Karthika Deepam June 19th episode: దీపని ప్రశ్నలతో వేధిస్తున్న జ్యోత్స్న.. డాక్టర్ మాటలకి కన్నీరు పెట్టుకున్న

జ్యోత్స్న ని బ్రేక్ ఫాస్ట్ కి తీసుకువెళ్తానని చెప్పిన కార్తీక్ శౌర్య దగ్గరికి వెళ్లడంతో కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న. స్కూల్ కి వెళ్లి రచ్చ చేస్తుంది, తర్వాత దీప హోటల్ దగ్గరికి వెళ్లి అక్కడ కూడా రచ్చ చేస్తుంది. తమతో పాటు ఉండటం లేదని తండ్రితో గొడవ పడుతుంది స్వప్న. ఆమెకి అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు శ్రీధర్. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూన్19 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 75వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

నా కోడలు కడుపుతో ఉంది, మరికొద్ది నెలలలో నా చేతిలో మనవడిని పెడుతుంది, వాడే నా కొడుక్కి అసలైన వారసుడు, అయినా నీ కూతురికి తండ్రి తో పనేముంది, ఎవరైనా తండ్రి స్థానంలో సంతకం పెడతారు అని వెటకారంగా మాట్లాడుతుంది అనసూయ. నీ కోడలు నీళ్ళోసుకుంటే నువ్వెందుకు నొప్పులు పడుతున్నావు, నీకు అంత ఆనందంగా ఉంటే ఎక్కడికైనా ఎక్కి అక్కడ నుంచి దూకేయ్ అంతేగాని నా జోలికి నా కూతురు జోలికి రావద్దు అని అత్తని హెచ్చరిస్తుంది దీప. ఆమెపై కోప్పడతాడు నర్సింహ.

Karthika Deepam 2 Serial 19th June 2024 Episode Number 75 Here is the full story

దీప కూడా నర్సింహ మీద తిరగబడుతుంది. దానికి మళ్ళీ పూనకం వచ్చినట్లు ఉంది అని కొడుక్కి నచ్చజెప్పి శాంతింప చేస్తుందిఅనసూయ. దీపని కూడా అక్కడ నుంచి వెళ్లిపోమంటుంది. శోభ కి జాగ్రత్తలు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీప. మరోవైపు శ్రీవాణి జ్యోత్స్న కి ఫోన్ చేసి దీప కి మీ బావకి సంబంధం ఉందని భయపడుతున్నావ్ కదా అని అడుగుతుంది.

మా బావ గురించి తప్పుగా మాట్లాడొద్దు అని హెచ్చరిస్తుంది జ్యోత్స్న. అన్నానని కాదు గాని శౌర్య విషయంలో ఎందుకు మీ బావ అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో అర్థం కావడం లేదు, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అదే టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్తే నీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు? మనం అనుకున్నది నిజం కాకపోతే పర్వాలేదు కానీ నిజం అయితే మాత్రం నువ్వు జాగ్రత్త పడాల్సిందే అని హెచ్చరిస్తుంది శ్రీవాణి.

Karthika Deepam 2 Serial 19th June 2024 Episode Number 75 Here is the full story

కోపంతో రగిలిపోయిన జ్యోత్స్న నేరుగా దీప పని చేసే టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్తుంది. శౌర్య ని మా బావకి ఎందుకు దగ్గర చేస్తున్నావు అని నిలదీస్తుంది, పేరెంట్స్ మీటింగ్కి నేనే నా కూతుర్ని తీసుకువెళ్తున్నాను అని చెప్పావు కానీ అక్కడ మా బావతో సహా కనిపించావు చూసినవాళ్లు మీ ఇద్దరే పేరెంట్స్ అనుకుంటారు కదా అంటుంది. ఆ మాటలకి కోప్పడుతుంది దీప.

ఎందుకు కోప్పడుతున్నావు, అలా మాట్లాడుకుంటే ఆ మనిషికి కాబోయే భార్యని నాకు ఎలా అనిపిస్తుందో ఆలోచించు, ఆ విషయం కూడా పక్కన పెట్టు మా బావ నీకు రోజు ఫోన్ చేస్తాడా ఏ టైంలో ఫోన్ చేస్తూ ఉంటాడు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి విసిగిస్తుంది. అదే సమయంలో బాబాయి అక్కడికి వస్తాడు. ఇంతకుముందు వచ్చినప్పుడు టీ తాగుతాను అన్నారు కదా ఇప్పుడు తాగుతారా అని అడుగుతాడు.

Karthika Deepam 2 Serial 19th June 2024 Episode Number 75 Here is the full story

ఇప్పుడు కాదు మళ్ళీ వచ్చి తాగుతాను అని వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఆమె మాటలు తేడాగా ఉన్నాయి నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతుందా అని దీపని అడుగుతాడు బాబాయ్. ఏం లేదు అని చెప్తుంది దీప. మరోవైపు శోభ ని పరీక్షించిన డాక్టర్ శోభ కి వాంతులు ఫుట్ పాయిజన్ వల్ల జరిగాయి అంతే కానీ ఆమె ప్రెగ్నెంట్ కాదు, అంతేకాదు ఈమె గర్భసంచి సరిగ్గా లేకపోవడం వలన ఈమె జీవితంలో ప్రెగ్నెంట్ కాలేదు అని చెప్తుంది. ఆ మాటలకి కన్నీరు పెట్టుకుంటుంది శోభ.

ఇదంతా ఆ దీప ఎదురొచ్చినందుకే జరిగింది అని అంటుంది. అందుకే దానికి చెప్పొద్దు అన్నాను అని తల్లి మీద కోప్పడతాడు నర్సింహ. దానివి అంత దిష్టి కళ్ళని నాకేం తెలుసు అంటుంది అనసూయ. అంతలో ఒక కానిస్టేబుల్ నర్సింహ కి ఫోన్ చేసి నువ్వు డాష్ ఇచ్చిన బైక్ వాడు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు, వచ్చి కనిపించు అని చెప్తాడు. సరే అంటాడు నర్సింహ. మరోవైపు కారులో వస్తున్న కార్తీక్ కి నర్సింహ ని పోలీసు తీసుకు వెళ్ళటం కనిపిస్తుంది.

Karthika Deepam 2 Serial 19th June 2024 Episode Number 75 Here is the full story

వీడు మళ్లీ ఏం చేశాడు, దీప ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా అనుకుంటూ దీప టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్లి కంగారుగా నర్సింహ ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా అని అడుగుతాడు. మీరు పక్కకు రండి మాట్లాడుకుందాం అంటుంది దీప. పక్కకు వెళ్ళిన తర్వాత మళ్లీ అదే ప్రశ్న వేస్తాడు కార్తీక్.నర్సింహా వచ్చి గొడవ చేస్తే మధ్యలో మీ కేంటి అని నిలదీస్తుంది దీప. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X