స్ వేసుకున్నావా అని శౌర్యని అడుగుతాడు. ఇంకా లేదు అంటుంది శౌర్య.
ఇంతవరకు ఏం చేశావు అని కార్తీక్ అడిగితే ఆడుకున్నాను అని చెప్తుంది శౌర్య . నిన్ను ఆడుకోవద్దు అని చెప్పాను కదా అంటాడు కార్తీక్. ఎందుకు అంటుంది శౌర్య. నిజం చెప్పకుండా ఈ సమయంలో ఎవరైనా ఆడుకుంటారా అంటాడు కార్తీక్.తర్వాత దీప కూతురు దగ్గర ఫోన్ తీసుకొని శౌర్య ఆరోగ్యం గురించి అడుగుతుంది. శౌర్య ఆరోగ్య సమస్య నుంచి బయటపడే వరకు దీపకే నిజం చెప్పకూడదు అనుకున్న కార్తీక్ ఆమెకి నిజం చెప్పడు. తర్వాత మీ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అని అడుగుతుంది దీప.
ఇంట్లో జరిగిందాని గురించి చెప్తే బాధపడుతుందని కొన్ని విషయాలు గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అంటాడు. తర్వాత కార్తీక్ కూడా పారు వాళ్లు నిన్ను ఏమైనా అన్నారా అని అడుగుతాడు. దీప కూడా కార్తీక్ చెప్పిన సమాధానం చెప్పి తప్పించుకుంటుంది. ఆ తర్వాత కూతురికి భోజనం తినిపిస్తూ కార్తీక్ బాబు మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది ఆయన నా దగ్గర ఏదో దాస్తున్నారు అనుకుంటుంది దీప. మీరు నా కూతురు మీద చూపిస్తున్న శ్రద్ధ బయట వాళ్ళకి తప్పుగా అనిపించొచ్చు అనుకుంటుంది.
అదే సమయంలో కార్తీక్ కూడా ఈ విషయమే ఆలోచిస్తూ బయట వాళ్ళు కాదు ఇంట్లో వాళ్లే తప్పుగా అనుకుంటున్నారు, నా కారణంగా నువ్వు బాధపడకూడదు దీప అనుకుంటాడు. అంతమందితో మాటలు పడుతున్నా కూడా నాకు ఇంకా సాయం చేస్తున్నారు మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటాను అనుకుంటుంది దీప. ఇదంతా శౌర్య కోసమే చేస్తున్నాను, మీకు ఇంకేమీ భయం లేదు రేపటి నుంచి కొత్త జీవితం మొదలు పెట్టు అనుకుంటూ మనసులోనే ఆమెని ఎంకరేజ్ చేస్తాడు కార్తీక్. మరోవైపు పారిజాతం కొడుకు గురించి ఆలోచిస్తూ జ్యోత్స్న చేత దాసు కి ఎలాగైనా క్షమాపణలు చెప్పించాలి అనుకుంటుంది.
అదే సమయంలో జ్యోత్స్న అక్కడికి వచ్చి దాసు గురించి ఎంక్వయిరీ చేస్తుంది. దాసు తన మొదటి భర్త కొడుకుని చెప్తుంది పారిజాతం. ఇన్నాళ్లు అతని గురించి ఇంట్లో ఎవరూ మాట్లాడలేదు ఏమిటి, అంటే ఏదో తప్పు చేసి ఉంటాడు అంటుంది జ్యోత్స్న. నిజం తెలిసాక మీ బాబాయికి క్షమాపణ చెప్తావు అనుకుంటే ఇలాగ మాట్లాడుతున్నావ్ ఏంటి అంటుంది పారిజాతం. ఎవరు బాబాయి, ఎవరికి బాబాయి అని తాతయ్య అన్నాడు కదా అతను ఏదో తప్పు చేసి ఉంటాడు అందుకే అతనికి ఏ విలువ లేదు.
నువ్వు కూడా అతనిని ఎప్పుడు ఇంట్లోకి రానివ్వదు అని పారిజాతానికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. మీ ఇద్దరినీ ఒకటి చేసి,నీతోనే నీ తండ్రిని ఇంటికి రప్పిద్దాం అనుకుంటే నువ్వు నీ తండ్రికి శత్రువులాగా మారావు, నిన్ను ఎంత ప్రమాదంగా పెంచానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని బాధపడుతుంది పారిజాతం. మరోవైపు సుమిత్ర దంపతులు దీపని దగ్గరికి పిలిచి ఇన్నాళ్లు ఎంతో ఓపికతో కష్టాలని భరించావు, ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించు, అందుకు మాకు చేతనైన సాయం మేము చేస్తాము.
వ్యాపారం ప్రారంభించాలంటే చెయ్యి అందుకు మా సపోర్ట్ నీకు ఉంటుంది, లేదంటే మా హోటల్ లోనే చెఫ్ కావాలి, అక్కడ చేస్తాను అన్నా కూడా చెప్పు అక్కడే చేద్దువుగానివి అంటాడు దశరథ్. దీప ఏమి మాట్లాడకపోవటంతో మమ్మల్ని మీ తల్లిదండ్రులుగా భావించు, వాళ్లు అడిగినా కూడా నువ్వు ఇలాగే మౌనంగా ఉంటావా అంటుంది సుమిత్ర. అప్పుడే అక్కడికి వచ్చిన జ్యోత్స్న వాళ్లు అంతలా అడుగుతున్నారు కదా ఏం కావాలో చెప్పు అని వెటకారంగా అంటుంది. తనకి ఏం కావాలో తను అడుగుతుంది నువ్వేమీ ఇబ్బంది పెట్టకు అని చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోతాడు దశరథ్.
తర్వాత దీప దగ్గరికి వెళ్లిన జ్యోత్స్న వాళ్లు అంతలా చెప్తున్నారు కదా తల్లిదండ్రులుగా అనుకోమని, వాళ్ళని తల్లిదండ్రులుగా అనుకో, మా నాన్నమ్మ, తాతయ్యలని మీ నానమ్మ, తాతయ్య అనుకో, మా అత్తయ్య,మామయ్యలని మీ అత్తయ్య, మామయ్య అనుకో అని వెటకారంగా ఉంటుంది. జ్యోత్స్న ని కోప్పడుతుంది సుమిత్ర. నేనేమీ తప్పుగా మాట్లాడలేదు కదా మమ్మీ మీ ఇద్దరూ తల్లిదండ్రులైతే అత్తయ్య, మావయ్య ఏమవుతారు అని సూటిగా ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











