Karthika Deepam July 19th episode: ఆవేశంతో రగిలిపోతున్న జ్యోత్స్న.. భయంతో వణికిపోతున్న దీప!

జ్యోత్స్న దీప కళ్ళ ముందే నిశ్చితార్థం జరగాలి ఎలాగైనా దీప ని తీసుకురమ్మని పారిజాతానికి చెప్తుంది. మరోవైపు కార్తీక్ ని వెతుక్కుంటూ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది శౌర్య. దారిలో నర్సింహ ఆమెని తీసుకుపోవాలని చూస్తాడు కానీ తప్పించుకుంటుంది. తర్వాత కడియం బాబాయ్ కి కనిపించిన శౌర్య కార్తీక్ కావాలి అనడంతో తప్పనిసరి పరిస్థితులలో అతనికి ఫోన్ చేస్తాడు బాబాయ్. బాబాయ్ ని శౌర్య ని తీసుకొని దీప ఇంటికి వెళ్తాడు కార్తీక్. ఇదంతా కార్తీక్ ని ఫాలో అవుతున్న జ్యోత్స్న చూస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 19వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 101వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

శౌర్య ని భోజనానికి పిలవటానికి వచ్చిన దీపకి గోడమీద కార్తీక్ పేరుని చెరుపుతూ కనిపిస్తుంది శౌర్య. కార్తీక్ కనిపించాడు కదమ్మా అందుకే పేరు చెరిపేస్తున్నాను, ఇకమీదట కార్తీక్ రోజు వస్తాడు అంటుంది శౌర్య. పేరుని చెరిపేయవలసింది గోడ మీద నుంచి కాదు నీ మనసులోంచి, అయినా కార్తీక్ బాబు ఇకమీదట రాడు అని మనసులో అనుకుంటుంది దీప. బయటికి మాత్రం కూతుర్ని భోజనానికి రమ్మంటుంది. ఈరోజు బాగా ఆకలేస్తుంది పొట్ట నిండా తిని బజ్జుంటాను అంటూ తల్లితో వెళుతుంది శౌర్య.

Karthika Deepam July 19th episode

భోజనం తినిపిస్తూ ఆలోచనలో పడుతుంది దీప. కార్తీక్ బాబు అన్నట్టు నర్సింహ ఇక్కడికి రావడానికి ఎంతో సమయం పట్టదు, ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు రేపు పొద్దున్న శౌర్య ని తీసుకుని మా ఊరు వెళ్ళిపోతాను అనుకుంటుంది దీప. మరోవైపు ఆవేశంతో రగిలిపోతున్న జ్యోత్స్న జరిగినదంతా పారిజాతానికి చెప్తుంది. బావకి దీప ఇల్లు తెలుసు, మమ్మీ దీప గురించి చెప్పినప్పుడు కూడా బావ ఏమి మాట్లాడలేదు.

మమ్మీ తో ఏదో చెప్పటానికి ఇంటికి వచ్చాడు కానీ ఆ కడియం బాబాయ్ ఫోన్ చేసేసరికి వెళ్లిపోయాడు. వాడికి ఇచ్చిన విలువ కూడా బావ నాకు ఇవ్వలేదు అంటుంది జ్యోత్స్న. ఈ ఎంగేజ్మెంట్ జరగదు అంటుంది పారిజాతం. ఆ మాటలకి పారిజాతం మీద కోప్పడుతుంది జ్యోత్స్న. మీ బావ దీప ని ఇక్కడికి రప్పిస్తాడు అంటుంది పారిజాతం. బావ రప్పించకపోయినా మనమే రప్పిస్తాం అంటుంది జ్యోత్స్న. ఈ నిశ్చితార్థం దీప జరగనివ్వదు అంటుంది పారిజాతం. ఈ నిశ్చితార్థం జరిగి తీరుతుంది.

ఈ నిశ్చితార్థానికి అడ్డు వచ్చిన వారిని ఎవ్వరినీ క్షమించను అని ఆవేశంతో రగిలిపోతుంది జ్యోత్స్న. ఈ నిశ్చితార్థం ఎలా జరగదో నేను చూస్తాను, దీపా..ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకో, మనం రేపు కలుద్దాం అని మనసులో అనుకుంటుంది పారిజాతం. మరోవైపు తలుపులన్నీ జాగ్రత్తగా వేసి కూతుర్ని పడుకోబెడుతుంది దీప. ఎందుకు అన్ని తలుపులూ వేసేస్తున్నావు బూచాడు వస్తాడనా అంటుంది శౌర్య. అలాంటిదేమీ లేదు అని చెప్పి కూతుర్ని పడుకోపెడుతుంది దీప.

Karthika Deepam 2 Serial 19th July 2024 Episode Number 100 Here is full story

కాసేపటి తర్వాత తలుపు శబ్దం రావడంతో భయంతో వణికి పోతుంది దీప. చేతులోకి గొడ్డలి తీసుకుని వచ్చింది నర్సింహ ఏమో అనుకొని భయంగా తలుపుతీస్తుంది. నిజంగానే నర్సింహ అక్కడికి వస్తాడు. నా కూతురు పడుకుంది నిన్ను చూస్తే భయపడుతుంది వెళ్ళిపో అంటుంది. అది పడుకుంటుందనే ఈ టైం లో వచ్చాను పడుకున్నప్పుడైతే దానిని ఈజీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు అంటూ లోపలికి వెళ్ళబోతాడు నర్సింహ. అతన్ని బయటికి తోసేస్తుంది దీప.

వాళ్ళిద్దరి మధ్య చాలా సేపు తగాదా జరుగుతుంది. అప్పుడే శౌర్య కూడా లేచి తలుపు కొడుతూ ఉంటుంది. అమ్మ, బూచాడు వచ్చాడా ఏం జరుగుతుంది నాకు భయంగా ఉంది తలుపు తీయు అంటుంది. ఆ గొడవకి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తాగుబోతు వెధవ దీప ఏడిపిస్తున్నాడు అని నర్సింహని కొట్టి తరిమేస్తారు. తర్వాత దీప లోపలికి వెళ్లి కూతుర్ని హత్తుకుంటుంది. మళ్లీ తలుపులన్ని వేసేసి కూతుర్ని పడుకోబెడుతుంది.

Karthika Deepam 2 Serial 19th July 2024 Episode Number 100 Here is full story

వచ్చింది బూచాడే కదమ్మా, నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడా అని భయంతో వణికిపోతూ తల్లిని అడుగుతుంది శౌర్య. బూచోడు కాదు ఎవరో తాగుబోతు వాడు అంటుంది దీప. కానీ నాకు బూచాడు మాటలు లాగానే వినిపించాయి, కార్తీక్ ఉంటే బూచాడిని మన ఇంటికి రానిచ్చేవాడు కాదు, నువ్వే పంపించేసావు. అయినా నాన్న ఉంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు కదా అమ్మ మనం నాన్నని వెతకటానికి కార్తీక్ హెల్త్ తీసుకుందామా అని అడుగుతుంది శౌర్య.

ఆ మాటలు విన్న దీప ఆనంద పడుతుంది. హాస్పిటల్లో కార్తీక్ అన్న మాటలు శౌర్య వినలేదు నేను ధైర్యంగా ఉండొచ్చు అనుకుంటుంది. శౌర్యకి ధైర్యం చెప్పే పడుకోబెడుతుంది దీప. తర్వాత ఇక్కడ ఉన్నా నర్సింహ వదిలిపెట్టడు, ఊరికి వెళ్ళినా కూడా వదిలిపెట్టడు. నా కూతుర్ని రక్షించుకోవాలి ఏం చేయటం అని ఆలోచనలో పడుతుంది దీప. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X