Karthika Deepam 2 1st July Episode: శౌర్య కోసం కార్తీక్ క్షమాపణ.. శ్రీధర్‌కు దీప వార్నింగ్!

కాంచనకి ఒంట్లో బాగోలేదు అని తెలిసి ఆమెకి సాయం చేయటానికి వాళ్ళ ఇంటికి వెళుతుంది దీప. అక్కడ శ్రీధర్ గురించి కాంచనతో చెప్పాలి అనుకుంటుంది కానీ కాంచన పరిస్థితి చూసి చెప్పలేక పోతుంది. ఫాదర్స్ డే రోజు ఇంటికి వచ్చిన శౌర్యని బాధ పెట్టి పంపిస్తుంది పారిజాతం. ఫాదర్స్ డే ఫంక్షన్ కి కార్తీక్ ని రమ్మని చెప్తుంది శౌర్య. అయితే ఫంక్షన్ కి వచ్చిన కార్తీక్ కి అక్కడ నర్సింహ కనిపించడంతో గొడవలవుతాయని దీపకి కనిపించడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 1వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 85వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

రౌడీ స్కూల్ కి ఎందుకు వారం రోజులు వెళ్ళకూడదు అంటాడు కార్తీక్. నిజం చెప్పడం ఇష్టం లేని దీప మా ఊరు వెళ్లాలనుకుంటున్నాను అంటుంది. మనకంటూ ఏమీ లేని చోటుకి మనం వెళ్లినా ఏమీ ఉపయోగం ఉండదు అంటూ శౌర్య దగ్గరికి వస్తాడు కార్తీక్. కానీ శౌర్య కార్తీక్ మీద అలుగుతుంది ఏం జరిగింది అని అడుగుతాడు కార్తీక్. ఫంక్షన్ కి రమ్మన్నాను కదా ఎందుకు రాలేదు అంటుంది శౌర్య కుదరలేదు వేరే పని ఉంటే వెళ్ళిపోయాను అంటాడు కార్తీక్.

Karthika Deepam 2 Serial 1st July 2024 Episode Number 85 Here is full story

కాదు నువ్వు వచ్చినట్లు నాకు అనిపించింది కానీ పిలిస్తే పలకలేదు అంటూ మారం చేస్తుంది శౌర్య. అలా ప్రవర్తించకూడదు అంటుంది దీప. ఇది ఫ్రెండ్స్ మధ్య జరుగుతున్న గొడవ అంటూ దీపని ఇన్వాల్వ్ అవ్వద్దు అంటారు కార్తీక్, శౌర్య.ఆ తర్వాత ఈ ఫ్రెండ్ ని మరెప్పుడు వదిలేసి వెళ్ళిపోవు కదా, అలా అని ప్రామిస్ చేయు అంటుంది శౌర్య. అలాగే ప్రామిస్ చేస్తాడు కార్తీక్. తర్వాత శౌర్య చేతిలో చాక్లెట్ పెట్టి నేను నిన్ను రెస్టారెంట్ కి తీసుకు వెళ్తాను రెడీ అవ్వు అంటాడు.

నర్సింహ మాటలకి భయంతో ఉన్న దీప పంపించను అంటుంది. మీరు కూడా రండి అంటాడు కార్తీక్. దీప అందుకు ఒప్పుకోదు కానీ శౌర్య బలవంతం పెట్టడంతో పాటు నర్సింహ మాటలకి భయపడటం వలన శౌర్య కి తోడుగా వెళ్లాలనుకుని రెస్టారెంట్ కి వెళ్లడానికి ఒప్పుకుంటుంది దీప. మీరు రెడీ అయి ఉండండి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి సుమిత్ర ఇంట్లోకి వెళ్ళిపోతాడు కార్తీక్. అప్పుడే సుమిత్ర వాళ్ళ ఇంట్లో పెళ్లి గురించి డిస్కషన్ అవుతూ ఉంటాయి.

Karthika Deepam 2 Serial 1st July 2024 Episode Number 85 Here is full story

అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. జ్యోత్స్న ని ట్రీట్ కి తీసుకువెళ్తాను అంటాడు. జ్యోత్స్న ఒక్కతినేనా అని అడుగుతుంది సుమిత్ర. లేదు అమ్మ వాళ్లు కూడా వస్తున్నారు, అలాగే దీప, శౌర్య కూడా వస్తున్నారు అంటాడు కార్తీక్. వెంటనే జ్యోత్స్న ముఖం మారిపోతుంది. పారిజాతం ఇప్పుడు దీప ఎందుకు అని కోపంగా అడుగుతుంది. నేను శౌర్య ని తీసుకువెళ్దాం అనుకుంటే అమ్మ దీపని కూడా తీసుకురా అని చెప్పింది అంటూ అబద్ధం చెప్పేస్తాడు.

మనసులో అలా చెప్పినందుకు తల్లికి క్షమాపణ చెప్పుకుంటాడు. నువ్వు రెడీ అయి ఉండు నేను మళ్ళీ వస్తాను అంటాడు కార్తీక్. లేదు నేను నా కార్లో వస్తాను అంటుంది జ్యోత్స్న. సరే నాకు పని ఉంది నేను వెళ్తాను అని వెళ్ళిపోతాడు కార్తీక్. తర్వాత మనవరాలు తో నేను కూడా వస్తాను అంటుంది పారిజాతం. ఆమె వద్దు అనటంతో వీడు దీప ని ఎందుకు తీసుకువెళుతున్నాడో, అక్కడ ఏం జరుగుతుందో అనే టెన్షన్ పట్టుకుంటుంది పారిజాతానికి. నెక్స్ట్ సీన్ లో స్వప్న తల్లిని తీసుకొని బయటికి వస్తుంది.

కార్తీక్ కి ఫోన్ చేసి అమ్మకి ట్రీట్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఏ రెస్టారెంట్ బాగుంటుంది అని అడుగుతుంది. జ్యోత్స్న రెస్టారెంట్ కి వచ్చేయ్ నేను కూడా అక్కడే ఉన్నాను అంటాడు కార్తీక్. సరే అని ఫోన్ పెట్టేస్తుంది స్వప్న. తర్వాత రెస్టారెంట్ కి వచ్చిన కార్తీక్ ఫ్యామిలీని స్టాఫ్ గ్రాండ్ గా రిసీవ్ చేసుకుంటారు. అంత పెద్ద హోటల్ చూసిన శౌర్య మీ టిఫిన్ సెంటర్ కూడా ఇంతే ఉంటుందా అని తల్లిని అడుగుతుంది. ఈ హోటల్లో బాత్రూం అంత కూడా ఉండదు అని వెటకారంగా చెప్తుంది జ్యోత్స్న.

ఏమో ఎవరికి తెలుసు రేపు అదే చిన్న హోటల్ ఇంత పెద్ద రెస్టారెంట్ అవుతుందేమో అంటాడు కార్తీక్. బాగానే వెనకేసుకొస్తున్నావు అని అనుకుంటుంది జ్యోత్స్న. తరువాత శౌర్యకి ఏం కావాలో అడుగుతాడు కార్తీక్. తనకేం కావాలో చెప్తుంది శౌర్య.పెళ్లి మాటలు మాట్లాడటానికి వస్తూ దీప ని ఎందుకు వెంటబెట్టుకొచ్చాడో అని అనుమానపడతాడు శ్రీధర్. అప్పుడే అక్కడికి వస్తున్న స్వప్న వాళ్ళని చూసి టెన్షన్ పడుతుంది దీప. వెంటనే శ్రీధర్ ని హెచ్చరిస్తుంది. వాళ్లను చూసిన శ్రీధర్ టెన్షన్ పడతాడు తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X